ఒక్క ఇన్నింగ్స్​తో వాళ్ల నోళ్లు మూయించిన హార్దిక్.. ఇది కదా నీ అసలు రూపం!

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్​లో భారీ షాట్లతో పెను విధ్వంసం సృష్టించాడు.

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్​లో భారీ షాట్లతో పెను విధ్వంసం సృష్టించాడు.

హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్-2024 ముందు వరకు అతడికి హీరో ఇమేజ్ ఉండేది. విధ్వంసక బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్​తో టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడతను. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో రెగ్యులర్ ప్లేయర్​గా ఉన్న హార్దిక్.. గాయం కారణంగా క్రమంగా టెస్టులకు దూరమవుతూ వచ్చాడు. ఇంజ్యురీ కారణంగా వన్డే వరల్డ్ కప్-2023 మధ్యలోనే తప్పుకున్న పాండ్యా.. మళ్లీ ఐపీఎల్​ తాజా సీజన్​తో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ముంబై ఇండియన్స్​ కెప్టెన్​గా ఫెయిలవడం, బ్యాటర్​గా, బౌలర్​గానూ అట్టర్ ఫ్లాప్ అవడంతో అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇలాంటోడ్ని ఎందుకు టీ20 వరల్డ్ కప్​కు తీసుకెళ్తున్నారంటూ ట్రోలింగ్​కు గురయ్యాడు. అతడి పనైపోయింది.. జట్టులోకి తీసుకోవడం దండగ అంటూ దారుణంగా అవమానించారు.

ఒకవైపు ఐపీఎల్ ఫెయిల్యూర్, మరోవైపు భార్య నటాషాతో విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలతో హార్దిక్ మానసికంగా కుంగిపోయాడు. దీంతో అతడు టీ20 ప్రపంచ కప్​లో రాణించడం కష్టమని అంతా ఫిక్స్ అయ్యారు. ఇన్ని విమర్శలు వస్తున్నా పాండ్యా సామర్థ్యం మీద బీసీసీఐ నమ్మకం ఉంచింది. పొట్టి కప్పు టీమ్​లోకి తీసుకోవడమే గాకుండా వైస్ కెప్టెన్సీ ఇచ్చి అతడిలో నమ్మకాన్ని పెంచింది. బోర్డు విశ్వాసాన్ని హార్దిక్ వమ్ము చేయలేదు. వరల్డ్ కప్​ ప్రిపరేషన్స్​లో భాగంగా బంగ్లాదేశ్​తో శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​లో హార్దిక్ విశ్వరూపం చూపించాడు. 23 బంతుల్లోనే 40 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్​తో మెరిశాడు. 2 బౌండరీలు బాదిన ఈ స్టార్ ఆల్​రౌండర్.. 4 భారీ సిక్సులు కొట్టాడు. ఒకే ఓవర్​లో 3 సిక్సులు బాదిన పాండ్యా.. ఆ తర్వాత కూడా అదే జోష్​తో రన్స్ చేశాడు.

బ్యాట్​తోనే గాక బంతితోనూ సత్తా చాటాడు హార్దిక్. 3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి.. 1 వికెట్ తీశాడు. రన్స్ బాగానే ఇచ్చుకున్నా అతడు మంచి రిథమ్​లో బౌలింగ్ వేయడం విశేషం. బంగ్లా ఓపెనర్​ తంజిద్ హసన్​ను ఔట్ చేశాడు పాండ్యా. నిన్న మ్యాచ్​లో ఒకవైపు బ్యాటింగ్, మరోవైపు బౌలింగ్​లో సత్తా చాటిన పాండ్యా.. ఫీల్డింగ్​లోనూ తడాఖా చూపించాడు. ఒక క్యాచ్ పట్టడమే గాక గ్రౌండ్ ఫీల్డింగ్​లో రన్స్ కాపాడాడు. ఒకప్పటి హార్దిక్​ను గుర్తుచేస్తూ చెలరేగాడు. తాను పనికిరానంటూ విమర్శించిన వారి నోళ్లను ఒక్క మ్యాచ్​తో మూయించాడు. ఇది చూసిన నెటిజన్స్.. పాండ్యా ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. ఇది కదయ్యా నీ అసలు రూపమని మెచ్చుకుంటున్నారు. అతడు ఇలాగే ఆడితే మెగా టోర్నీలో రోహిత్ సేనకు తిరుగుండదని చెబుతున్నారు. మరి.. హార్దిక్ ఆడిన తీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments