iDreamPost
android-app
ios-app

IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్.. ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్​గా రికార్డు!

  • Published Feb 05, 2024 | 9:59 PM Updated Updated Feb 06, 2024 | 4:23 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఏ సారథికి సాధ్యం కాని ఓ రేర్ ఫీట్​ను హిట్​మ్యాన్ అందుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఏ సారథికి సాధ్యం కాని ఓ రేర్ ఫీట్​ను హిట్​మ్యాన్ అందుకున్నాడు.

  • Published Feb 05, 2024 | 9:59 PMUpdated Feb 06, 2024 | 4:23 PM
IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్.. ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్​గా రికార్డు!

టీమ్ పనైపోయిందన్నారు. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవాలన్నారు. బ్యాటర్​గానూ, సారథిగానూ ఫెయిలవుతున్నాడు.. జట్టులో నుంచి తీసేయండంటూ తీవ్ర విమర్శలు చేశారు. కానీ హిట్​మ్యాన్ దేన్నీ లెక్క చేయలేదు. ఒక్క గెలుపు చాలు.. అప్పటిదాకా వచ్చిన విమర్శలు, నెగెటివిటీ అన్నీ కొట్టుకుపోతాయని బలంగా నమ్మాడు. పక్కా నెగ్గుతామనే విశ్వాసంతో గ్రౌండ్​లోకి దిగి.. ఇంగ్లండ్ పని పట్టాడు. ఉప్పల్ టెస్టులో తమను ఓడించిన ఇంగ్లీష్ టీమ్ మీద రివేంజ్ తీర్చుకున్నాడు. 600 టార్గెట్​ అయినా ఛేజ్ చేస్తామంటూ ఓవరాక్షన్ చేసిన ప్రత్యర్థి జట్టును 293 పరుగులకే కట్టడి చేసి ఓటమి రుచి చూపించాడు. ఈ గెలుపులో హిట్​మ్యాన్ కెప్టెన్సీతో పాటు బుమ్రా, అశ్విన్ బౌలింగ్.. జైస్వాల్, గిల్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ చాలా కీలకమనే చెప్పాలి. అయితే ఈ విజయం ద్వారా ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు రోహిత్.

ఇంగ్లండ్​పై రెండో టెస్టులో విజయంతో తన మీద వస్తున్న నెగెటివిటీ, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రోహిత్ శర్మ. అలాగే ఈ విక్టరీతో ఓ అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్​లో బజ్​బాల్​ ఫార్ములాను చిత్తు చేసిన తొలి ఆసియా కెప్టెన్​గా హిట్​మ్యాన్ అవతరించాడు. న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ మే 12, 2022లో ఇంగ్లండ్ కోచ్​గా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి టెస్టుల్లో బజ్​బాల్ ఫార్ములాతో దుమ్మురేపుతోంది ఇంగ్లీష్ టీమ్. గెలుపోటములతో సంబంధం లేకుండా ఫెయిలైనా పట్టించుకోకుండా అటాకింగ్ గేమ్​తో అదరగొడుతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా చాలా టీమ్స్​ను చిత్తు చేసింది. పాకిస్థాన్​ను వాళ్ల సొంతగడ్డ మీద దారుణంగా ఓడించింది. దీంతో బజ్​బాల్ అంటేనే అందరూ వణికిపోతున్నారు.

టెస్టుల్ని మూడు నుంచి నాల్రోజుల్లో ముగిస్తోంది ఇంగ్లండ్. మ్యాచ్​లో రిజల్ట్ రావడమే లక్ష్యంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​లో దూకుడుగా ఆడుతూ మంచి ఫలితాలు సాధిస్తోంది. ఆ టీమ్​ను ఎలా ఎదుర్కోవాలో తెలియక పెద్ద జట్లన్నీ తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లీష్ టీమ్ ఇక్కడ కూడా బజ్​బాల్ మంత్రాన్నే జపిస్తోంది. ఇదే ఫార్ములాతో తొలి టెస్టులో భారత్​ను ఓడించింది. కానీ రెండో టెస్టులో రోహిత్ అండ్ కో ముందు స్టోక్స్ సేన ఆటలు సాగలేదు. ఇంగ్లండ్​ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసి రియల్ టెస్ట్‌ అంటే ఏంటో టీమిండియా చూపించింది. ఈ విక్టరీతో రెండేళ్లుగా బజ్​బాల్​ ఫార్ములాతో అదరగొడుతున్న ఇంగ్లండ్​ను ఓడించిన ఏకైక ఆసియా కెప్టెన్​గా రోహిత్ నిలిచాడు. మరి.. రోహిత్ సేన బజ్​బాల్​ను చిత్తు చేసిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.