iDreamPost
android-app
ios-app

IND vs ENG: వీడియో: సూర్యకుమార్​కు సర్ఫరాజ్ తండ్రి కృతజ్ఞతలు.. అతడి వల్లేనంటూ..!

  • Published Feb 16, 2024 | 10:49 AM Updated Updated Feb 16, 2024 | 11:09 AM

డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్​లోనూ ఘనంగా అరంగేట్రం చేశాడు. సూపర్బ్ నాక్​తో అందరి కళ్లు తన వైపు తిప్పుకున్నాడు.

డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్​లోనూ ఘనంగా అరంగేట్రం చేశాడు. సూపర్బ్ నాక్​తో అందరి కళ్లు తన వైపు తిప్పుకున్నాడు.

  • Published Feb 16, 2024 | 10:49 AMUpdated Feb 16, 2024 | 11:09 AM
IND vs ENG: వీడియో: సూర్యకుమార్​కు సర్ఫరాజ్ తండ్రి కృతజ్ఞతలు.. అతడి వల్లేనంటూ..!

డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపిన సర్ఫరాజ్​ ఖాన్ కల ఎట్టకేలకు నెరవేరింది. భారత జట్టులో చోటు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ యంగ్ బ్యాటర్ డ్రీమ్ రాజ్​కోట్ టెస్ట్​తో తీరింది. దేశవాళీ క్రికెట్​లో సెంచరీల మీద సెంచరీలు బాదినా, పరుగుల వర్షం కురిపించినా చాన్నాళ్ల పాటు సర్ఫరాజ్​కు మొండిచెయ్యి ఎదురైంది. అతడ్ని సెలక్టర్లు అస్సలు పట్టించుకోలేదు. టీమ్​లో చాలా మంది స్టార్లు ఉండటంతో సర్ఫరాజ్​కు ఛాన్స్ రాలేదు. ఓవర్ వెయిట్​తో ఉన్నాడంటూ సర్ఫరాజ్​ను సెలక్షన్​కు దూరం పెట్టడం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎట్టకేలకు ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు అతడికి పిలుపు అందింది. మూడో టెస్టులో అతడికి ఛాన్స్ లభించింది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న సర్ఫరాజ్.. 62 పరుగుల మెరుపు ఇన్నింగ్స్​తో అలరించాడు. ఈ క్రమంలో అతడి తండ్రి నౌషద్ ఖాన్ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్​కు తాను రుణపడి ఉన్నానని అన్నారు.

ఇంగ్లండ్​తో చివరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. అయితే రాజ్​కోట్​ టెస్టులో అతడికి ఆడే ఛాన్స్ వస్తుందో లేదోననేది క్లారిటీ లేకుండా పోయింది. దీంతో సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ ఆ మ్యాచ్​కు వెళ్లేందుకు నిరాకరించాడు. అనారోగ్యంతో బాధపడుతుండటం, సర్ఫరాజ్​కు తుదిజట్టులో చోటు దక్కుతుందో లేదోననే స్పష్టత లేకపోవడంతో నౌషద్ రాజ్​కోట్​కు వెళ్లొద్దని భావించారట. అయితే మ్యాచ్ ముందు రోజు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఆయనకు కాల్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా నౌషద్ ఖాన్ తెలిపారు. సూర్య చెప్పడం వల్లే తాను మ్యాచ్​కు వచ్చానని.. అందుకు అతడికి రుణపడి ఉంటానని చెప్పారు. సూర్య నుంచి వెళ్లాలనే మెసేజ్ రాకపోతే తాను ఎంతో మిస్ అయ్యేవాడ్నని నౌషద్ పేర్కొన్నారు.

రాజ్​కోట్​కు తొలుత రావొద్దనే అనుకున్నా. జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో వెళ్లొద్దని భావించా. అప్పుడు మీరు వెళ్తున్నారా అని సూర్యకుమార్ అడిగాడు. సర్ఫరాజ్​ నన్ను ఎంతో ప్రేమిస్తాడు. నేను వెళ్తే అతడు సరిగ్గా ఆడడని సూర్యకు చెప్పా. అదే తరుణంలో సర్ఫరాజ్​కు తుదిజట్టులో ఛాన్స్ వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. పిచ్​ను చూశాక ఎలాంటి టీమ్​ కాంబినేషన్​తో వెళ్తారు కాబట్టి అతడికి టెస్ట్ క్యాప్ లభిస్తుందో లేదోననే డౌట్​ ఉండేది. కానీ సూర్య మాత్రం ఇలాంటి క్షణాలు జీవితంలో మళ్లీ రావని చెప్పాడు. తాను కూడా డెబ్యూ మ్యాచ్​లో పేరెంట్స్​ను తీసుకెళ్లానని గుర్తుచేశాడు. దీంతో నేను రాజ్​కోట్​కు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పా. సర్ఫరాజ్ తల్లిని కూడా ఇక్కడికి తీసుకొద్దామని అనుకున్నా. కానీ ఫ్లైట్ టికెట్ ఒకటే దొరకడంతో నేను మాత్రమే వచ్చా. మా అందరి కల నెరవేరింది’ అని చెబుతూ నౌషద్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. మరి.. సూర్యకు రుణపడి ఉంటానంటూ సర్ఫరాజ్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సర్ఫరాజ్‌ రనౌట్‌కు అనిల్‌ కుంబ్లేనే కారణం! క్రేజీ సెంటిమెంట్‌..

 

View this post on Instagram

 

A post shared by Cricnewsinsta (@cric.newsinsta)