iDreamPost

T20 World Cup: ఈ రోజే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌! టైమ్‌, లైవ్‌ వివరాలు ఇవే!

  • Published Jun 01, 2024 | 9:04 AMUpdated Jun 01, 2024 | 9:04 AM

IND vs BAN, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వామప్‌ మ్యాచ్‌ శనివారం జరగనుంది. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఇండియాకు ఉన్న ఏకైక వామప్‌ మ్యాచ్‌ ఇదే. మరి ఈ మ్యాచ్‌ లైవ్‌ ఎందులో చూడాలనుకుంటున్నారా? అయితే.. ఇప్పుడు తెలుసుకోండి.

IND vs BAN, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వామప్‌ మ్యాచ్‌ శనివారం జరగనుంది. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఇండియాకు ఉన్న ఏకైక వామప్‌ మ్యాచ్‌ ఇదే. మరి ఈ మ్యాచ్‌ లైవ్‌ ఎందులో చూడాలనుకుంటున్నారా? అయితే.. ఇప్పుడు తెలుసుకోండి.

  • Published Jun 01, 2024 | 9:04 AMUpdated Jun 01, 2024 | 9:04 AM
T20 World Cup: ఈ రోజే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌! టైమ్‌, లైవ్‌ వివరాలు ఇవే!

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 5 ఐర్లాండ్‌తో ఆడనుంది. అయితే.. అంతకంటే ముందు.. ఏకైక వామప్‌ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో శనివారం ఆడనుంది. టీమిండియాకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా.. ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వామప్‌ మ్యాచ్‌ను కూడా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇవ్వనున్నారు. వరల్డ్‌ కప్‌ ముందు ఉన్న ఒక ఒకే వామప్‌ మ్యాచ్‌లో ఇండియా ఎలా ఆడుతుందో అని క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వామప్‌ మ్యాచ్‌ లైవ్‌ ఎందులో వస్తుంది? ఏ టైమ్‌కి మ్యాచ్‌ స్టార్ట్‌ అవుతుంది? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు అధికారిక బ్రాడ్‌ కాస్టర్‌గా స్టార్‌ స్పోర్ట్స్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వామప్‌ మ్యాచ్‌ కూడా స్టార్‌ స్పోర్ట్స్‌లోనే లైవ్‌ కానుంది. దాంతో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచ్‌ లైవ్‌ను చూడొచ్చు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. శనివారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. అయితే.. ఇదే పిచ్‌పై జూన్‌ 9 ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కూడా జరగనుంది. దీంతో.. ఇండియాకు ఈ పిచ్‌పై మంచి ప్రాక్టీస్‌ కూడా లభించే అవకాశం ఉంది. కానీ, ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఆడటం లేదు. న్యూయార్క్‌కు ఆలస్యంగా చేరుకోవడంతో కోహ్లీ వామాప్‌ మ్యాచ్‌ను మిస్‌ అవుతున్నాడు.

ఇక రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో ఉంది. 2023లో మిస్‌ అయిన వన్డే వరల్డ్‌ కప్‌ బాధను కాస్త తగ్గించుకునేందుకు అయినా.. ఈ పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడలని భావిస్తోంది. అప్పుడెప్పుడే.. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియా.. మళ్లీ టీ20 వరల్డ్‌ కప్‌ను గెలవలేదు. ఇండియాకు టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌గా ధోని ఒక్కడే ఉన్నాడు. ఆ రికార్డును సమం చేసి ధోని సరసన నిలవాలని రోహిత్‌ భావిస్తున్నాడు. మరి ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వామప్‌ మ్యాచ్‌తో పాటు, ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో టీమిండియా విజయావకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి