Nidhan
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత బ్యాటింగ్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకుందామన్నాడు.
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత బ్యాటింగ్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకుందామన్నాడు.
Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ నెగ్గడం భారత్‌కు ఎంతో కీలకంగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవడం ముఖ్యం. అందుకోసమే కాదు.. బజ్‌బాల్ క్రికెట్‌ను చిత్తు చేయగలమని ప్రూవ్ చేసుకోవడానికి కూడా సిరీస్‌లోని మిగతా మ్యాచుల్లో నెగ్గడం రోహిత్ సేనకు కంపల్సరీగా మారింది. సిరీస్ స్టార్ట్ అవడానికి ముందు వరకు ఇంగ్లీష్ టీమ్‌ను ఓడించడం ఈజీ అని అంతా అనుకున్నారు. కానీ ఉప్పల్ టెస్టులో స్టోక్స్ సేన ఆడిన తీరు, భారత్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవడం, అటాకింగ్ గేమ్‌తో విజయం సాధించడం చూసి అందరూ షాకయ్యారు. దీంతో ఈ సిరీస్ నెగ్గడం భారత్‌కు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఇంగ్లండ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్న రెండో టెస్టులో తాడేపేడో తేల్చుకుందామన్నాడు.
తొలి టెస్టులో ఓడినా తమ గేమ్ స్టైల్ మార్చబోమని విక్రమ్ రాథోడ్ తెలిపాడు. బ్యాటింగ్‌లో సేమ్ అప్రోచ్‌తో ముందుకెళ్తామని అన్నాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఫార్ములాకు తమదైన శైలిలో ఆడుతూ దెబ్బ కొడతామన్నాడు. అటాకింగ్ క్రికెట్‌కు ఇంటెన్స్‌తో ఆడటానికి చాలా తేడా ఉందన్నాడు. ‘అటాకింగ్ చేయడానికి ఇంటెన్స్‌తో ఆడేందుకు డిఫరెన్స్ ఉంది. మా జట్టు ప్లేయర్లు మంచి ఇంటెన్స్‌తో బ్యాటింగ్ చేయడాలని కోరుకుంటున్నా. మ్యాచులో ఎప్పుడు స్కోర్ చేయడానికి అవకాశం దొరికినా వాళ్లు దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవాలి. మేం మా శైలిలోనే ఆడతాం. టీమ్‌లో కొందరు యంగ్‌స్టర్స్ ఉన్నారు. వాళ్లకు టెస్టు క్రికెట్లో అంతగా అనుభవం లేదు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇంకాస్త ఓపిక పట్టాలి. వాళ్ల బ్యాట్ నుంచి క్రమంగా పరుగులు వస్తాయి’ అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
ఇంజ్యురీ కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఎవర్ని తీసుకుంటారనే దాని మీద విక్రమ్ రాథోడ్ రియాక్ట్ అయ్యాడు. రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ రూపంలో ఇద్దరు సూపర్ బ్యాటర్స్ అందుబాటులో ఉన్నారని.. వీళ్లలో ఒకర్ని తీసుకోవడం చాలా కష్టమన్నాడు. అయితే ఈ విషయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ డిసిషన్ తీసుకుంటారని చెప్పాడు. పిచ్‌ను బట్టి ఫైనల్ ఎలెవన్ సెలక్షన్ ఉంటుందని తెలిపాడు. వైజాగ్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని.. కానీ తొలి రోజు నుంచే బాల్ టర్న్ కాకపోవచ్చన్నాడు. అయితే మంచి క్రికెట్ ఆడాలని, రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని ఆటగాళ్లకు చెప్పామన్నారు విక్రమ్ రాథోడ్. స్వీప్ షాట్ లాంటివి బాగా ప్రాక్టీస్ చేయాలని.. ఇలాంటి వాటి వల్ల బ్యాటర్లు కఠిన సమయాల్లోనూ పరుగులు చేయొచ్చన్నాడు. మరి.. ఇంగ్లండ్‌కు భారత బ్యాటింగ్ కోచ్ వార్నింగ్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India’s batting coach said, “there’s a difference between playing with intent and playing attacking cricket. I want them to play with intent. If there’s an opportunity to score some runs, they should take it”. pic.twitter.com/l9aEu6bwvP
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2024