Nidhan
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా విక్టరీ కొట్టింది. పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్‌ను ఆ ఇద్దరు బ్యాటర్లు అద్భుతమైన పోరాటంతో ఒడ్డున పడేశారు.
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా విక్టరీ కొట్టింది. పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్‌ను ఆ ఇద్దరు బ్యాటర్లు అద్భుతమైన పోరాటంతో ఒడ్డున పడేశారు.
Nidhan
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ విక్టరీతో 5 టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో గెలుచుకుంది భారత్. ఒక దశలో 120 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రోహిత్ సేన. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్లుగా ఆడలేదు. యశస్వి జైస్వాల్ (37), రోహిత్ శర్మ (55) మొదట్లో బాగానే ఆడారు. కానీ అనవసర షాట్‌కు ప్రయత్నించి జైస్వాల్ వికెట్ పారేసుకోవడంతో భారత్ పతనం స్టార్ట్ అయింది. రజత్ పాటిదార్ (0), సర్ఫరాజ్ ఖాన్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యారు. రవీంద్ర జడేజా (4) కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. అయితే శుబ్‌మన్ గిల్ (52 నాటౌట్), ధృవ్ జురెల్ (39 నాటౌట్) టీమ్‌ను ఆదుకున్నారు.
అరంగేట్ర టెస్టులో అదరగొట్టిన సర్ఫరాజ్‌తో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ జడేజా కూడా ఔట్ అవడంతో భారత్ ఓటమి దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. విజయానికి ఇంకో 72 పరుగులు కావాలి. ఆ టైమ్‌లో గిల్, జురెల్ పట్టుదలతో ఆడుతూ క్రీజులో పాతుకుపోయారు. బౌండరీలు రాకపోయినా సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. ఒక్కో పరుగును స్కోరు బోర్డు మీద చేరుస్తూ టీమ్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. వాళ్లిద్దరే నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఓటమి అంచున ఉన్న టీమ్‌ను ఈ ప్లేయర్లు గట్టెక్కించిన తీరును ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. తమ మీద టీమ్ మేనెజ్మెంట్, అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. మరి.. గిల్-జురెల్ బ్యాటింగ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నా రికార్డును అశ్విన్ బ్రేక్ చేయాలి.. కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
INDIA WINS THE TEST SERIES AGAINST ENGLAND…!!! 🇮🇳 pic.twitter.com/viTIoZYVIP
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024