iDreamPost
android-app
ios-app

IND vs ENG: నాలుగో టెస్ట్‌కు కీలక ఆటగాడు దూరం! రోహిత్‌ ఎలా మ్యానేజ్‌ చేస్తాడో..?

  • Published Feb 19, 2024 | 12:35 PM Updated Updated Feb 19, 2024 | 12:35 PM

ఇంగ్లండ్​తో జరగనున్న నాలుగో టెస్ట్​కు కీలక భారత ఆటగాడు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో అతడు లేని లోటును కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా మేనేజ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

ఇంగ్లండ్​తో జరగనున్న నాలుగో టెస్ట్​కు కీలక భారత ఆటగాడు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో అతడు లేని లోటును కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా మేనేజ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

  • Published Feb 19, 2024 | 12:35 PMUpdated Feb 19, 2024 | 12:35 PM
IND vs ENG: నాలుగో టెస్ట్‌కు కీలక ఆటగాడు దూరం! రోహిత్‌ ఎలా మ్యానేజ్‌ చేస్తాడో..?

రాజ్​కోట్ టెస్టులో ఘనవిజయం సాధించడంతో ఫుల్ జోష్​లో ఉంది రోహిత్ సేన. మూడో టెస్టులో ఏకంగా 434 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా రికార్డు సృష్టించింది టీమిండియా. పరుగుల పరంగా చూసుకుంటే భారత్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విక్టరీ కావడం విశేషం. ఊహించిన దాని కంటే సులువుగా విక్టరీ కొట్టడం, బజ్​బాల్ క్రికెట్​ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్​ను రెండోసారి చిత్తు చేయడంతో రోహిత్ సేన సంతోషంలో మునిగిపోయింది. ఇదే ఊపులో రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టులో నెగ్గి సిరీస్​ను అక్కడే పట్టేయాలని చూస్తోంది టీమిండియా. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి రాంచీ టెస్టులో గెలిస్తే 3-1తో సిరీస్ సొంతం అవుతుంది. అందుకే ఈ మ్యాచ్​ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే ఈ టెస్టుకు ఓ మ్యాచ్ విన్నర్ దూరం కానున్నాడని తెలుస్తోంది. దీంతో అతడి గైర్హాజరీలో కెప్టెన్ రోహిత్ ఎలా నెట్టుకొస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

స్వదేశంలో మరో టెస్టు సిరీస్ విక్టరీపై కన్నేసింది టీమిండియా. ఇంగ్లండ్​తో మూడో టెస్టులో ఘనవిజయం సాధించిన భారత్.. రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు రెడీ అవుతోంది. అయితే ఈ టెస్టుకు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది. వర్క్ లోడ్ కారణంగా అతడికి నాలుగో టెస్టుకు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినికిడి. విశ్రాంతి నేపథ్యంలో రాజ్​కోట్ నుంచి నేరుగా తన స్వస్థలం అహ్మదాబాద్​కు బుమ్రా వెళ్లనున్నాడని సమాచారం. నాలుగో టెస్టు కోసం భారత టీమ్ మొత్తం ఫిబ్రవరి 20న మంగళవారం చేరుకోనుంది. బుధవారం నుంచి అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయనుంది. అయితే రెస్ట్ ఇస్తుండటంతో బుమ్రా మాత్రం రాంచీకి కాకుండా అహ్మదాబాద్​కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఐదో టెస్టులో కూడా బుమ్రా ఆడేది కష్టమేనని ఎక్స్​పర్ట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది నాలుగో టెస్టు ఫలితం మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ రాంచీలోనే సిరీస్ నెగ్గితే ఐదో టెస్టులో బుమ్రా బరిలో దిగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అతడి ప్లేసులో యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇవ్వొచ్చని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తోందట. అలాగే వరుసగా రెండు మ్యాచుల్లో ఆడకపోతే బుమ్రాకు కూడా ఎక్కువ రెస్ట్ ఇచ్చినట్లు అవుతుందని అనుకుంటున్నారట. కానీ సిరీస్​కు డిసైడర్​గా మారిన నాలుగో టెస్టులో బుమ్రాను ఆడించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఆల్రెడీ వైజాగ్ టెస్టు తర్వాత 10 రోజుల రెస్ట్ దొరికిందని.. అది సరిపోతుందని చెబుతున్నారు. మరి.. నాలుగో టెస్టుకు బుమ్రా దూరం అనే వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Yashasvi Jaiswal: జైస్వాల్​కు అన్యాయం! ఇలా జరగడం రెండోసారి