iDreamPost
android-app
ios-app

IND vs ENG: ఇంగ్లండ్​ను ఓడించడానికి కొత్త ప్లాన్స్ వద్దు.. అదొక్కటి ఫాలో అయితే చాలు!

  • Published Feb 01, 2024 | 9:00 AM Updated Updated Feb 01, 2024 | 9:00 AM

ఇంగ్లండ్​పై రివేంజ్ తీర్చుకునేందుకు రోహిత్ సేన రెడీ అవుతోంది. అయితే అందుకు కొత్త ప్లాన్స్ ఏవీ అక్కర్లేదు. జస్ట్ అదొక్కటి ఫాలో అయితే చాలు.

ఇంగ్లండ్​పై రివేంజ్ తీర్చుకునేందుకు రోహిత్ సేన రెడీ అవుతోంది. అయితే అందుకు కొత్త ప్లాన్స్ ఏవీ అక్కర్లేదు. జస్ట్ అదొక్కటి ఫాలో అయితే చాలు.

  • Published Feb 01, 2024 | 9:00 AMUpdated Feb 01, 2024 | 9:00 AM
IND vs ENG: ఇంగ్లండ్​ను ఓడించడానికి కొత్త ప్లాన్స్ వద్దు.. అదొక్కటి ఫాలో అయితే చాలు!

స్వదేశంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడని ఓ డిఫరెంట్ సిచ్యువేషన్​ను టీమిండియా ఇప్పుడు ఫేస్ చేస్తోంది. సొంతగడ్డపై సింహాలుగా పేరు తెచ్చుకున్న మన జట్టు.. ఇక్కడ ఆడే టెస్టు సిరీస్​లో ఒక మ్యాచ్ ఆడిపోవడమే చాలా అరుదు. అలాంటిది సిరీస్​లోని తొలి మ్యాచులోనే ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్క ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది టీమ్. ఇంగ్లండ్​తో ఉప్పల్ టెస్టులో భారత్ ఓడిన తీరు కంటే మన క్రికెటర్లు ఆడిన తీరు మీదే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టు మొత్తం అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ పూర్తి డిఫెన్సివ్ మోడ్​లోకి వెళ్లిపోవడం, ప్రత్యర్థి దూకుడుగా ఆడుతుంటే అడ్డుకోలేకపోవడం దారుణమని అభిమానులు అంటున్నారు. దీంతో రెండో టెస్టులో కొత్త ప్లాన్స్​తో బరిలోకి దిగాలని రోహిత్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇవేవీ అక్కర్లేదు.. ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేయాలంటే అదొక్కటి ఫాలో అయితే చాలు.

బజ్​బాల్​ క్రికెట్​ను అడ్డుకోవాలంటే భారత్​ ముందున్న ఒకే ఒక మార్గం ఫియర్​లెస్ క్రికెట్. భయం లేకుండా ఆడితేనే ఇంగ్లండ్​ను చిత్తు చేయగలం. నిర్భయంగానే కాదు.. ఓడిపోయినా పోయేదేం లేదు అన్నట్లుగా తెగించి ఆడాలి. బజ్​బాల్ బెండు తీయాలంటే ప్రత్యర్థి మార్గంలోనే వెళ్లాలి. బ్యాటింగ్, బౌలింగ్​లో అటాకింగ్ అప్రోచ్​తో దూసుకెళ్లాలి. ఎక్కడా డిఫెన్సివ్​ మోడ్​లో ఉన్నట్లు కనిపించొద్దు. ఇంగ్లండ్ ఎలాగూ అటాక్ చేస్తుంది. కాబట్టి మన ప్లేయర్లు దీనికి ముందే ప్రిపేర్ అవ్వాలి. వాళ్ల బ్యాటర్లు హిట్టింగ్​కు వెళ్లి భయపెట్టినా అస్సలు బెదరొద్దు. స్టంప్స్​ను అటాక్ చేస్తూ మంచి లైన్ అండ్ లెంగ్త్​లో బౌలింగ్ చేయాలి. ఫీల్డ్ ప్లేస్​మెంట్స్​ కూడా అలాగే పెడితే షాట్స్​ మిస్సయి పక్కా వికెట్లు పడతాయి. కౌంటర్ అటాక్ మంత్రంతో తిరగబడితే ప్రత్యర్థి జట్టు డిఫెన్స్​లో పడుతుంది.

No new plans to beat England

ఇంగ్లండ్ ఓడిపోయినా ఫర్వాలేదు.. తాము ఇలాగే ఆడతామని బల్లగుద్ది చెబుతోంది. అలాంటప్పుడు భారత్ విజయం కోసం కాకుండా శత్రువు పని పట్టాలనే పంతంతో ఆడాలి. బౌలింగ్​లో వికెట్ల కోసం అటాకింగ్ ఫీల్డ్​ను సెట్ చేయాలి. పరుగులు పోయినా వికెట్ల కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. బ్యాటింగ్​లో ఫస్ట్ బాల్​ నుంచి ఫోర్లు, సిక్సర్లు కొట్టాల్సిన అవసరం లేదు. కానీ స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ అడపాదడపా బౌండరీలు బాదితే ఇంగ్లండ్ బౌలర్లు డిఫెన్స్​లో పడతారు. తొలి టెస్టులో వికెట్లు పడుతుంటే, బాల్ టర్న్ అవుతుంటే మన బ్యాటర్లు ఒక్కరు కూడా క్రీజును వదిలి ముందుకొచ్చి ఆడలేదు. దీని వల్ల వాళ్ల బౌలర్లు మరింత చెలరేగారు. కాబట్టి వికెట్ పడితే ఒకరు స్ట్రయిక్ రొటేషన్ మీద, ఇంకొకరు అటాకింగ్ మీద ఫోకస్ చేయాలి. సంప్రదాయ తరహాలో ఆడుతూనే దూకుడు పెంచాలి. అప్పుడే ఇంగ్లండ్​కు ముకుతాడు వేయడం సాధ్యమవుతుందని ఎక్స్​పర్ట్స్ కూడా చెబుతున్నారు. ఫియర్​లెస్ అప్రోచ్​తో ఆడితే రోహిత్ సేనను ఆపడం ఎవరి తరం కాదంటున్నారు. మరి.. రెండో టెస్టులో భారత్ ఎలాంటి ప్లాన్​ను అనుసరిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.