iDreamPost
android-app
ios-app

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టెస్టుకు కోట్లాది వ్యూస్.. ఇంతమంది చూడటానికి ఆ భయమే కారణమా?

  • Published Feb 05, 2024 | 9:32 PM Updated Updated Feb 05, 2024 | 9:32 PM

భారత్-ఇంగ్లండ్ సిరీస్​కు ఆడియెన్స్​ నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ మ్యాచులకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

భారత్-ఇంగ్లండ్ సిరీస్​కు ఆడియెన్స్​ నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ మ్యాచులకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 05, 2024 | 9:32 PMUpdated Feb 05, 2024 | 9:32 PM
IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టెస్టుకు కోట్లాది వ్యూస్.. ఇంతమంది చూడటానికి ఆ భయమే కారణమా?

భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో రోహిత్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. అపోజిషన్ టీమ్​ను 106 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. 5 టెస్టుల సిరీస్​ను 1-1తో సమం చేసింది. తద్వారా తొలి టెస్టులో ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. ఇప్పుడు రాజ్​కోట్​లో జరగబోయే మూడో టెస్టు కోసం ప్రిపేర్ కానుంది. ఆ మ్యాచ్​లోనూ నెగ్గితే సిరీస్​లో 2-1తో లీడ్​లోకి వెళ్లొచ్చు. ఇక, భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్​ చాలా విశేషాలకు వేదికగా మారింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాంగ్ ఫార్మాట్​కు ఆడియెన్స్ నుంచి వస్తున్న ఆదరణ. క్రికెట్​లో సంప్రదాయకంగా చెప్పుకునే టెస్టులకు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. అలాంటిది భారత్-ఇంగ్లండ్ సిరీస్​కు మాత్రం ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు ఏకంగా 40 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అయితే సరిగ్గా గమనిస్తే ఇన్ని వ్యూస్ రావడం వెనుక ఓ భయం ఉందని చెప్పొచ్చు.

టీమిండియా అనే కాదు క్రికెట్​లో టాప్ కంట్రీస్​గా చెప్పుకునే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​, సౌతాఫ్రికా, న్యూజిలాండ్​లు టెస్టులు ఆడినా ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. ఐద్రోజుల పాటు జరిగే మ్యాచులు, గంటల కొద్దీ కూర్చొని చూడటం అవసరమా? అని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. అందుకే టెస్టులను 4 రోజులకు కుదించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఒక్క సిరీస్​తో వీటన్నింటికీ చెక్ పడింది. భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్​కు ఎవరూ ఊహించనంత రేంజ్​లో రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సిరీస్​లో భాగంగా హైదరాబాద్​లో జరిగిన తొలి టెస్టుకు వేలాది మంది ప్రేక్షకులు స్టేడియానికి క్యూ కట్టారు. మ్యాచ్ జరిగిన నాల్రోజులు గ్రౌండ్​ మొత్తం హౌస్​ఫుల్​గా కనిపించింది. ఈ సిరీస్​ను టెలికాస్ట్ చేస్తున్న జియో సినిమాలో కూడా వ్యూస్ భారీ సంఖ్యలో వచ్చాయి. వైజాగ్​లో జరిగిన రెండో టెస్టుకూ ప్రేక్షకులు, అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. ఇక, డిజిటల్ స్ట్రీమింగ్​లో అయితే రికార్డు క్రియేట్ అయింది.

సెకండ్ టెస్ట్​కు ఏకంగా 41 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అయితే ఇంత మంది టెస్టులను ఎగబడి మరీ చూడటానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. రెండు టాప్ టీమ్స్ తలపడుతుండటం ఒక కారణమైతే.. రెండోది బజ్​బాల్. స్వదేశంలో ఇండియాను టెస్టుల్లో కొట్టే టీమే లేదు. కానీ ఇంగ్లండ్ బజ్​బాల్ ఫార్ములా వల్ల మన టీమ్ ఓడుతుందేమోననే భయం ఆడియెన్స్​లో ఏర్పడింది. సిరీస్​లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోవడం.. రెండో టెస్టు నెగ్గడం కీలకం కావడం, భారత్ విజయానికి చేరువలో ఉండటంతో కోట్లాది మంది ఫోన్లు, టీవీల్లో మ్యాచును లైవ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆస్ట్రేలియాతో పాటు పలు తోపు జట్లను బజ్​బాల్​ క్రికెట్​తో భయపెట్టిస్తున్న ఇంగ్లండ్​ వల్ల ఈ సిరీస్​కు వ్యూస్ భారీగా పెరిగాయి. రెండు జట్లు నువ్వానేనా అంటూ పోరాడటం, లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​ను మించిన మజా పంచుతుండటంతో ఫ్యాన్స్ మ్యాచులు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని క్రికెట్ అనలిస్టులు కూడా అంటున్నారు. మరి.. భారత్-ఇంగ్లండ్ సిరీస్​కు భారీ సంఖ్యలో వ్యూస్ రావడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.