హార్దిక్ ఈజ్ బ్యాక్.. బంగ్లా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు!

టీమిండియా ఫినిషర్ హార్దిక్ పాండ్యా తన మజిల్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

టీమిండియా ఫినిషర్ హార్దిక్ పాండ్యా తన మజిల్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

హార్దిక్ పాండ్యా ఈజ్ బ్యాక్. భారీ షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఈ ఫినిషర్.. తిరిగి తన రిథమ్​లోకి వచ్చాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న సూపర్ పోరులో పాండ్యా మెరుపు బ్యాటింగ్​తో అలరించాడు. అపోజిషన్ టీమ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 27 బంతులు ఎదుర్కొన్న అతడు.. 4 బౌండరీలు, 3 భారీ సిక్సుల సాయంతో 50 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. 185 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్​లో రఫ్ఫాడించాడు టీమిండియా వైస్ కెప్టెన్.

భారత్​ అప్పటికే మంచి పొజిషన్​లో ఉండటంతో బ్యాటింగ్​కు దిగిన వెంటనే హిట్టింగ్ మొదలుపెట్టాడు హార్దిక్. స్పిన్, పేస్​ అనే తేడాల్లేకుండా ఎవరు బౌలింగ్​కు వచ్చినా బాదిపారేశాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఫైనల్ ఓవర్​లో మూడు ఫోర్లు కొట్టాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ వల్లే టీమిండియా అన్ని ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఒక దశలో 180 వెళ్తుందేమో అనుకుంటే.. పాండ్యా హిట్టింగ్​తో దాదాపు 200 వరకు వచ్చింది రోహిత్ సేన. హార్దిక్​తో పాటు విరాట్ కోహ్లీ (37), రిషబ్ పంత్ (36), శివమ్ దూబె (34) రాణించారు. మరి.. హార్దిక్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments