Nidhan
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది భారత్. నాకౌట్ ఫైట్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది టీమిండియా.
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది భారత్. నాకౌట్ ఫైట్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది టీమిండియా.
Nidhan
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది భారత్. నాకౌట్ ఫైట్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది టీమిండియా. బట్లర్ సేనతో నిన్న జరిగిన నాకౌట్ ఫైట్‌లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీ20 ప్రపంచ కప్-2022 సెమీస్ పరాభవానికి ఇప్పుడు బదులు తీర్చుకుంది. బరిలో ఉన్నది రెండు టాప్ టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ భారత్ దూకుడు ముందు అపోజిషన్ టీమ్ నిలబడలేకపోయింది. ఫస్ట్ బాల్ నుంచి మెన్ ఇన్ బ్లూ డామినేషన్ నడిచింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఔటైన సందర్భాల్లో కొంత ప్రెజర్ ఉన్నట్లు కనిపించినా.. రోహిత్ శర్మ ఆ ఒత్తిడిని తిరిగి ఇంగ్లండ్ మీదకు నెట్టాడు.
బ్యాటింగ్‌లో రోహిత్ (39 బంతుల్లో 57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47) రఫ్ఫాడించడంతో భారీ స్కోరు చేసింది భారత్. ఆ తర్వాత బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23), జస్ప్రీత్ బుమ్రా (2/12) చెలరేగిపోయారు. గ్రౌండ్ ఫీల్డింగ్‌తో పాటు క్యాచ్‌లు కూడా అద్భుతంగా అందుకోవడంతో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసింది. ఈ విక్టరీతో జోష్‌లో ఉన్న రోహిత్ సేన ఫైనల్లో ఎలా ఆడాలనే దానిపై ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసింది. మరోవైపు ఓటమితో డీలాపడ్డ ఇంగ్లీష్ టీమ్ ఇంటిదారి పట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇలా మట్టికరుస్తుందని ఎవరూ ఊహించలేదు. దీంతో ఆ టీమ్ ఓటమికి అందరూ కారణాలు వెతకసాగారు. పాకిస్థాన్ లెజెండ్ షోయబ్ అక్తర్ కూడా ఇంగ్లీష్ టీమ్ ఓటమికి పలు కారణాలు చెప్పాడు. బట్లర్ చేసిన తప్పు వల్లే ఆ జట్టు ఓడిందన్నాడు.
‘ఇంగ్లండ్ మొదట్లోనే తప్పు చేసింది. ఆ టీమ్ కెప్టెన్ బట్లర్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. అది బిగ్ మిస్టేక్. ఇంగ్లండ్‌కు స్పిన్ ఎలా ఆడాలో తెలియదు. గయానా పిచ్ మీద ఫాస్ట్ బౌలర్లకు ఎలాంటి హెల్ప్ లేదు. ఆ వికెట్‌పై బంతి అనూహ్యమైన బౌన్స్ కావడం లేదు. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. పిచ్ ఎలాగూ పొడిబారుతుంది. కాబట్టి అక్కడ తొలుత బ్యాటింగ్ చేసి 150 పరుగులు చేస్తే సరిపోతుంది. టార్గెట్ సెట్ చేసి టీమిండియాను ప్రెజర్‌లోకి నెట్టాల్సింది పోయి బట్లర్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్ చేయాలని అనుకున్నప్పుడే మ్యాచ్ చేజారింది’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకున్నప్పుడే మ్యాచ్ ముగిసిందని.. బట్లర్ నిర్ణయం ఇంగ్లండ్‌కు శాపంగా మారిందన్నాడు. మరి.. బట్లర్ వల్లే భారత్ గెలిచిందంటూ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Shoaib Akhtar ” England don’t know how to play spin.This was not a pitch for the fast bowlers or there was uneven bounce. it’s so humid,the pitch will dry up,You make 150 and then try to put India under pressure but they were adamant on batting second.”pic.twitter.com/7nW59Z96B8
— Sujeet Suman (@sujeetsuman1991) June 28, 2024