Nidhan
రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ జట్టును భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా భయపెట్టాడు. అయితే ఎప్పటిలా బాల్‌తో కాదు.. ఈసారి బ్యాట్‌తో వణికించాడు.
రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ జట్టును భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా భయపెట్టాడు. అయితే ఎప్పటిలా బాల్‌తో కాదు.. ఈసారి బ్యాట్‌తో వణికించాడు.
Nidhan
భారత్‌ను త్వరగా ఆలౌట్ చేద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశ నెరవేరలేదు. లోయరార్డర్ ఆటగాళ్లు పట్టుదలతో ఆడటంతో రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆరంభంలోనే కుల్దీప్ యాదవ్ (4), రవీంద్ర జడేజా (112) ఔట్ అవడంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అప్పటికి స్కోరు 331/7. ఆ టైమ్‌లో మరో వికెట్ పడితే మన జట్టు తక్కువ స్కోరుకే కుప్పుకూలేది. కానీ కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ (46), సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (37) మంచి పార్ట్నర్షిప్తో జట్టును ఆదుకున్నారు. వీళ్లు 8వ వికెట్‌కు 77 పరుగులు జోచించారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఔట్ అయినా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పోరాడటం ఆపలేదు.
భారత ఇన్నింగ్స్ ముగిసిందనుకున్న ఇంగ్లండ్‌ను మెరుపు బ్యాటింగ్‌తో భయపెట్టాడు బుమ్రా. మహ్మద్ సిరాజ్ (3) ఒక ఎండ్‌లో బంతుల్ని డిఫెన్స్ చేస్తూ అతడికి చక్కటి సహకారం అందించాడు. జస్ప్రీత్ 3 ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ 10వ వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అందులో బుమ్రా బ్యాట్ నుంచే 26 పరుగులు వచ్చాయి. మంచి బంతుల్ని సాలిడ్ డిఫెన్స్‌తో నిలువరించిన అతడు.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. మామూలుగా బాల్‌తో ప్రత్యర్థి జట్లను వణికించే బుమ్రా.. ఈ మ్యాచ్‌లో తన బ్యాట్ తడాఖా చూపించాడు.
బుమ్రా-సిరాజ్ నెలకొల్పింది చిన్న పార్ట్నర్షిప్ కావొచ్చు.. కానీ ఈ 30 నుంచి 40 పరుగులే ఆధిక్యం సాధించడంలో, మ్యాచ్‌ను గెలుచుకోవడంలోనూ ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. ఆఖర్లో టెయిలెండర్ల నుంచి ఇన్ని పరుగులు వస్తాయిని అటు భారత టీమ్ మేనేజ్మెంట్.. ఇటు ఇంగ్లండ్ జట్టు గానీ ఊహించలేదు. బుమ్రా వల్ల భారత్ 450 పరుగులకు దగ్గరగా రాగలిగింది. ఇది మెంటల్‌గా మనకు బూస్ట్ ఇస్తే.. స్టోక్స్ సేనకు భారీ స్కోరు అనే ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే, ఇంగ్లండ్‌పై చెలరేగడం బుమ్రాకు ఇదే తొలిసారి కాదు. గతంలో వాళ్ల సొంతగడ్డపై జరిగిన ఓ టెస్ట్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఏకంగా 35 రన్స్ రాబట్టాడు. మళ్లీ అదే టీమ్‌పై బ్యాట్‌తో చెలరేగాడు. మరి.. బుమ్రా బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs ENG వీడియో: సర్ఫరాజ్ ఫ్యామిలీని కలసిన రోహిత్.. నౌషద్ ఖాన్ ఎమోషనల్!
JASPRIT BUMRAH SHOW WITH BAT. 🔥👌pic.twitter.com/PiM3aM31dh
— Johns. (@CricCrazyJohns) February 16, 2024
From 331-7 to 445/10.
Indian lower order added 114 runs. pic.twitter.com/4vf3RhOnPE
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024