Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ భారత మాజీ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. కావాలనే అతడ్ని పక్కనబెట్టారని.. ఇది అన్యాయమని అన్నాడు. కోహ్లీ కోసం అతడ్ని బలిపశువును చేస్తున్నారని ఫైర్ అయ్యాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ భారత మాజీ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. కావాలనే అతడ్ని పక్కనబెట్టారని.. ఇది అన్యాయమని అన్నాడు. కోహ్లీ కోసం అతడ్ని బలిపశువును చేస్తున్నారని ఫైర్ అయ్యాడు.
Nidhan
పొట్టి ప్రపంచ కప్-2023 ప్రిపరేషన్స్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. చాన్నాళ్ల కిందే యూఎస్ఏ చేరుకొని సాధన మొదలుపెట్టిన రోహిత్ సేన.. నిన్న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. 60 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా.. మెయిన్ మ్యాచెస్‌లో మరింత కాన్ఫిడెన్స్‌తో దిగనుంది. నిన్నటి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో చాలా మందిని పరీక్షించింది భారత్. 8 మంది బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లోనూ ఏడుగురికి ప్రాక్టీస్ దొరికింది. అయితే అంతా బాగానే ఉన్నా ఓ ప్లేయర్‌ను ఆడించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఆడే అవకాశం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు. టీమిండియాలో ఓపెనింగ్ స్పాట్ కోసం జైస్వాల్, రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీ రీసెంట్గా అమెరికా చేరుకోవడం, ప్రయాణంతో అలసిపోయాడని ఆడించలేదు. దీంతో జైస్వాల్‌ను పక్కాగా ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ మాత్రం యంగ్ ప్లేయర్‌ను కాదని శాంసన్‌ను ఓపెనింగ్‌లో దింపాడు. దీంతో మెయిన్ మ్యాచెస్‌లో కోహ్లీతో కలసి తానే ఓపెనింగ్‌కు రానున్నట్లు సిగ్నల్స్ ఇచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సీరియస్ అయ్యాడు. కోహ్లీ కోసం జైస్వాల్‌ను బలిపశువును చేస్తున్నారని అన్నాడు.
కోహ్లీ కోసం జైస్వాల్‌ను బలిపశువును చేస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదంటూ రోహిత్‌పై సీరియస్ అయ్యాడు మంజ్రేకర్. ఇలాంటి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి.. వార్మప్ మ్యాచ్‌లో పక్కనబెట్టడం తప్పుడు సూచనలు ఇచ్చినట్లు అయిందన్నాడు. ‘నిన్నటి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ జైస్వాల్ బెంచ్ మీదే కూర్చోవాల్సి వచ్చింది. ఒకవేళ నా చేతిలో పవర్ ఉంటే పూర్తిగా కొత్త టాలెంటెడ్ ప్లేయర్లతో మ్యాచ్‌కు వెళ్లేవాడ్ని. ఎంతో ప్రతిభ కలిగిన జైస్వాల్ లాంటి యంగ్‌స్టర్స్‌కు అవకాశాలు ఇస్తే చెలరేగి ఆడతారు. అప్పుడు జట్టు కూర్పు వైవిధ్యంగా మారుతుంది. కానీ భారత్ మాత్రం సీరియర్లను నమ్ముకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆ ప్లాన్ బెడిసికొట్టింది’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. మరి.. వార్మప్ మ్యాచ్‌లో జైస్వాల్‌ను ఆడించకపోవడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Sanjay Manjrekar “Unfortunately, Jaiswal will have to sit out.I would have gone completely with a new lot & then he would have had a lot more flair & it would be something different.But India has trusted the seniors move that hasn’t worked over the years”pic.twitter.com/mWloklmXz1
— Sujeet Suman (@sujeetsuman1991) June 2, 2024