iDreamPost
android-app
ios-app

IND vs ENG: కుల్దీప్ షాకింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ఇంగ్లీష్ బ్యాటర్!

  • Published Feb 03, 2024 | 6:08 PM Updated Updated Feb 03, 2024 | 6:08 PM

రెండో టెస్టులో ఇంగ్లీష్ బ్యాటర్లను భారత్ బౌలర్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఫెంటాస్టింగ్ బౌలింగ్​తో బజ్​బాల్​ క్రికెట్​ బెండు తీస్తున్నారు.

రెండో టెస్టులో ఇంగ్లీష్ బ్యాటర్లను భారత్ బౌలర్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఫెంటాస్టింగ్ బౌలింగ్​తో బజ్​బాల్​ క్రికెట్​ బెండు తీస్తున్నారు.

  • Published Feb 03, 2024 | 6:08 PMUpdated Feb 03, 2024 | 6:08 PM
IND vs ENG: కుల్దీప్ షాకింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ఇంగ్లీష్ బ్యాటర్!

రెండో టెస్టులో బజ్​బాల్ బెండు తీస్తున్నారు భారత బౌలర్లు. అసలైన టెస్టు క్రికెట్ మజా ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్​ బ్యాటర్లకు ఎలా బ్యాటింగ్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఆట రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. మొదటి ఇన్నింగ్స్​లో 396 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (209) కెరీర్​లో తొలి డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. అతడికి టెయిలెండర్లు సహకరించి ఉంటే టీమిండియా నాలుగొందల మార్క్ దాటేది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్​కు భారత బౌలర్లు పగటిపూటే చుక్కలు చూపిస్తున్నారు. మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్​ బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. ఈ క్రమంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఓ బాల్ చర్చనీయాంశంగా మారింది. షాకింగ్ డెలివరీతో ఇంగ్లీష్ బ్యాటర్​ను బిత్తరపోయేలా చేశాడు కుల్దీప్.

113 పరుగుల వరకు ఒకే వికెట్ కోల్పోయి అద్భుతంగా ఆడుతున్న ఇంగ్లండ్​ జోరుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. ఆ తర్వాత 60 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు తీశారు. ఈ క్రమంలో బెయిర్​స్టో (25) తర్వాత బ్యాటింగ్​కు వచ్చాడు బెన్ ఫోక్స్ (6). కెప్టెన్ స్టోక్స్​తో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఓ స్టన్నింగ్ డెలివరీతో ఫోక్స్​ను వెనక్కి పంపాడు కుల్దీప్. అతడు వేసిన ఫ్లయిటెడ్ డెలివరీ ఆఫ్​స్టంప్ అవతల పడి లోపలి వైపునకు టర్న్ అయింది. దీంతో స్ట్రయిట్ డెలివరీ కోసం ఎదురుచూస్తున్న ఫోక్స్​ను అది బీట్ చేసింది. బాల్ ఫోక్స్ బ్యాట్​ను దాటి వికెట్లను గిరాటేసింది. బాల్స్​ను బాగా మిక్సప్ చేసి ఫోక్స్​ను తన వలలో పడేలా చేశాడు కుల్దీప్. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్ బిత్తరపోయాడు. బాల్ తన బ్యాట్​ను ఎలా బీట్ చేసిందో అర్థం కాక షాకయ్యాడు. ఇది చూసిన భారత అభిమానులు కుల్దీప్ స్పిన్ మ్యాజిక్​ను తట్టుకోవడం ఈజీ కాదని అంటున్నారు. మరి.. రెండో టెస్టులో భారత బౌలర్ల సూపర్బ్ ఎఫర్ట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.