Nidhan
రాజ్‌కోట్ టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియాను ప్రశంసల్లో ముంచెత్తాడు మైకేల్ వాన్. ముఖ్యంగా భారత జట్టులోని ఓ క్రికెటర్‌ను అతడు ఆకాశానికి ఎత్తేశాడు.
రాజ్‌కోట్ టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియాను ప్రశంసల్లో ముంచెత్తాడు మైకేల్ వాన్. ముఖ్యంగా భారత జట్టులోని ఓ క్రికెటర్‌ను అతడు ఆకాశానికి ఎత్తేశాడు.
Nidhan
రాజ్‌కోట్ టెస్టులో నెగ్గిన భారత జట్టును అందరూ మెచ్చుకుంటున్నారు. బజ్‌బాల్‌తో భయపెట్టిన ఇంగ్లండ్‌ను వరుసగా రెండో టెస్టుల్లో చిత్తుగా ఓడించడంతో రోహిత్ సేన మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అటాకింగ్ గేమ్‌తో వణికిస్తున్న ఇంగ్లీష్ టీమ్‌ను వాళ్ల దారిలోనే వెళ్లి ఓడించడం సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా భారత జట్టును మెచ్చుకున్నాడు. మూడో టెస్టులో మన టీమ్ ఆడిన తీరు అద్భుతమన్నాడు. అదే తరుణంలో టీమిండియాలోని ఓ క్రికెటర్ గురించి అతడు ప్రస్తావించాడు. ఆ భారత క్రికెటర్ మామూలోడు కాదన్నాడు. అతడో సైంటిస్ట్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. వాన్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో అతడు ఈ ఘనత సాధించాడు. లెజెండ్ అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత ఐదొందల క్లబ్లో చేరిన రెండో భారతీయుడిగా నిలిచాడు అశ్విన్. ఈ సందర్భంగా అతడ్ని ప్రశంసల జల్లుల్లో ముంచెత్తాడు మైకేల్ వాన్. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెజెండ్స్ షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ బాటలో అతడు నడుస్తున్నాడని తెలిపాడు. క్రికెట్‌ను పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న అతికొద్ది మందిలో అతడు ఒకడని చెప్పుకొచ్చాడు. ‘వార్న్, మురళీధరన్ బాటలో అశ్విన్ నడుస్తున్నాడు. అతడో ప్రొఫెసర్. క్రికెట్‌ను బాగా అర్థం చేసుకున్న అశ్విన్ ఈ గేమ్‌లో సైంటిస్ట్ లాంటోడు’ అని మైకేల్ వాన్ మెచ్చుకున్నాడు. అశ్విన్‌పై వాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అశ్విన్‌పై వాన్ చేసిన కామెంట్స్ కరెక్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. భారత స్పిన్నర్ నిజంగానే ప్రొఫెసర్ అని.. అతడిది పక్కా క్రికెటింగ్ బుర్ర అని చెబుతున్నారు. మ్యాచ్ కండీషన్స్, అపోజిషన్ టీమ్ బ్యాటర్స్‌కు తగ్గట్లు వ్యూహాలు పన్నుతూ ఔట్ చేయడం, భారత్‌ను ముందంజలో నిలపడం అశ్విన్‌కే సాధ్యమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, అశ్విన్ బౌలింగ్‌పై రియాక్ట్ అయిన మైకేల్ వాన్.. ఇంగ్లండ్ బజ్‌బాల్ స్ట్రాటజీ మీదా స్పందించాడు. ఆ జట్టు ఇదే ఫార్ములాతో ఆడి న్యూజిలాండ్‌లో ఓడిందని.. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌నూ కోల్పోయిందని చెప్పాడు. వాళ్లు ఇలాగే ఆడుతూ పోతే భారత్‌తో సిరీస్‌ను కూడా చేజార్చుకోవడం ఖాయమని పేర్కొన్నాడు. సిరీస్‌లు గెలుస్తున్నారా? లేదా? అనే దాని మీదే అంతా ఆధారపడి ఉంటుందని వాన్ స్పష్టం చేశాడు. మరి.. అశ్విన్ ఓ సైంటిస్ట్ అంటూ వాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోని వల్లే నా కెరీర్ నాశనమైంది.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
Michael Vaughan said, “Ravi Ashwin is on the same echelons as Shane Warne and Muttiah Muralitharan. He’s the professor and the scientist of the game”. (Cricbuzz). pic.twitter.com/1DzJNYvTJ6
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2024
Michael Vaughan expresses his opinion on performances of England under Ben Stokes and Brendon McCullum in Tests.#MichaelVaughan #BenStokes #BrendonMcCullum #EnglandCricket #INDvENG #CricketTwitter pic.twitter.com/5cn8d0CIcf
— InsideSport (@InsideSportIND) February 19, 2024