iDreamPost
android-app
ios-app

IND vs ENG: మూడో టెస్టుకు ముందు భారత్​కు గుడ్​న్యూస్.. వాళ్లిద్దరూ తిరిగొస్తున్నారు!

  • Published Feb 08, 2024 | 12:08 PM Updated Updated Feb 08, 2024 | 12:08 PM

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టిన జోష్​లో ఉన్న టీమిండియా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్. వాళ్లిద్దరూ మళ్లీ టీమ్​లోకి వచ్చేస్తున్నారు.

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టిన జోష్​లో ఉన్న టీమిండియా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్. వాళ్లిద్దరూ మళ్లీ టీమ్​లోకి వచ్చేస్తున్నారు.

  • Published Feb 08, 2024 | 12:08 PMUpdated Feb 08, 2024 | 12:08 PM
IND vs ENG: మూడో టెస్టుకు ముందు భారత్​కు గుడ్​న్యూస్.. వాళ్లిద్దరూ తిరిగొస్తున్నారు!

బజ్​బాల్ క్రికెట్ అంటూ భయపెట్టిన ఇంగ్లండ్​ను వైజాగ్ టెస్టులో చిత్తుగా ఓడించింది భారత్. అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన రోహిత్ సేన.. 106 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్​ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా సహా చాలా టీమ్స్​ను బజ్​బాల్​తో బెదరగొట్టిన ఇంగ్లండ్​ను చావుదెబ్బ తీసింది టీమిండియా. సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టుల్లో ఎలా ఆడాలో చూపించింది. ఉప్పల్ టెస్టులో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. ఈ విక్టరీతో ఊపు మీదున్న భారత్.. రాజ్​కోట్​లో జరగబోయే మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు రోహిత్ సేనకు ఓ శుభవార్త. రెండో టెస్టుకు దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్లు తిరిగి టీమ్​లోకి వచ్చేస్తున్నారు. వాళ్లిద్దరి రాకతో ఇటు బ్యాటింగ్​తో పాటు అటు బౌలింగ్ యూనిట్ కూడా మరింత బలోపేతం కానుంది.

గాయం కారణంగా స్టార్ బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్, ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాలు వైజాగ్ టెస్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న వీళ్లు వేగంగా కోలుకుంటున్నారు. రాహుల్, జడ్డూ ఫిట్​నెస్​పై ఫిజియో నుంచి రిపోర్ట్ రాకపోయినా వీళ్లిద్దరూ మూడో టెస్టులో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. రాహుల్-జడేజాలు ఫుల్ ఫిట్​గా ఉన్నారని మూడో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న రాజ్​కోట్​లో వీళ్లు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వీళ్ల రూపంలో భారత అభిమానులకు ఓ శుభవార్త రాగా.. ఒక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్​తో మొదటి రెండు టెస్టులకు దూరమైన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సిరీస్​లోని మరో రెండు మ్యాచుల్లోనూ ఆడే అవకాశం లేదని సమాచారం.

రాజ్​కోట్, రాంచి టెస్టుల్లో కోహ్లీ ఆడటం కష్టమేనని తెలుస్తోంది. అలాగే ధర్మశాలలో జరిగే చివరి టెస్టుకూ అతడు అనుమానమేనని క్రికెట్ వర్గాల సమాచారం. సిరీస్​లోని తొలి మ్యాచ్ కోసం హైదరాబాద్​కు వచ్చిన విరాట్.. పర్సనల్ రీజన్స్​తో హఠాత్తుగా మొదటి రెండు మ్యాచుల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో బ్యాటర్ల ఫెయిల్యూర్​తో భారత్ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకైనా అందుబాటులో ఉంటాడని అనుకుంటే.. అతడు సిరీస్ మొత్తానికి దూరమవుతాడని వార్తలు వస్తున్నాయి. తన భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మను ఇవ్వడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో కోహ్లీ గేమ్​కు దూరంగా ఉన్నట్లు న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. మిగతా మూడు టెస్టులకు టీమ్​ను సెలక్ట్ చేయడానికి ఈ వారంలో సెలక్టర్లు సమావేశం కానున్నారు. ఆ సందర్భంగా కోహ్లీ గురించి కూడా డిస్కస్ చేయనున్నారు. మరి.. కోహ్లీ రీఎంట్రీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీతో 8 ఏళ్ల బంధానికి ​ఎండ్‌ కార్డ్‌! కాంట్రాక్ట్‌ ముగిసింది!