iDreamPost
android-app
ios-app

Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఏ భారత బౌలర్​కు సాధ్యం కాని అరుదైన రికార్డు!

  • Published Jan 25, 2024 | 12:39 PM Updated Updated Jan 25, 2024 | 12:39 PM

టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా ఏ భారత బౌలర్​కు సాధ్యం కాని ఓ రేర్ ఫీట్​ను నమోదు చేశాడు.

టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా ఏ భారత బౌలర్​కు సాధ్యం కాని ఓ రేర్ ఫీట్​ను నమోదు చేశాడు.

  • Published Jan 25, 2024 | 12:39 PMUpdated Jan 25, 2024 | 12:39 PM
Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఏ భారత బౌలర్​కు సాధ్యం కాని అరుదైన రికార్డు!

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​కు ఉప్పల్​ స్డేడియం వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉండటంతో భారత్​ను డిఫెన్స్​లోకి నెడదామని అతడు ఈ డిసిషన్ తీసుకున్నాడు. అందుకు తగ్గట్లే ఆ టీమ్​కు మంచి స్టార్ట్ కూడా లభించింది. ముందు నుంచి చెబుతున్నట్లుగానే బజ్​బాల్​ క్రికెట్​తో ఆడిన పర్యాటక జట్టు తొలి అరగంటలో అదరగొట్టింది. వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది ఇంగ్లండ్. మంచి రన్​రేట్​తో బౌండరీల మీద బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు ప్రత్యర్థి బ్యాటర్లు. అయితే స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రాకతో అంతా మారిపోయింది. 5 పరుగుల గ్యాప్​లో 3 వికెట్లు పడ్డాయి. ఓపెనర్లిద్దర్నీ ఔట్ చేసిన అశ్విన్ చరిత్ర సష్టించాడు.

క్రీజులో సెటిలైన జాక్ క్రాలే (25)ను తొలుత ఔట్ చేసిన అశ్విన్.. ఆ తర్వాత బెన్ డకెట్ (35)కు పెవిలియన్​ దారి చూపించాడు. ఆ తర్వాత ఓలీ పాప్ (1)ని రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఓపెనర్లిద్దర్నీ ఔట్ చేసిన అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటిదాకా ఏ భారత బౌలర్​కు సాధ్యం కాని ఫీట్​ను నమోదు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ హిస్టరీలో 150 వికెట్లు తీసిన తొలి టీమిండియా బౌలర్​గా, మొత్తంగా మూడో బౌలర్​గా నిలిచాడు. అలాగే తన వికెట్ల సంఖ్యను 492కు పెంచుకున్నాడు. మరో 8 వికెట్లు తీస్తే 500 వికెట్ల క్లబ్​లోకి అశ్విన్ చేరతాడు. అతడి జోరు చూస్తుంటే ఈ మ్యాచ్​లోనే ఆ క్లబ్​లో జాయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక, వెంటవెంటనే మూడు వికెట్లు పడటంతో ఇంగ్లండ్​కు ఏం చేయాలో పాలుపోలేదు.

ashwin create history

బజ్​బాల్ ఫార్ములాతో ఆడితే తొలి అరగంటలో ఈజీగా 55 రన్స్ వచ్చాయి. పిచ్ బ్యాటింగ్​కు సహకరిస్తుండటం, పేస్ బౌలర్లకు వికెట్ నుంచి ఎలాంటి హెల్ప్ లేకపోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కానీ స్పిన్నర్ల రంగ ప్రవేశంతో వాళ్ల పప్పులు ఉడకలేదు. అశ్విన్, జడ్డూ స్పిన్ మ్యాజిక్​కు ఏం చేయాలో వాళ్లకు పాలుపోలేదు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో సీనియర్ బ్యాటర్లు జో రూట్ (34 నాటౌట్), జానీ బెయిర్​ స్టో (20) డిఫెన్స్​లో పడ్డారు. షాట్లు ఆడటం కంటే వికెట్లు కాపాడుకోవడం మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. అయితే బెయిర్ స్టో కొట్టిన కొన్ని షాట్లు లక్కీగా బౌండరీకి వెళ్లాయి లేకపోతే అతడూ ఈపాటికే ఔటయ్యేవాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 29.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 113 పరుగులతో ఉంది. మరి.. అశ్విన్ సాధించిన అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.