iDreamPost

ధోని వల్లే నా కెరీర్ నాశనమైంది.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 20, 2024 | 7:58 AMUpdated Feb 20, 2024 | 10:20 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఓ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్ నాశనమవడానికి మాహీయే కారణమన్నాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఓ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్ నాశనమవడానికి మాహీయే కారణమన్నాడు.

  • Published Feb 20, 2024 | 7:58 AMUpdated Feb 20, 2024 | 10:20 PM
ధోని వల్లే నా కెరీర్ నాశనమైంది.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

క్రికెట్​లో కొందరు ఆటగాళ్లు కచ్చితంగా స్టార్లు అవుతారని అనుకుంటాం. వాళ్లు ఆడే తీరు, గేమ్ అవేర్​నెస్, డెడికేషన్, సాధించాలనే తపనను బట్టి నెక్స్ట్‌ సూపర్ స్టార్స్ అవుతారని భావిస్తాం. కానీ ఏ ముగ్గురు, నలుగురో మాత్రమే తమ కెరీర్లను సుదీర్ఘ కాలం పాటు పొడిగించుకోగలరు. ఇది అందరు ప్లేయర్లకు సాధ్యమయ్యేది కాదు. ఆటగాళ్లు రాణించినప్పుడు కాదు వాళ్లు ఫెయిలైనా టీమ్​లో నుంచి తొలగించకుండా ఉండాలి. ప్లేస్​ పక్కా అని ధైర్యం ఇచ్చి ఆడించే కెప్టెన్, కోచ్​ ఉండాలి. అప్పుడే క్రికెటర్లు ఫామ్​ దొరకబుచ్చుకొని తమదైన శైలిలో ఆడగలరు. ఇలా ధైర్యం ఇవ్వబట్టే చాలా మంది యంగ్​స్టర్స్​ స్టార్లుగా, సూపర్ స్టార్లుగా మారారు. అయితే మరికొందరు మాత్రం అనామకులుగా మిగిలిపోయారు. ఇక, తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు భారత బ్యాటర్ మనోజ్ తివారీ. అయితే తన కెరీర్​ నాశనమవడానికి ఎంఎస్ ధోనీనే కారణమని అతడు ఆరోపించాడు.

భారత జట్టు తరఫున అంతగా పేరు తెచ్చుకోకపోయినా డొమెస్టిక్ క్రికెట్​లో లెజెండరీ బ్యాటర్​గా ఉన్నాడు మనోజ్ తివారీ. సోమవారం క్రికెట్​లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బిహార్​తో జరిగిన మ్యాచే అతడి కెరీర్​లో చివరిదిగా నిలిచింది. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తన ఇంటర్నేషనల్ కెరీర్ గురించి తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా స్టార్​ అవ్వాల్సిందని.. కానీ ధోని టీమ్​లో నుంచి తీసేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నాడు. ‘ధోనీని ఎప్పుడైనా కలిసే అవకాశం వస్తే అతడ్ని ఒకే ప్రశ్న అడుగుతా. సెంచరీ చేసిన తర్వాత కూడా టీమిండియాలో నుంచి నన్ను ఎందుకు తీసేశారు? అని అతడ్ని క్వశ్చన్ చేస్తా. అప్పటి ఆస్ట్రేలియా టూర్​లో ఎవరూ పరుగులు చేయలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా.. ఇలా అందరూ ఫెయిలయ్యారు’ అని మనోజ్ తివారీ చెప్పుకొచ్చాడు.

Dhoni ruined my career!

ఆసీస్ టూర్​లో కోహ్లీ, రోహిత్, రైనా ఫెయిలయ్యారని.. కానీ సెంచరీ చేసిన తనను మాత్రమే టీమ్​లో నుంచి తీసేశారని మనోజ్ తివారీ వాపోయాడు. ఇప్పుడు తాను కోల్పోవడానికి ఏమీ లేదన్నాడు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో 65 మ్యాచ్​లు పూర్తి చేసుకున్న సమయంలో తన బ్యాటింగ్ యావరేజ్​ 65గా ఉందని అయినా తనకు టెస్టు క్యాప్ దక్కలేదన్నాడు తివారీ. ఆసీస్ భారత్​కు వచ్చినప్పుడు జరిగిన ఫ్రెండ్లీ గేమ్​లో 130 పరుగులు చేశానని.. ఇంగ్లండ్​ ఇక్కడకు వచ్చినప్పుడు 93 రన్స్ చేశానని అయినా తనకు బదులుగా యువరాజ్​ సింగ్​ను జట్టులోకి తీసుకున్నారని తెలిపాడు. సెంచరీ బాదినా 14 మ్యాచుల పాటు జట్టుకు దూరం చేశారని.. ఒక ప్లేయర్ నమ్మకాన్ని చంపేయడానికి ఇదొక్కటి చాలు అని పేర్కొన్నాడు తివారీ. తన కెరీర్ నాశనమవడం వెనుక చాలా మంది హస్తం ఉందని.. వాళ్ల పేర్లు బయటపెట్టడం ఇష్టం లేదన్నాడు. మరి.. ధోనీపై తివారీ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు యువ క్రికెటర్లు మృతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి