iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్‌ కోసమే బంగ్లాదేశ్‌పై టీమిండియా ఓడిపోయిందా?

  • Author singhj Published - 01:23 PM, Sat - 16 September 23
  • Author singhj Published - 01:23 PM, Sat - 16 September 23
పాకిస్థాన్‌ కోసమే బంగ్లాదేశ్‌పై టీమిండియా ఓడిపోయిందా?

ఆసియా కప్​-2023లో ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న భారత్ విజయయాత్రకు బ్రేక్ పడింది. సూపర్-4 దశలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో కోహ్లీ, బుమ్రా, సిరాజ్, కుల్​దీప్, హార్దిక్ లాంటి కీలక ప్లేయర్లకు జట్టు మేనేజ్​మెంట్ విశ్రాంతినిచ్చింది. వీళ్ల స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, ప్రసిద్ధ్​ కృష్ణలకు టీమ్​లో చోటునిచ్చింది. సూపర్-4 దశలో పాకిస్థాన్​ లాంటి టాప్ టీమ్​తో పాటు పటిష్టంగా ఉన్న శ్రీలంకపై కూడా గెలిచిన భారత్.. బంగ్లాదేశ్​పై ఓడిపోవడాన్ని కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

టీమిండియా ఓటమిని కొందరు సీరియస్​గా తీసుకుంటుంటే.. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. నామమాత్రపు మ్యాచ్ కాబట్టే ప్రధాన ఆటగాళ్లను పక్కన పెట్టి తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి కుర్రాళ్లకు టీమ్ మేనేజ్​మెంట్ ఛాన్స్ ఇచ్చిందని.. ఈ ఓటమి వల్ల పోయేదేమీ లేదని అంటున్నారు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం భారత ఓటమితో పాకిస్థాన్​పై సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. బంగ్లాదేశ్​పై ఓడిపోయినా ఆసియా కప్ పాయింట్ల పట్టికలో టీమిండియా ఫస్ట్ ప్లేసులోనే ఉంది. కానీ రెండు మ్యాచ్​లు ఓడిపోయిన బంగ్లా.. భారత్​పై గెలుపుతో టేబుల్​లో మూడో స్థానానికి ఎగబాకింది. అయితే భారత్, శ్రీలంకపై ఓడిపోయిన పాకిస్థాన్ నాలుగో స్థానానికి పడిపోయింది.

బంగ్లా, పాక్​లు చెరో రెండు మ్యాచ్​లు ఓడిపోయినా దాయాది జట్టు నెట్ రన్​రేట్ తక్కువగా ఉండటంతో టేబుల్​లో లాస్ట్ ప్లేస్​కు పడిపోయింది. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ టీమిండియా ఫ్యాన్స్ నెట్టింట జోక్స్ పేలుస్తున్నారు. పాక్​ను టేబుల్​లో లాస్ట్ ప్లేసులో ఉంచడం కోసమే బంగ్లాతో మ్యాచ్​లో భారత్ ఓడిపోయిందని పోస్టులు పెడుతున్నారు. ఇండియా గెలుపే కాదు ఓడినా మీకు పరేషాన్ తప్పదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే పాక్ ఫ్యాన్స్ మాత్రం మీ జట్టు ఓడిపోయిందని బాధపడకపోగా.. మా మీద జోక్స్ వేస్తారా అంటూ సీరియస్ అవుతున్నారు. తమ జట్టు ఇలా నవ్వులపాలు కావడాన్ని పాక్ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. భారత ఫ్యాన్స్ తమను ఎగతాళి చేయడానికి కారణం బాబర్ సేన చెత్తాటే అంటూ మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: కోహ్లీ ఒక్కడే కాదు.. అతడ్ని మించిన లెజెండ్స్ డ్రింక్స్ మోశారు!