iDreamPost

IND vs ENG: నల్ల రిబ్బన్లతో బరిలోకి భారత ప్లేయర్లు! కారణం ఏంటంటే..?

  • Published Feb 17, 2024 | 2:06 PMUpdated Feb 17, 2024 | 2:06 PM

రాజ్​కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భారత క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రాజ్​కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భారత క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 17, 2024 | 2:06 PMUpdated Feb 17, 2024 | 2:06 PM
IND vs ENG: నల్ల రిబ్బన్లతో బరిలోకి భారత ప్లేయర్లు! కారణం ఏంటంటే..?

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ప్రత్యర్థి జట్టు బజ్​బాల్​ క్రికెట్​కు సరైన రీతిలో బదులిస్తోంది రోహిత్ సేన. దూకుడైన ఆటతీరుతో ఇంగ్లీష్ టీమ్​కు చుక్కలు చూపిస్తోంది. రెండో రోజు ఆటలో టీమిండియాదే పైచేయి అయింది. మూడో రోజు కూడా మనోళ్ల డామినేషన్ నడుస్తోంది. అయితే రాజ్​కోట్​ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్​లోకి దిగారు. టీమిండియా ప్లేయర్లు ఇలా ఎందుకు ఆడుతున్నారో చాలా మందికి అర్థం కాలేదు. మ్యాచ్ మొదటి రెండ్రోజులు నార్మల్​గానే దిగిన క్రికెటర్లు.. మూడో రోజు మాత్రం చేతికి నల్ల రిబ్బన్లను ధరించి ఆడారు. అయితే ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్లారిటీ ఇచ్చింది.

టీమిండియా ఆటగాళ్లు చేతికి ఎందుకు నల్ల రిబ్బన్లు వేసుకున్నారనే విషయంపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. భారత మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాపంగా ప్లేయర్లు నల్ల రిబ్బన్లను ధరించారని సోషల్ మీడియాలో బోర్డు తెలిపింది. టీమిండియా తరఫున 11 టెస్టులు ఆడిన దత్తాజీరావు.. 350 పరుగులు చేశారు. ఆయన పేరిట ఓ హాఫ్ సెంచరీ ఉంది. 1959లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు ఆయన కెప్టెన్​గా వ్యవహరించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న దత్తాజీరావు.. ఫిబ్రవరి 13వ తేదీన తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 95 ఏళ్లు. భారత మాజీ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా ఉన్న దత్తాజీరావు మృతికి మాజీ క్రికెటర్లు సహా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంతాపంగా ఇవాళ టీమిండియా క్రికెటర్లు నల్ల రిబ్బన్లు ధరించారు.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో భారత్ దుమ్మురేపుతోంది. ఇంగ్లండ్​ ఇన్నింగ్స్​ను 319 పరుగులకే కట్టడి చేసింది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకపోయినా మిగిలిన నలుగురు బౌలర్లు చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ (4/84) నాలుగు వికెట్లతో ఇంగ్లీష్ టీమ్ వెన్ను విరిచాడు. సుదీర్ఘ స్పెల్ వేస్తూ అశ్విన్ లేని లోటు మిగతా బౌలర్ల మీద పడకుండా చూసుకున్నాడు. జడేజా, కుల్దీప్ చెరో 2 వికెట్లతో మెరిశారు. బుమ్రాకు 1 వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (153) తప్పితే ఒక్క బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేదు. క్రమం తప్పకుండా భారత బౌలర్లు వికెట్ తీయడం, రన్స్ కట్టడి చేయడంతో ప్రత్యర్థి ఆటగాళ్లు బ్యాట్లు ఎత్తేశారు. మరి.. మూడో టెస్టులో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియా అంటే వణికిపోతున్న బెయిర్‌ స్టో! హీరో టూ జీరో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి