వీడియో: గ్రౌండ్​లోకి దూసుకొచ్చిన ఫ్యాన్​ను చితకబాదారు.. US పోలీసులు ఇంతే!

భారత్-బంగ్లాదేశ్ మధ్య న్యూయార్క్ వేదికగా నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​తో టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్​ను ఘనంగా స్టార్ట్ చేసింది రోహిత్ సేన.

భారత్-బంగ్లాదేశ్ మధ్య న్యూయార్క్ వేదికగా నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​తో టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్​ను ఘనంగా స్టార్ట్ చేసింది రోహిత్ సేన.

టీ20 వరల్డ్ కప్-2024 ప్రిపరేషన్స్​ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్​తో శనివారం జరిగిన వార్మప్ మ్యాచ్​లో రోహిత్ సేన 60 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (32 బంతుల్లో 53) సూపర్బ్ నాక్​తో అలరించాడు. ఆఖర్లో పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్​తో సత్తా చాటాడు. ట్రిక్కీ పిచ్​పై చేజింగ్​లో తడబడిన బంగ్లా.. 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే కుప్పకూలింది. అర్ష్​దీప్ సింగ్, శివమ్ దూబె చెరో 2 వికెట్లతో ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచారు. అయితే ఈ మ్యాచ్​లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఓ అభిమాని నేరుగా గ్రౌండ్​లోకి దూసుకొచ్చాడు.

సాధారణంగా క్రికెట్ స్టేడియాల్లోకి అభిమానులు దూసుకురావడం కామనే. ఫేవరెట్ స్టార్స్​ను దగ్గర నుంచి చూడాలని, వారిని కలవాలని, వారి మీద తమకు ఉన్న అభిమానాన్ని చూపించే క్రమంలో ఫ్యాన్స్ ఇలా చేస్తుంటారు. అయితే భారత్, శ్రీలంక లాంటి ఆసియా దేశాల్లో గ్రౌండ్​లోకి ఫ్యాన్స్ దూసుకొచ్చినా పోలీసులు పెద్దగా ఏమీ అనరు. వాళ్లను అదుపులోకి తీసుకొని వెళ్లిపోతారు. కానీ అమెరికా పోలీసుల తీరే వేరు. నిన్న భారత్-బంగ్లా మ్యాచ్​ టైమ్​లో మైదానంలోకి వచ్చిన ఫ్యాన్​ను చితకబాదారు అక్కడి పోలీసులు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెబుతున్నా వినకుండా అతడ్ని కిందపడేసి కొట్టారు. ఆ తర్వాత అతడి చేతికి బేడీలు వేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఫ్యాన్​తో కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి, అతడ్ని కొట్టొద్దంటూ రోహిత్ కోరాడు. కానీ అమెరికా పోలీసులు అతడి మాట వినిపించుకోలేదు. కింద పడేసి కొడుతూ బేడీలు వేశారు. దీన్ని చూసిన నెటిజన్స్ యూఎస్​లో ఇలాంటివి సర్వసాధారణమని అంటున్నారు. బేస్​బాల్, ఫుట్​బాల్ మ్యాచుల్లో ఇలాంటివి జరుగుతుంటాయని, అక్కడి పోలీసులు అలాంటి ఘటనలు సీరియస్​గా తీసుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు. స్మూత్​గా డీల్ చేయడం ఉండదని, కొట్టడమే అన్నట్లు యూఎస్​ పోలీసుల తీరు ఉంటుందని చెబుతున్నారు. టీ20 వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్​ల టైమ్​లో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని.. పొరపాటున కూడా గ్రౌండ్​లో అడుగుపెట్టొద్దని సూచిస్తున్నారు. ఆటకు ఆటంకం కలిగిస్తే పోలీసులు వదిలిపెట్టరని హెచ్చరిస్తున్నారు. మరి.. అభిమానిని పోలీసులు చితకబాదడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments