Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ అలా చేస్తే మాత్రం కుదరదన్నాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ అలా చేస్తే మాత్రం కుదరదన్నాడు.
Nidhan
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగుల భారీ స్కోరుకు ఆలౌట్ అయింది. హిట్‌మ్యాన్ (131)తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (112) కూడా సెంచరీతో చెలరేగాడు. అరంగేట్ర ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్ (62), ధృవ్ జురెల్ (46) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ రెండో రోజు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆ టీమ్ బజ్‌బాల్ ఫార్ములాతో దూకుడుగా ఆడుతోంది. బెన్ డకెట్ (133 నాటౌట్) మెరుపు శతకంతో విజృంభించాడు. మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే ప్రత్యర్థి జట్టును భారత్ త్వరగా ఆలౌట్ చేయాలి. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో జడేజాకు రోహిత్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారత్ కంటే మరింత భారీ స్కోరు చేయాలనుకున్న ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చెలరేగుతోంది. ముఖ్యంగా డకెట్ ధనాధన్ షాట్లు ఆడుతూ టీమిండియా బౌలర్లను భయపెడుతున్నాడు. అతడు ఏకంగా 21 ఫోర్లు, 2 భారీ సిక్సులు కొట్టాడు. ఒకవైపు డకెట్ చెలరేగుతుండటం, మరోవైపు భారత బౌలర్లు ఓ ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు బౌలింగ్ చేయడంతో రన్స్ బాగా లీక్ అయ్యాయి. స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్తుండటం, వికెట్ పడకపోవడంతో సారథి రోహిత్ ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. అలాంటి టైమ్‌లో జడేజా పదే పదే నో బాల్స్ వేశాడు. దీంతో అతడిపై హిట్‌మ్యాన్ సీరియస్ అయ్యాడు. నో బాల్స్ వేస్తే ఇక్కడ కుదరదన్నాడు. ‘జడ్డూ.. ఇది టీ20 మ్యాచ్ అనుకో. ఇక్కడ నో బాల్స్ వేయడం కుదరదు’ అని రోహిత్ గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టెస్టు మ్యాచ్ అనుకొని బౌలింగ్ చేస్తే నో బాల్స్ పోతున్నాయని.. కాబట్టి దీన్ని టీ20 మ్యాచ్‌గా భావించమంటూ జడేజాకు రోహిత్ సూచించాడు. దీంతో జడ్డూ మళ్లీ తన రనప్‌ను సెట్ చేసుకొని బౌలింగ్ చేశాడు. ఆట రెండో రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మూడో టెస్టులో భారత్ బాగానే బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్‌లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ ఛేంజెస్ సరిగ్గా లేవని.. ఎలాంటి ప్లానింగ్ లేకుండానే బౌలర్లు బంతులు సంధించారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం మూడో రోజైనా పక్కా ప్లానింగ్‌తో బౌలింగ్ చేయాలని.. లేకపోతే ఇంగ్లండ్ మ్యాచ్‌ను లాగేసుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మరి.. జడేజాకు రోహిత్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs ENG: మూడో టెస్టు నుంచి అశ్విన్ ఔట్.. టెన్షన్లో టీమిండియా! స్టోక్స్ ఒప్పుకుంటే..
Rohit Sharma said, “Jaddu samajh ye T20 hai, idhar no balls allowed nahi hai ( Jaddu think it’s a T20 game no balls are not allowed here).”pic.twitter.com/p9a4JzZu7a
— CricketGully (@thecricketgully) February 16, 2024