iDreamPost

IND vs AUS: టీమిండియా బ్యాటర్​కు సారీ చెప్పిన అంపైర్! ఎందుకంటే..?

  • Author singhj Updated - 07:52 PM, Sat - 2 December 23

టీమిండియా యంగ్ బ్యాటర్​కు అంపైర్ క్షమాపణలు చెప్పాడు. అసలు క్రికెటర్​కు అంపైర్ ఎందుకు సారీ చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా యంగ్ బ్యాటర్​కు అంపైర్ క్షమాపణలు చెప్పాడు. అసలు క్రికెటర్​కు అంపైర్ ఎందుకు సారీ చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Updated - 07:52 PM, Sat - 2 December 23
IND vs AUS: టీమిండియా బ్యాటర్​కు సారీ చెప్పిన అంపైర్! ఎందుకంటే..?

ఆస్ట్రేలియాతో జరుగుతుతన్న 5 టీ20ల సిరీస్​ను భారత జట్టు సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో మన టీమ్ 20 రన్స్ తేడాతో కంగారూలను ఓడించింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన టీమిండియా ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (37) ధాటిగా ఆడటంతో భారత్ 5.5 ఓవర్లలోనే 50 రన్స్ చేసింది. అయితే స్కోరు బోర్డు సాఫీగా సాగిపోతున్న దశలో ఒక్కసారిగా వికెట్లు పడ్డాయి. 13 రన్స్ వ్యవధిలోనే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్​కు చేరుకున్నారు. జైస్వాల్​తో పాటు శ్రేయస్ అయ్యర్ (8), సూర్యకుమార్ యాదవ్ (1) వెంటవెంటనే ఔటయ్యారు. అయితే వికెట్లు పడ్డా రుతురాజ్ గైక్వాడ్ (32) అదే జోరును కంటిన్యూ చేశాడు.

రింకూ సింగ్​ (46)తో కలసి ఇన్నింగ్స్​ను బిల్డ్ చేశాడు రుతురాజ్. ఆ తర్వాత రుతు ఔటైనా రింకూ మాత్రం హిట్టింగ్​ను కంటిన్యూ చేశాడు. తన్వీస సంఘా, షార్ట్, డ్వార్షిస్ బౌలింగ్​లో సిక్సులతో అలరించాడు. రుతు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కొత్త కుర్రాడు జితేష్ శర్మ (35) తోడుగా నిలవడంతో రింకూ భారీ షాట్లు ఆడాడు. మరోవైపు జితేష్ కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఆసీస్ బౌలర్లపై అటాకింగ్​కు దిగాడు. అయితే డేంజరస్​గా మారుతున్న ఈ జోడీని డ్వార్షిస్ విడదీశాడు. జితేష్​ను అతడు ఔట్ చేశాడు. ఆ తర్వాత రింకూతో పాటు అక్షర్ పటేల్ (0), దీపక్ చాహర్ (0), రవి బిష్ణోయ్ (4) వెంటవెంటనే ఔటయ్యారు. ఆఖర్లో టపాటపా బ్యాటర్లు ఔటవ్వడంతో భారత్ భారీ టార్గెట్​ను సెట్ చేయలేకపోయింది.

ఛేజింగ్​కు దిగిన ఆసీస్​ను భారత స్నిన్నర్లు తిప్పేశారు. అక్షర్ పటేల్ 3 వికెట్లతో కంగారూ పతనాన్ని శాసించాడు. అతడికి దీపక్ చాహర్ (2/44), రవి బిష్ణోయ్ (1/17) చక్కటి సహకారం అందించారు. అక్షర్ మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో స్పిన్నర్ బిష్ణోయ్ ఎక్కువ వికెట్లు తీయకున్నా.. రన్స్​ ఇవ్వకుండా అడ్డుపడుతూ అపోజిషన్ టీమ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఆసీస్ టీమ్​లో ట్రావిస్ హెడ్ (31), మాథ్యూ వేడ్ (36 నాటౌట్) రాణించారు. మొదట్లో భారత బౌలర్లపై అటాక్​కు దిగి భయపెట్టాడు హెడ్. కానీ అతడ్ని అక్షర్ వెనక్కి పంపాడు. ఆఖర్లో వేడ్ భారీ షాట్లు కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేద్దామని అనున్నాడు. కానీ అతడ్ని బౌన్సర్లు, యార్కర్లతో కట్టిపడేశారు టీమిండియా బౌలర్లు.

భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ కలసి 8 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టారు. వీళ్లిద్దరూ కలసి కేవలం 33 పరుగులే ఇచ్చారు. దీంతో ఆసీస్ ఛేజ్ చేయడం కష్టమైపోయింది. స్పిన్​ను సమర్థంగా ఎదుర్కోకపోవడం కంగారూలకు మైనస్ పాయింట్​గా మారింది. ఇక, ఈ మ్యాచ్​లో టీమిండియా ఇన్నింగ్స్​ టైమ్​లో బ్యాటర్ జితేష్ శర్మకు అంపైర్ సారీ చెప్పడం ఇంట్రెస్టింగ్​గా మారింది. 14వ ఓవర్​లో జితేష్ కొట్టిన ఓ బాల్ బౌలర్ క్రీస్ గ్రీన్ వైపు వేగంగా దూసుకొచ్చింది. కానీ అతడు క్యాచ్ అందుకోలేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్​కు బలంగా తాకింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ఇంజ్యురీ కాలేదు. అయితే బాల్ గనుక అంపైర్​కు తాకకపోయి ఉంటే ఈజీగా బౌండరీ దాటేసేది. కానీ బాల్​ అనంత పద్మనాభన్​కు తగిలి అక్కడే ఉండిపోయింది. అయితే తన వల్లే ఆ బాల్​కు రన్ రాలేదని అర్థం చేసుకున్న అంపైర్ అనంత పద్మనాభన్.. బ్యాటర్ జితేష్​​కు సారీ చెప్పారు అంపైర్. జితేష్​కు అంపైర్ క్షమాపణలు చెబుతున్న వీడియో నెట్టింట వైరల్​గా మారింది. జితేష్ కొట్టిన షాట్​కు అంపైర్ అప్రమత్తంగానే ఉన్నాడు. కానీ బౌలర్ క్రిస్ గ్రీన్ కారణంగా అతడికి బంతి తగిలింది. మరి.. భారత బ్యాటర్​కు అంపైర్ సారీ చెప్పడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sourav Ganguly: వీళ్లంతా కాదు.. టీమిండియా కెప్టెన్‌గా అతనే ఉండాలి: గంగూలీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి