Nidhan
తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీశారు భారత స్పిన్నర్లు. అయితే అందరు ఔటైనా కొరకరాని కొయ్యగా మారాడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్. కానీ అతడ్ని ఓ కిల్లింగ్ డెలివరీతో పెవిలియన్‌కు పంపాడు బుమ్రా.
తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీశారు భారత స్పిన్నర్లు. అయితే అందరు ఔటైనా కొరకరాని కొయ్యగా మారాడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్. కానీ అతడ్ని ఓ కిల్లింగ్ డెలివరీతో పెవిలియన్‌కు పంపాడు బుమ్రా.
Nidhan
బజ్‌బాల్.. గత వారం రోజులుగా క్రికెట్ వర్గాల్లో బాగా వినిపిస్తున్న పదం. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ ఈ ఫార్ములాను ప్రయోగిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. వాళ్ల సొంతగడ్డ మీద ఇది సక్సెస్ అయింది. కానీ స్పిన్‌కు స్వర్గధామం లాంటి ఇండియన్ టర్నింగ్ ట్రాక్స్‌పై బజ్‌బాల్ క్రికెట్ ఆడితే ఇంగ్లండ్‌కే నష్టమని చాలా మంది ఎక్స్పర్ట్స్ అన్నారు. అయితే ఆ దేశ మాజీలు, ప్రస్తుత జట్టులోని కొందరు ప్లేయర్లు మాత్రం తాము ఇదే ఫార్ములాతో ఆడతామని మొండిపట్టు పట్టారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అదే అస్త్రాన్ని ప్రయోగించారు. కానీ టీమిండియా స్పిన్నర్ల ముందు బజ్‌బాల్ తుస్సుమంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ దెబ్బకు ఇంగ్లండ్ 246 పరుగులకు చాప చుట్టేసింది. స్పిన్నర్లతో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఆకట్టుకున్నాడు. ఓ కిల్లింగ్ డెలివరీతో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు పెవిలియన్ దారి చూపించాడు.
ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అందరికంటే సారథి స్టోక్స్ (70) బాగా ఆడాడు. అతడొక్కడే హాఫ్ సెంచరీ బాదాడు. అందరూ ఔటైనా అతడు మాత్రం క్రీజును వదల్లేదు. 88 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 6 ఫోర్లు, 3 భారీ సిక్సుల సాయంతో 70 పరుగులు చేసి కొరకరాని కొయ్యగా మారాడు. ఎవరు బౌలింగ్‌కు వచ్చినా షాట్లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో బుమ్రా చేతికి బంతిని ఇచ్చాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఇది వర్కౌట్ అయింది. హిట్టింగ్‌కు పోయి బుమ్రా వలలో చిక్కాడు స్టోక్స్. అప్పటికే ఆ ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన అతడు.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ముందుకొచ్చి ఆడదామనుకొని క్రీజును వీడాడు. అయితే బుమ్రా వేసిన బాల్ లెగ్ స్టంప్‌లో పడి ఔట్ స్వింగ్ అయి మిడ్ వికెట్‌ను గిరాటేసింది. సరిగ్గా టాప్ ఆఫ్ ది స్టంప్‌ను బాల్ ముద్దాడింది. దీంతో స్టోక్స్ షాకయ్యాడు. కిల్లింగ్ డెలివరీని ఎదుర్కోవడంలో ఫెయిల్ అవడంతో చేతులు ఎత్తేశాడు. అలా బౌలింగ్ వేస్తే ఎలా ఆడాలంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అయితే బుమ్రా మాత్రం తనదైన శైలిలో రెండు చేతుల్ని పైకి లేపి నవ్వుతూ సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.
స్టోక్స్‌ను బుమ్రా ఔట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్.. బుమ్రా దెబ్బకు ఎంత తోపు బ్యాటర్ అయినా తోకముడవాల్సిందేనని చెబుతున్నారు. ఇక, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్ తర్వాత జానీ బెయిర్‌స్టో (37), బెన్ డకెట్ (35) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. జాక్ క్రాలే (20), జో రూట్ (20)కి కూడా మంచి స్టార్ట్ దొరికింది. అయినా వాళ్లు దాన్ని బిగ్ స్కోర్‌గా మలచడంలో ఫెయిలయ్యారు. చివర్లో టామ్ హార్ట్లీ (23) మెరుపు ఇన్నింగ్స్‌తో కాసేపు ప్రేక్షకులను అలరించాడు. ఉప్పల్ పిచ్ నుంచి స్పిన్నర్లకు ఎక్కువ టర్న్ కూడా లభించలేదు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్, బ్యాటర్ల వీక్నెస్ను బట్టి బాల్స్ వేయడంతో వికెట్లు పడ్డాయి. అదే టైమ్‌లో బజ్‌బాల్ అంటూ అనవసరంగా హిట్టింగ్‌కు వెళ్లడం కూడా ఇంగ్లీష్ టీమ్‌కు మైనస్‌గా మారింది. స్టోక్స్ కూడా అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బుమ్రాను బాదేద్దామని వెళ్లి బొక్క బోల్తాపడ్డాడు. మరి.. స్టోక్స్‌ను బుమ్రా ఔట్ చేసిన డెలివరీ గురించి మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BUMRAH CLEANING UP STOKES…!!! 💥pic.twitter.com/vvuraDiozL
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2024