iDreamPost

సర్ఫరాజ్‌ రనౌట్‌కు అనిల్‌ కుంబ్లేనే కారణం! క్రేజీ సెంటిమెంట్‌..

Anil Kumble-Sarfaraz Khan: టీమిండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ ను తొలి మ్యాచ్ లోనే రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. అయితే ఈ రనౌట్ కు కారణం భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

Anil Kumble-Sarfaraz Khan: టీమిండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ ను తొలి మ్యాచ్ లోనే రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. అయితే ఈ రనౌట్ కు కారణం భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

సర్ఫరాజ్‌ రనౌట్‌కు అనిల్‌ కుంబ్లేనే కారణం! క్రేజీ సెంటిమెంట్‌..

సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేశాడు ఈ చిచ్చరపిడుగు. దేశవాలీ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగుతూ.. సెలెక్టర్లకు ఎప్పటికప్పుడు తానున్నానంటూ.. హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు. రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత సెలెక్టర్ల నుంచి పిలుపు రావడంతో.. సంతోషంలో మునిగిపోయాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే ఫిఫ్టీతో చెలరేగిన అతడిని రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. అయితే సోషల్ మీడియాలో ఓ క్రేజీ సెంటిమెంట్ వైరల్ గా మారింది. అదేంటంటే? సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ కు కారణం దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అని. మరి ఆ సెంటిమెంట్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా రంగంలో కొన్ని సంఘటనలు యాదృశ్చికంగానో లేదా కాకతాలియంగానో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా మనకు క్రికెట్ లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని క్రేజీ సెంటిమెంట్స్ గా క్రీడాభిమానులు పిలుస్తూ ఉంటారు. తాజాగా అలాంటి సెంటిమెంట్ ఒకటి ఈ మ్యాచ్ లో చోటుచేసుకుంది. కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత దేశవాలీ సంచలనం, అభినవ బ్రాడ్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కు టీమిండియాలో చోటు దక్కింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తో సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి అడుగుపెట్టాడు.

ఇక ఈ మ్యాచ్ లో 62 పరుగులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు ఈ యంగ్ బ్యాటర్. కానీ దురదృష్టవశాత్తు రనౌట్ కావడంతో.. నిరాశగా పెవిలియన్ వైపు వెళ్లాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ రనౌట్ కు కారణం ఇదే అంటూ నెటింట్ట నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అట. దానికీ ఓ సెంటిమెంట్ ఉందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కారణం ఏంటంటే? సర్ఫరాజ్ ఖాన్ కు టీమిండియా క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు అనిల్ కుంబ్లే. మంచి విషయమేగా ఇందులో ఏముందంటారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

1990లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో టీమిండియాలోకి డెబ్యూ చేశాడు ఈ దిగ్గజ స్పిన్నర్. ఇక డ్రాగా ముగిసిన ఆ టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే కూడా రనౌట్ గానే వెనుదిరిగాడు. కాగా.. ఇప్పుడు కూడా సేమ్ ఇంగ్లాండ్ తోనే జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ డెబ్యూ చేయడమే కాకుండా.. కుంబ్లే లాగనే రనౌట్ అవ్వడం ఆశ్చర్యకరమైన విషయం. దీంతో అప్పుడు ఆయన.. ఇప్పుడు ఈయన అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి సెంటిమెంట్ అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. మరి సర్ఫరాజ్ రనౌట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Sarfaraz Khan: తొలి మ్యాచ్‌తోనే చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి