Nidhan
రాజ్‌కోట్ టెస్టులో నెగ్గి ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. ఇదే ఊపులో రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టులోనూ నెగ్గి సిరీస్‌ను పట్టేయాలని చూస్తోంది.
రాజ్‌కోట్ టెస్టులో నెగ్గి ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. ఇదే ఊపులో రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టులోనూ నెగ్గి సిరీస్‌ను పట్టేయాలని చూస్తోంది.
Nidhan
టీమిండియా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్ స్టార్ట్ అవడానికి ముందు కాస్త ఒత్తిడిలో కనిపించింది మన టీమ్. బజ్‌బాల్ క్రికెట్ అంటూ భయపెడుతున్న ఇంగ్లీష్ టీమ్‌ను ఎలా ఎదుర్కొంటుందోననే ఆందోళన ఉండేది. ఉప్పల్ టెస్టులో ఓటమితో రోహిత్ సేన మీద మరింత ప్రెజర్ పెరిగింది. అయితే వైజాగ్ ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్టు నుంచి అంతా మారిపోయింది. బజ్‌బాల్‌ను అర్థం చేసుకొని దానికి కౌంటర్ ఇవ్వడం ఎలాగో గ్రహించిన భారత క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి సిరీస్‌లో 2-1తో టీమ్‌ను లీడ్‌లోకి తీసుకెళ్లారు. రాజ్‌కోట్ మ్యాచ్‌లోనైతే ఇంగ్లండ్‌ను ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో చిత్తు చేశారు. ఇదే ఊపులో నాలుగో టెస్టులోనూ నెగ్గి సిరీస్‌ను పట్టేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో రోహిత్ సేనకు ఒక గుడ్ న్యూస్. జట్టులోకి మరో స్టార్ ప్లేయర్ రానున్నాడు.
రాంచీ ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో టెస్టుకు ముందు భారత్‌కు శుభవార్త. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాట్స్‌మన్ రాజ్‌కోట్ టెస్టులో ఆడటం ఖాయంగా కనిపించింది. కానీ గాయం పూర్తిగా మానకపోవడంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉండిపోయాడు. అయితే అతడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. నాలుగో టెస్టులో రాహుల్ బరిలోకి దిగడం పక్కా అని సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హింట్ ఇచ్చాడు. అతడు కోలుకున్నాడని చెప్పాడు. అయితే రాంచీ టెస్టులో ఆడతాడా? లేదా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ క్రికెట్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం రాహుల్ బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడట.
ఒకవేళ రాహుల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే అతడ్ని నేరుగా టీమ్‌లోకి తీసుకోవడం ఖాయం. అప్పుడు కేఎల్ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. గత రెండు టెస్టుల్లోనూ ఛాన్స్ వచ్చినా దాన్ని రజత్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. చెప్పుకోదగ్గ నాక్ ఆడలేదు. కాబట్టి రజత్‌ను తప్పించి రాహుల్‌కు రెడ్ కార్పెట్ పరచడం ఖాయమని సమాచారం. నాలుగో టెస్టులో ఆడే భారత జట్టులో మరో మార్పు జరగడం కూడా పక్కా అని తెలుస్తోంది. వర్క్ లోడ్ కారణంగా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారట. అతడి స్థానంలో యంగ్ పేసర్ ఆకాశ్ దీప్‌ను టీమ్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉందని వినికిడి. అయితే అటు రాహుల్ రాకపై గానీ ఇటు బుమ్రా రెస్ట్ గురించి గానీ బీసీసీఐ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ రాహుల్ టీమ్‌లోకి వస్తే మాత్రం ఇంగ్లండ్‌ను పోయించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఆ టీమ్‌కు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు. మరి.. రాహుల్ రాక కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Yashasvi Jaiswal: జైస్వాల్ జీవితంలో ఈ వ్యక్తి దేవుడు! కుర్రాడి తలరాతనే మార్చేశాడు!
KL Rahul likely to be back for the 4th Test against England in Ranchi. (SportsTak). pic.twitter.com/upfdu8Qntc
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2024