iDreamPost

Yashasvi Jaiswal: జైస్వాల్​కు అన్యాయం! ఇలా జరగడం రెండోసారి

  • Published Feb 19, 2024 | 9:59 AMUpdated Feb 19, 2024 | 9:59 AM

భారత యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్​కు మరోమారు అన్యాయం జరిగింది. ఒకే సిరీస్​లో అతడికి ఇలా జరగడం ఇది రెండోసారి.

భారత యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్​కు మరోమారు అన్యాయం జరిగింది. ఒకే సిరీస్​లో అతడికి ఇలా జరగడం ఇది రెండోసారి.

  • Published Feb 19, 2024 | 9:59 AMUpdated Feb 19, 2024 | 9:59 AM
Yashasvi Jaiswal: జైస్వాల్​కు అన్యాయం! ఇలా జరగడం రెండోసారి

అసలైన బజ్​బాల్​ అంటే ఏంటో ఇంగ్లండ్​ జట్టుకు మరోమారు రుచి చూపించింది రోహిత్ సేన. విధ్వంసక బ్యాటింగ్, నిఖార్సయిన బౌలింగ్​తో ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేసింది. రాజ్​కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 434 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది టీమిండియా. మన జట్టు నిర్దేశించిన టార్గెట్​ను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది ఇంగ్లండ్. పరుగుల పరంగా చూసుకుంటే భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇదే అతిపెద్ద విజయం. అయితే ఈ విక్టరీలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కాంట్రిబ్యూషన్ గురించి స్పెషల్​గా చెప్పాలి. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో 10 పరుగులు మాత్రమే చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్​లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. భారత్​కు సూపర్ లీడ్ అందించాడు. అయినా అతడికి అన్యాయం జరిగింది. ఈ సిరీస్​లో ఇలా జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

రెండో ఇన్నింగ్స్​లో 236 బంతుల్లో 214 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు జైస్వాల్. అతడి ఇన్నింగ్స్​లో 14 బౌండరీలతో పాటు 12 భారీ సిక్సులు ఉన్నాయి. అండర్సన్, వుడ్ సహా ఇంగ్లండ్ బౌలర్లందరికీ ఓ రేంజ్​లో పోయించాడు జైస్వాల్. ఫోర్ల మీద ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్టోక్స్ సేనను షేక్ చేశాడు. అతడి కారణంగా మంచి లీడ్ దక్కడం, ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు ఛేజింగ్ స్టార్ట్ చేసి 122కే ఆలౌట్ అవడం తెలిసిందే. అయితే విజయంలో కీలకపాత్ర పోషించిన జైస్వాల్​కు అన్యాయం జరిగింది. అతడికి కాదని స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. ఈ మ్యాచ్​లో ఓవరాల్​గా 7 వికెట్లు తీసిన జడ్డూ.. బ్యాట్​తోనూ చెలరేగి తొలి ఇన్నింగ్స్​లో 112 పరుగులు చేశాడు. సెంచరీ చేయడం, ఏడు వికెట్లు కూడా తీయడంతో ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్ కింద అవార్డు కొట్టేశాడు జడేజా.

Injustice to Jaiswal! This is the second time this has happened

డబుల్ సెంచరీ బాదినా జైస్వాల్​కు అవార్డు రాలేదు. బ్యాట్, బంతితో చెలరేగిన జడ్డూనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం వరించింది. దీంతో జైస్వాల్ నిరాశలో కూరుకుపోయాడు. వైజాగ్ టెస్టులోనూ డబుల్ సెంచరీతో అలరించాడతను. మొదటి ఇన్నింగ్స్​లో 209 పరుగులు చేశాడు జైస్వాల్. అయినా ఆ మ్యాచ్​లో అతడికి అవార్డు రాలేదు. సెకండ్ టెస్టులో పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు. మొత్తంగా ఆ మ్యాచ్​లో అతడు 9 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పతనాన్ని శాసించడం, మ్యాచ్​ను అతడే మలుపు తిప్పడం, లో స్కోరింగ్ మ్యాచ్​లో విజయంలో కీలకపాత్ర పోషించడంతో బుమ్రాకు అవార్డు దక్కింది. వరుసగా రెండు డబుల్స్ కొట్టినా రెండుసార్లూ పురస్కారం రాకపోవడంతో జైస్వాల్​కు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వరుసగా రెండోసారి అతడికి ఇలా జరిగిందని సీరియస్ అవుతున్నారు. అయితే నిరాశ పడొద్దని.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్​ అతడికే దక్కుతుందని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. మరి.. జైస్వాల్​కు జరిగిన అన్యాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ఆ డేర్‌ చేసిన తొలి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ! ఇంగ్లండ్‌ అహంపై కొట్టాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి