iDreamPost
android-app
ios-app

సర్ఫరాజ్​ను నమ్మని రోహిత్! చేతులారా వికెట్ మిస్! ఇలా చేశాడేంటి..?

  • Published Mar 07, 2024 | 1:34 PM Updated Updated Mar 07, 2024 | 1:34 PM

ధర్మశాల టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ తప్పు చేశాడు. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్​ ఖాన్​ను అతడు నమ్మకపోవడంతో భారత్ నష్టపోయింది.

ధర్మశాల టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ తప్పు చేశాడు. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్​ ఖాన్​ను అతడు నమ్మకపోవడంతో భారత్ నష్టపోయింది.

  • Published Mar 07, 2024 | 1:34 PMUpdated Mar 07, 2024 | 1:34 PM
సర్ఫరాజ్​ను నమ్మని రోహిత్! చేతులారా వికెట్ మిస్! ఇలా చేశాడేంటి..?

ధర్మశాల టెస్టు ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. పిచ్​ బ్యాటింగ్​తో పాటు స్పిన్​కు కూడా సహకరిస్తోంది. అయితే ఇంగ్లీష్ టీమ్ పట్టుదలగా బ్యాటింగ్ చేస్తుండటంతో వికెట్లు తీయడం కష్టంగా మారుతోంది. కానీ ఓ ఈజీ వికెట్​​ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మిస్ చేశాడు. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్​ ఖాన్​ను హిట్​మ్యాన్ నమ్మకపోవడం భారత్​ను దెబ్బతీసింది. ఇది స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్​లో చోటుచేసుకుంది. సూపర్బ్​గా బ్యాటింగ్ చేస్తున్న జాక్ క్రాలేను ఔట్ చేసేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఓ అద్భుతమైన బంతితో అతడి పనిపట్టాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. కానీ సర్ఫరాజ్​ ఖాన్​ను రోహిత్ నమ్మకపోవడంతో క్రాలే బతికిపోయాడు.

కుల్దీప్ వేసిన బాల్​ను డిఫెన్స్ చేయబోయాడు క్రాలే. కానీ బాల్ అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. దీంతో షార్ట్​ లెగ్​లో కాచుకొని ఉన్న సర్ఫరాజ్ దాన్ని డైవ్ చేసి అందుకున్నాడు. దీంతో సర్ఫరాజ్, శుబ్​మన్ గిల్ అప్పీల్ చేశారు. కానీ కీపర్ ధృవ్ జురెల్, కెప్టెన్ రోహిత్ శర్మ సహా మిగిలిన ప్లేయర్లు ఎవరూ సర్ఫరాజ్​కు సపోర్ట్ చేయలేదు. బ్యాటర్​ అడ్డంగా ఉండటంతో ఆ బాల్ జురెల్​కు సరిగ్గా కనిపించలేదు. అతడు ఎడ్జ్​ను అంచనా వేయలేకపోయాడు. దీంతో రివ్యూకు వెళ్లే విషయంలో మౌనంగా ఉండిపోయాడు. అది పక్కా ఔట్, బాల్ ఎడ్జ్ తీసుకుందని సర్ఫరాజ్ మొత్తుకున్నాడు. అయినా రోహిత్ అతడి మీద నమ్మకం ఉంచలేదు. డీఆర్ఎస్​ తీసుకునేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత రీప్లేలో బాల్ క్రాలే బ్యాట్​కు ఎడ్జ్ తీసుకుందని తేలింది.

బిగ్ స్క్రీన్​ మీద రీప్లే చూశాక సర్ఫరాజ్ ఏం మాట్లాడో తెలియక నవ్వుతూ ఉండిపోయాడు. దీన్ని చూసి రోహిత్ నిరాశ చెందాడు. ఇది చూసిన నెటిజన్స్.. సర్ఫరాజ్​పై నమ్మకం ఉంచితే బాగుండేదని అంటున్నారు. క్రాలే వికెట్ మీద పాతుకుపోయాడని.. అతడ్ని ఔట్ చేసే ఛాన్స్ వచ్చినా చేజేతులా మిస్ చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. రివ్యూల విషయంలో భారత్ మరింత పక్కాగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక, ఇంగ్లండ్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 129 పరుగులతో ఉంది. క్రాలే (75 నాటౌట్​) పాటు జో రూట్ (13 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. క్రాలే క్యాచ్ విషయంలో సర్ఫరాజ్​ను రోహిత్ నమ్మకపోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: గిల్ సూపర్ క్యాచ్.. మెరుపు వేగంతో పరిగెడుతూ..!