అప్పట్లో సచిన్, ఇప్పుడు గిల్.. టీమిండియా ఓటమికి అదే కారణమా?

  • Author singhj Updated - 08:54 AM, Sat - 16 September 23
  • Author singhj Updated - 08:54 AM, Sat - 16 September 23
అప్పట్లో సచిన్, ఇప్పుడు గిల్.. టీమిండియా ఓటమికి అదే కారణమా?

ఆసియా కప్​-2023లో ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతున్న టీమిండియాకు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. సూపర్-4లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్​లో 6 రన్స్ తేడాతో బంగ్లా చేతిలో భారత్ ఓటమిపాలైంది. టీమిండియా ఈ మ్యాచ్​కు విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్​దీప్ యాదవ్​లకు విశ్రాంతినిచ్చింది. వాళ్ల స్థానాల్లో తిలక్ వర్మ, మహ్మద్ షమి, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణలకు టీమ్​లో అవకాశమిచ్చింది. ఈ మ్యాచ్​తోనే హైదరాబాదీ తిలక్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాతో మ్యాచ్​లో ఛేజింగ్​లో భారత్​కు శుభారంభం దక్కలేదు.

కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (5), కేఎల్ రాహుల్ (19), ఇషాన్ కిషన్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. సూర్యకుమార్ యాదవ్ (26), రవీంద్ర జడేజా (7) కూడా స్వల్ప వ్యవధిలోనే ఔటవ్వడంతో భారత్ దిక్కుతోచని స్థితిలో కనిపించింది. కానీ శుబ్​మన్ గిల్ (121) మాత్రం ఒంటటి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆపద్బాంధవుడి పాత్రను పోషిస్తూ జట్టును రేసులో నిలిపాడు. అయితే రిక్వైర్డ్ రన్​రేట్ పెరిగిపోవడంతో హిట్టింగ్​కు వెళ్లిన గిల్.. మెహదీ హసన్ బౌలింగ్​లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్​కు ప్రయత్నించి ఔటై వెనుదిరిగాడు. గిల్ ఔటైనా అక్షర్ పటేల్ మాత్రం పట్టు వదల్లేదు. టీమిండియాను విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు.

శార్దూల్​తో కలసి చక్కగా బ్యాటింగ్ చేసిన అక్షర్.. జట్టును గెలిపించేట్లే కనిపించాడు. కానీ 49వ ఓవర్​లో వీళ్లిద్దరూ ఔటవ్వడంతో భారత ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు. ఆ తర్వాత షమి రనౌటవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఆసియా కప్ చరిత్రలో భారత్​పై బంగ్లాదేశ్​కు రెండో విజయమిది. ఈ రెండు సార్లు కూడా టీమిండియా తరఫున రెండు సెంచరీలు నమోదయ్యాయి. 2012లో బంగ్లాతో ఆసియా కప్ మ్యాచ్​లో సచిన్ (114) సెంచరీ కొట్టాడు. ఇప్పుడేమో గిల్ శతకం బాదాడు. మన ప్లేయర్లు సెంచరీలు కొట్టిన రెండు సందర్భాల్లోనూ జట్టు ఓటమిపాలైంది. దీంతో కొందరు నెటిజన్స్ వీళ్ల సెంచరీలే భారత్ కొంపముంచాయంటూ అర్థం లేని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రెండు మ్యాచుల్లోనూ మిడిల్ ఓవర్లలో భారత బౌలర్ల ఫెయిల్యూర్ కామన్​గా కనిపిస్తోంది. అలాగే బ్యాట్స్​మెన్ త్వరగా ఔటవ్వడం కూడా జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.

ఇదీ చదవండి: బంగ్లాపై భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు!

Show comments