Nidhan
వైజాగ్ ఆతిథ్యం ఇస్తున్న రెండో టెస్టులో భారత్‌తో తలపడబోయే తుదిజట్టును ప్రకటించింది ఇంగ్లండ్. అయితే ఫైనల్ ఎలెవన్‌లో అనూహ్యంగా ఓ 20 ఏళ్ల కుర్రాడికి చోటు కల్పించింది.
వైజాగ్ ఆతిథ్యం ఇస్తున్న రెండో టెస్టులో భారత్‌తో తలపడబోయే తుదిజట్టును ప్రకటించింది ఇంగ్లండ్. అయితే ఫైనల్ ఎలెవన్‌లో అనూహ్యంగా ఓ 20 ఏళ్ల కుర్రాడికి చోటు కల్పించింది.
Nidhan
భారత్‌తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టడంతో ఇంగ్లండ్ ఫుల్ జోష్‌లో ఉంది. బజ్‌బాల్ ఫార్ములా ఇండియాలో వర్కౌట్ కాదంటూ ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా ఆడి మొదటి టెస్టులో విజయం సాధించింది ఇంగ్లీష్ టీమ్. ఉప్పల్ టెస్టులో 28 పరుగులతో నెగ్గిన స్టోక్స్ సేన.. సిరీస్‌ను కైవసం చేసుకుంటామనే ధీమాలో కనిపిస్తోంది. అదే జోష్‌తో వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. శుక్రవారం నాడు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అవసరమైతే నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆడేందుకు వెనుకాడబోమని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పిన నేపథ్యంలో నిజంగానే అంత సాహసం చేస్తారా? అని అంతా అనుకున్నారు. కానీ ముగ్గురు స్పిన్నర్ల ప్లాన్‌కే కట్టుబడింది. తాజాగా తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించిన ఇంగ్లండ్.. అనూహ్యంగా 20 ఏళ్ల కుర్రాడికి తుదిజట్టులో చోటు కల్పించింది.
భారత్‌తో సిరీస్‌లో ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్న ఇంగ్లండ్.. రెండో టెస్టుకూ దాన్ని కంటిన్యూ చేసింది. శుక్రవారం నుంచి వైజాగ్ టెస్టు ప్రారంభం కానుండగా.. ఒక రోజు ముందుగానే తుదిజట్టును ప్రకటించింది. ఫైనల్ ఎలెవన్‌లో రెండు కీలక మార్పులు చేసింది. గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ జాక్ లీచ్ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో అతడి స్థానంలో 20 ఏళ్ల యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను టీమ్‌లోకి తీసుకుంది. అలాగే మొదటి టెస్టులో అంతగా ప్రభావం చూపలేకపోయిన స్టార్ ఆల్‌రౌండర్ మార్క్ వుడ్ స్థానంలో లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు అవకాశం ఇచ్చింది. ఓపెనింగ్ బాధ్యతల్ని జాక్ క్రాలేతో కలసి బెన్ డకెట్ పంచుకోనున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో గత మ్యాచ్ హీరో, వైస్ కెప్టెన్ ఓలీ పాప్ రానున్నాడు. సెకండ్ డౌన్లో స్టార్ బ్యాటర్ జో రూట్ ఆడతాడు.
మిడిలార్డర్ భారాన్ని జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్‌తో కలసి కెప్టెన్ బెన్ స్టోక్స్ షేర్ చేసుకుంటాడు. స్పిన్నర్లుగా రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ ఉండనే ఉన్నారు. అదనపు స్పిన్నర్‌గా బషీర్ జాయిన్ అయ్యాడు. రూట్ కూడా స్పిన్ బౌలింగ్‌తో మ్యాజిక్ చేస్తాడు కాబట్టి ఇంగ్లండ్ బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది. వైజాగ్ టెస్ట్‌లో అపోజిషన్ టీమ్ నుంచి స్పెషలిస్ట్ పేసర్‌గా అండర్సన్ ఒక్కడే ఆడతాడు. అతడితో పాటు సారథి స్టోక్స్ కూడా పేస్ బౌలింగ్ వేయగలడు. దీంతో అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌లోనూ ఇంగ్లీష్ టీమ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌తో బషీర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. దీంతో వైజాగ్ టెస్టు అతడికి ఎప్పటికీ గుర్తుండిపోనుంది. మరి.. ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
England 11 for the second Test vs India:
Crawley, Duckett, Pope, Root, Bairstow, Stokes, Foakes, Rehan, Hartley, Bashir, Anderson pic.twitter.com/cqPksJT6Yn
— Johns. (@CricCrazyJohns) February 1, 2024