IND vs ENG: వీడియో: సచిన్​ను గుర్తుచేసిన జురెల్.. ఏం కొట్టావ్ సామి!

ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో మరో డెబుటెంట్ ధృవ్ జురెల్ అదరగొడుతున్నాడు. అతడు కొట్టిన ఓ షాట్​కు అందరూ లెజెండ్ సచిన్ టెండూల్కర్​ను గుర్తుచేసుకుంటున్నారు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో మరో డెబుటెంట్ ధృవ్ జురెల్ అదరగొడుతున్నాడు. అతడు కొట్టిన ఓ షాట్​కు అందరూ లెజెండ్ సచిన్ టెండూల్కర్​ను గుర్తుచేసుకుంటున్నారు.

భారత జట్టుకు మరో ఇద్దరు సూపర్​స్టార్లు దొరికారు. ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో ఇద్దరు కొత్త కుర్రాళ్లు అదరగొడుతున్నారు. అందులో ఒకరు సర్ఫరాజ్ ఖాన్ అయితే.. మరొకరు ధృవ్ జురెల్. రాజ్​కోట్ టెస్టు తొలి రోజు సర్ఫరాజ్ 62 పరుగుల మెరుపు ఇన్నింగ్స్​తో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు. రెండో రోజు జురెల్ తన బ్యాట్ పవర్ ఏంటో చూపిస్తున్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే కొత్త కుర్రాడు ఆడుతున్నట్లు లేదు. చాలా టెస్టులు ఆడిన ఓ మెచ్యూర్డ్ బ్యాటర్​గా, ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉన్నవాడిలా అతడు ఇన్నింగ్స్​ను నడిపిస్తున్నాడు. సీనియర్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ (25 నాటౌట్)తో కలసి అతడు మంచి పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో జురెల్ (31 నాటౌట్) ఓ ఫెంటాస్టిక్ షాట్​తో​ లెజెండ్ సచిన్ టెండూల్కర్​ను గుర్తుచేశాడు.

ఎడా పెడా షాట్లు కొట్టకుండా మంచి గేమ్ అవేర్​నెస్​ను కనబరుస్తున్నాడు జురెల్. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ సింగిల్స్​ను డబుల్స్​గా మలుస్తున్నాడు. ఈ క్రమంలో పేసర్ మార్క్ వుడ్ 146 కిలోమీటర్ల వేగంతో వేసిన ఓ బాల్​ను అద్భుతమైన రీతిలో సిక్స్​గా మలిచాడు. ఆఫ్​ స్టంప్​కు బయట వుడ్ వేసిన బౌన్సర్ జురెల్ వైపు దూసుకొచ్చింది. అయితే బంతి బౌన్స్​ అవుతుందని ముందే ఊహించిన యంగ్ బ్యాటర్ కాస్త వంగి మోకాళ్లపై వెయిట్​ను ట్రాన్స్​ఫర్ చేసి అప్పర్ కట్ కొట్టాడు. ఆఫ్​ స్టంప్​లో పడిన బంతిని అప్పర్​కట్​తో కీపర్ వెనుక వైపు స్టాండ్స్​లోకి పంపాడు.

జురెల్ కొట్టిన షాట్​కు మార్క్ వుడ్​తో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు అంతా షాకయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాట్​ వీడియోను చూసిన నెటిజన్స్ సచిన్​ను జురెల్ గుర్తుచేశాడని అంటున్నారు. అంత వేగంగా వచ్చిన బాల్​ను ఎక్స్​పీరియెన్స్ ఉన్నవాడిలా ఈజీగా సిక్స్ కొట్టడం మామూలు విషయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. జురెల్ బ్యాటింగ్ టెక్నిక్, మెచ్యూరిటీ సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. అతడు ఇలాగే ఆడితే భారత జట్టులో అతడి స్థానానికి ఢోకా లేదని చెబుతున్నారు. ఇక, ఫస్ట్ ఇన్నింగ్స్​లో టీమిండియా ప్రస్తుతం 7 వికెట్లకు 388 పరుగులతో ఉంది. మరి.. జురెల్ అప్పర్ కట్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: వీడియో: సూర్యకుమార్​కు సర్ఫరాజ్ తండ్రి కృతజ్ఞతలు.. అతడి వల్లేనంటూ..!

Show comments