iDreamPost
android-app
ios-app

IND vs ENG: తన కంటిని తానే పొడుచుకుంటున్న ఇంగ్లండ్! అంతా బజ్​బాల్ మహిమే!

  • Published Feb 17, 2024 | 2:51 PM Updated Updated Feb 17, 2024 | 2:51 PM

ఇంగ్లండ్ జట్టు బజ్​బాల్ క్రికెట్ అంటూ తన కంటిని తానే పొడుచుకుంటోంది. ఈ ఫార్ములా వల్ల సాధించిన విజయాలను పక్కనపెడితే ముంచుకొస్తున్న ముప్పును గుర్తించడం లేదు.

ఇంగ్లండ్ జట్టు బజ్​బాల్ క్రికెట్ అంటూ తన కంటిని తానే పొడుచుకుంటోంది. ఈ ఫార్ములా వల్ల సాధించిన విజయాలను పక్కనపెడితే ముంచుకొస్తున్న ముప్పును గుర్తించడం లేదు.

  • Published Feb 17, 2024 | 2:51 PMUpdated Feb 17, 2024 | 2:51 PM
IND vs ENG: తన కంటిని తానే పొడుచుకుంటున్న ఇంగ్లండ్! అంతా బజ్​బాల్ మహిమే!

ఇంగ్లండ్.. క్రికెట్​కు పుట్టినిల్లు ఈ దేశం. జెంటిల్మన్ గేమ్​కు ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను అందించింది. క్రికెట్ ఎలా ఆడాలో ప్రపంచానికి నేర్పిన ఇంగ్లండ్.. అందరికీ అలవాటుగా మారిన ఆటలో నయా ఫార్ములాను ఈ మధ్యే తీసుకొచ్చింది. దాని పేరు బజ్​బాల్. టెస్టుల్లో ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఆడుతోంది ఇంగ్లీష్ టీమ్. న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత బజ్​బాల్​ను ఇంట్రడ్యూస్ చేశాడు. సింపుల్​గా చెప్పాలంటే.. బ్యాటింగ్, బౌలింగ్​లో ఫుల్ అటాకింగ్​ మోడ్​లో ఆడటమే బజ్​బాల్. టెస్టు మ్యాచ్​లో రిజల్ట్ తీసుకురావడం.. అది కూడా మూడు, నాలుగు రోజుల్లోనే మ్యాచుల్ని ముగించడం ఈ ఫార్ములా ధ్యేయం. బజ్​బాల్​తో క్రికెట్ నేషన్స్ అన్నింటినీ భయపెట్టిస్తున్న ఇంగ్లండ్.. తన కన్ను తానే పొడుచుకుంటోంది. ఈ ఫార్ములా వల్ల తలెత్తుతున్న సమస్యలు, కలుగుతున్న నష్టాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

బజ్​బాల్ వల్ల టెస్టుల్లో ఇంగ్లండ్ విజయాల శాతం పెరిగింది. డ్రా అయ్యే చాలా మ్యాచుల్లో రిజల్ట్ రాబట్టగలిగింది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఓటములు ఎదురైనా ఆ ఫార్ములాను మాత్రం వీడటం లేదు. భారత్​తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్​లోనూ దీన్నే ఇంప్లిమెంట్ చేస్తోంది. అయితే బజ్​బాల్​ అంటూ మితిమీరిన దూకుడుతో ఆడుతున్నారు ఇంగ్లీష్ బ్యాటర్లు. దీని వల్ల సక్సెస్ ఏమో కానీ కొందరు ఆటగాళ్లు చాలా డిస్ట్రబ్ అవుతున్నారు. బెన్ స్టోక్స్, ఓలీ పోప్, బెన్ డకెట్ లాంటి ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు దీన్ని బాగానే అడాప్ట్ చేసుకున్నారు. కానీ జో రూట్, బెయిస్ స్టో లాంటి బ్యాటర్లు ఈ ఫార్ములాకు అలవాటు పడలేకపోతున్నారు. ముఖ్యంగా రూట్ అయితే కీలక సమయంలో అనవసర షాట్లకు పోయి ఉత్తి పుణ్యాన వికెట్ పారేసుకుంటున్నాడు.

బజ్​బాల్ రాకముందు రూట్ క్లాస్ షాట్లతో విరుచుకుపడేవాడు. తన టెక్నిక్​ను నమ్ముకునే మెళ్లిగా ఇన్నింగ్స్​ను బిల్డ్ చేసేవాడు. కానీ బజ్​బాల్ వల్ల వేగంగా ఆడాల్సి రావడం, ఈ క్రమంలో తనకు అంతగా అచ్చి రాని స్వీప్, రివర్స్ స్వీప్​లు ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అవుతున్నాడు. గత భారత పర్యటనలో అదరగొట్టిన రూట్.. ఈసారి మాత్రం పేలవంగా ఆడుతున్నాడు. బెయిర్​స్టో కూడా చెత్త పెర్ఫార్మెన్స్​తో నిరాశ పరుస్తున్నాడు. ఈ సిరీస్​లో రూట్ స్కోర్లు 29, 2, 5, 16, 18గా ఉన్నాయి. బెయిర్ స్టో స్కోర్లు 37, 10, 25, 26, 0గా ఉన్నాయి. వీళ్లిద్దరి బ్యాట్ నుంచి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. తమ న్యాచురల్ గేమ్​ను పక్కనపెట్టి ఎడాపెటా షాట్లు కొట్టేందుకు పోవడం, గేమ్ అవేర్​నెస్ లేకపోవడం, మ్యాచ్ కండీషన్స్ కంటే బజ్​బాల్​ను ఫాలో అవ్వడమే ముఖ్యం అన్నట్లు ఆడటం వల్లే వాళ్లు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్​ను మినహాయిస్తే బ్యాటింగ్​లో రూట్, బెయిర్​స్టో ఎంతో కీలకం. వీళ్లు ఇంకొన్నాళ్లు టెస్టు టీమ్​ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లు ఒక ఫార్ములాకు కట్టుబడి ఆడటం వల్ల ఫెయిలవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రన్స్ చేయకపోతే ఎంతటి బ్యాటర్ అయినా మెంటల్​గా డిస్ట్రబ్ అవుతాడు. కాబట్టి ఈ సమస్యను ఇంగ్లండ్ టీమ్ మేనేజ్​మెంట్ గుర్తించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. కనీసం వీళ్లిద్దరకీ తమ న్యాచురల్ గేమ్ ఆడుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బజ్​బాల్ మాయలో తన కంటిని తానే పొడుచుకుంటోందని.. పొరపాటును గ్రహించి స్టార్ బ్యాటర్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మరి.. ఇంగ్లండ్​ బజ్​బాల్ ఫార్ములా మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: నల్ల రిబ్బన్లతో బరిలోకి భారత ప్లేయర్లు! కారణం ఏంటంటే..?