iDreamPost
android-app
ios-app

IND vs ENG: తొలి టెస్ట్​లో ఓటమి.. భారత కెప్టెన్​ను టార్గెట్ చేసుకున్న మైకేల్ వాన్!

  • Published Jan 30, 2024 | 6:45 PM Updated Updated Jan 30, 2024 | 6:45 PM

తొలి టెస్టులో ఇంగ్లండ్​ చేతిలో ఓడి బాధలో ఉన్న టీమిండియా సెకండ్ మ్యాచ్​లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. ఈ తరుణంలో భారత కెప్టెన్​ రోహిత్ శర్మను ఇంగ్లీష్ టీమ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ టార్గెట్ చేసుకున్నాడు.

తొలి టెస్టులో ఇంగ్లండ్​ చేతిలో ఓడి బాధలో ఉన్న టీమిండియా సెకండ్ మ్యాచ్​లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. ఈ తరుణంలో భారత కెప్టెన్​ రోహిత్ శర్మను ఇంగ్లీష్ టీమ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ టార్గెట్ చేసుకున్నాడు.

  • Published Jan 30, 2024 | 6:45 PMUpdated Jan 30, 2024 | 6:45 PM
IND vs ENG: తొలి టెస్ట్​లో ఓటమి.. భారత కెప్టెన్​ను టార్గెట్ చేసుకున్న మైకేల్ వాన్!

విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్ట్​కు టీమిండియా సిద్ధమవుతోంది. ఉప్పల్ టెస్ట్​లో అనూహ్యంగా ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా గాయాలతో వైజాగ్ టెస్ట్​కు దూరమయ్యారు. దీంతో భారత బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ తప్పితే మరో ఎక్స్​పీరియెన్స్​డ్ బ్యాట్స్​మన్ టీమ్​లో కనిపించడం లేదు. దీంతో రెండో టెస్టులో భారత్ ఎలా ఆడుతుందోననేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తొలి టెస్టులో టీమిండియా ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వాన్. హిట్​మ్యాన్ కెప్టెన్​గా దారుణంగా ఫెయిలయ్యాడని అన్నాడు.

భారత్​ను వాళ్ల సొంతగడ్డ మీద ఓడించడం అంత ఈజీ కాదన్నాడు మైకేల్ వాన్. అయితే దాన్ని ఇంగ్లండ్ సాధ్యం చేసి చూపించిందన్నాడు. మొదటి టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా యావరేజ్​గా ఉందన్నాడు. అదే భారత్​ను దెబ్బతీసిందన్నాడు. ఇంగ్లండ్ అటాక్​ చేస్తున్నప్పుడు వాళ్లు కూడా అటాక్ చేయాల్సిందని.. కానీ డిఫెన్సివ్ అప్రోచ్​ వల్ల నష్టపోయారని చెప్పాడు. ‘హైదరాబాద్​లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫెయిల్యూర్ ఒక కారణం. ఆ మ్యాచ్​లో అతడి సారథ్యం చాలా సాదాసీదాగా ఉంది. అతడు సరిగ్గా స్పందించలేదు. అంత చురుగ్గా కనిపించలేదు. బౌలింగ్ ఛేంజెస్​తో పాటు ఫీల్డ్ సెటింగ్ విషయంలోనూ అతడు డిఫెన్సివ్ అప్రోచ్​నే ఫాలో అయ్యాడు. రివర్స్ స్వీప్ వంటి వైవిధ్యమైన షాట్లతో విరుచుకుపడిన ఓలీ పాప్​ను ఎలా ఔట్ చేయాలనే విషయంలో హిట్​మ్యాన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది’ అని వాన్ చెప్పుకొచ్చాడు.

భారత్​లో గెలవడం చాలా కష్టమని.. కానీ ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులోనే విజయం సాధించడం అద్భుతమని వాన్ మెచ్చుకున్నాడు. స్వదేశంలో సింహం లాంటి ఇండియన్ టీమ్​ను ఓడించడం అంత ఈజీ కాదన్నాడు. ఫస్ట్ టెస్ట్​కు ఆతిథ్యం ఇచ్చిన ఉప్పల్ వికెట్​లో మంచి టర్న్ ఉందని.. ఫస్ట్ ఇన్నింగ్స్​లో టీమిండియా 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించిందని వాన్ తెలిపాడు. అలాంటి పరిస్థితుల్లోనూ పోరాడి రోహిత్ సేన మీద నెగ్గడం మామూలు విషయం కాదన్నాడు. ఇది ఇంగ్లీష్ టీమ్ సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఒకటి అని పేర్కొన్నాడు వాన్. ఒకవైపు అటాకింగ్ గేమ్​తో ఇంగ్లండ్ డామినేషన్ ప్రదర్శిస్తే.. రోహిత్ మాత్రం డిఫెన్సివ్ అప్రోచ్​కే పరిమితమై మూల్యం చెల్లించుకున్నాడని వాన్ వ్యాఖ్యానించాడు. మరి.. తొలి టెస్టులో భారత్ ఓటమికి రోహిత్ కెప్టెన్​గా ఫెయిల్ అవడమే కారణమంటూ వాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.