Nidhan
ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని అటు ప్లేయర్లతో పాటు ఇటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని అటు ప్లేయర్లతో పాటు ఇటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
గత వారం క్రికెట్లో రెండు వింతలు చోటు చేసుకున్నాయి. సొంతగడ్డపై సింహాలు లాంటి రెండు జట్లు ఓటమిని ఎదుర్కొన్నాయి. అవే భారత్, ఆస్ట్రేలియా. టీమిండియాను సొంతగడ్డ మీద ఓడించలేక ఎన్నో జట్లు తోకముడుచుకున్నాయి. సిరీస్‌ను పక్కనబెడితే కనీసం వైట్‌వాష్ తప్పించుకుంటే చాలని టాప్ టీమ్స్ కూడా భావిస్తాయి. ఆసీస్‌లో కంగారూలతో ఆడేటప్పుడు కూడా మిగతా జట్లు ఇలాగే ఆలోచిస్తాయి. అయితే అనూహ్యంగా సొంతగడ్డపై జరిగిన టెస్టుల్లో అటు వెస్టిండీస్ చేతితో ఆసీస్ ఓడిపోగా.. ఇటు భారత్‌ను ఇంగ్లండ్ ఓడించింది. స్టార్లతో నిండిన రోహిత్ సేన ఓటమిని ఎవరూ ఊహించలేదు. మొదటి టెస్ట్‌లో మూడో రోజు వరకు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చి ఇలా ఓడిపోతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా నిరాశలో కూరుకున్నారు. ఈ తరుణంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లిద్దరూ ఉన్నంత వరకు భారత్‌కు ఏమీ కాదన్నాడు.
టీమిండియాపై ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ఉన్నంత వరకు భారత జట్టుకు తిరుగులేదని అతడు అన్నాడు. వాళ్లిద్దరూ చాలా నిలకడగా ఆడతారని.. వాళ్లు మ్యాచ్‌లో ఉన్నారంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టడం ఖాయమన్నాడు. టీమ్‌ను ఎలాగైనా గెలుపు తీరాలకు చేర్చాలని వాళ్లిద్దరూ ప్రయత్నిస్తుంటారని.. అందుకోసం కొత్త దారులు అన్వేషిస్తుంటారని మెచ్చుకున్నాడు కమిన్స్. ‘కోహ్లీ, జడేజా చాలా కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. వాళ్లను ఆటకు దూరంగా ఉంచలేరు. జట్టు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వాళ్లు అందులో నుంచి బయట పడేస్తారు. కఠిన పరిస్థితుల్లోనూ రాణించి టీమ్‌ను గెలిపిస్తారు. వాళ్లిద్దరూ చాలా స్పెషల్ ప్లేయర్లు’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ అవార్డులపై స్పందిస్తూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డును కమిన్స్ దక్కించుకున్నాడు. ఇదే ఏడాదికి గానూ ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. తన క్రికెట్ జర్నీతో పాటు కోహ్లీ, జడేజా గురించి కూడా కమిన్స్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ ఇద్దరు భారత స్టార్లతో పాటు తన టీమ్మేట్ ట్రావిస్ హెడ్ మీద కూడా ప్రశంసల జల్లులు కురిపించాడు. గతేడాది తనకు బాగా కలిసొచ్చిందన్నాడు. ఒకే సంవత్సరం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ నెగ్గడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇప్పుడు ఐసీసీ అవార్డు కూడా దక్కడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నాడు. ‘గతేడాది నాకు చాలా కలిసొచ్చింది. ఓ జట్టుగా మేం అద్భుత విజయాలు సాధించాం. ఐసీసీ అవార్డు రావడం గౌరవంగా ఉంది’ అని కమిన్స్ తెలిపాడు. మరి.. కోహ్లీ, జడేజా ఉన్నన్ని రోజులు భారత్‌కు ఢోకా లేదంటూ ఆసీస్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pat Cummins said, “Virat Kohli and Ravindra Jadeja are super consistent, you can’t keep them out of the game. They find a way to drag their team out of trouble and win it for them”. (ICC). pic.twitter.com/ETDpFpxZAp
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2024