Nidhan
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత్.. ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌కు రెడీ అవుతోంది. అయితే ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్సీ విషయంలో అనూహ్య మార్పు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత్.. ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌కు రెడీ అవుతోంది. అయితే ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్సీ విషయంలో అనూహ్య మార్పు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సీనియర్స్ ఒక్కొక్కరుగా ఈ సిరీస్‌కు దూరం అవుతూ వచ్చినా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో కుర్రాళ్ళు అద్భుత ప్రదర్శన చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీమిండియా ఈ టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక, చివరిదైన ఐదో టెస్ట్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ గ్యాప్‌లో భారత అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. లాస్ట్ టెస్ట్‌కు సారథి రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదట. హిట్‌మ్యాన్ చాలా కాలంగా విరామం తీసుకోకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఒకవైపు సీనియర్స్ అంతా టీమ్‌కు దూరమైనా రోహిత్ ఒక్కడే తన బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే.. ఎలాగో టెస్ట్ సిరీస్ గెలిచేయడంతో.. నామమాత్రంగా మిగిలిన చివరి టెస్ట్‌కు హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పేసర్లుకు అనుకూలించే ధర్మశాలలో చివరి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చివరి టెస్ట్‌కు బుమ్రాను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుమ్రాకు ఇది వరకు కెప్టెన్‌గా కొంత అనుభవం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే బ్యాటర్‌గా రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన రజత్ పాటిదార్‌కు మరో అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి పాటిదార్ పై వేటు వేసి.. దేవదత్ పడిక్కల్‌కు అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. అయితే.. ఇప్పుడు రోహిత్ రెస్ట్ తీసుకోవడంతో పడిక్కల్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. దీంతో.. రజత్ సేఫ్ జోన్లోనే ఉన్నట్టు అయ్యింది.
నిన్న మొన్నటి వరకు ఇండియన్ టెస్ట్ టీమ్‌కు రోహిత్, కోహ్లీ, పుజారా, రహానే, రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్స్ పెద్ద అండగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు హిట్‌మ్యాన్ కూడా తప్పుకుంటే.. టీమిండియాలో ఒక్క సీనియర్ బ్యాటర్ కూడా కనిపించే అవకాశం లేదు. దీంతో.. జూనియర్స్‌కు ఇదే మంచి అవకాశం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బౌలింగ్‌లో మాత్రం భారత్ సీనియర్స్, జూనియర్స్ కలయికతో సమతూకంతో కనిపిస్తోంది. మరి.. ఒక్క సీనియర్ సలహాలు కూడా లేకుండా ఐదో టెస్టులో కుర్రాళ్ళు ఎంత వరకు కుమ్మేస్తారు అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్లో బెర్త్ దక్కాలంటే ప్రతి మ్యాచ్ గెలవడం, పాయింట్స్ పెంచుకోవడం అత్యవసరం. మరి.. బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCB అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాదు! IPLకి ముందు కొత్త అర్థం!