iDreamPost

Sourav Ganguly: వీళ్లంతా కాదు.. టీమిండియా కెప్టెన్‌గా అతనే ఉండాలి: గంగూలీ

  • Published Dec 02, 2023 | 4:39 PMUpdated Dec 03, 2023 | 3:10 PM

వరల్డ్‌ కప్‌ పోయిన బాధ నుంచి బయట పడిన తర్వాత.. ఇంకా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ గ్రౌండ్‌లోకి దిగలేదని ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ నిరాశపడుతున్నారు. ఈ క్రమంలోనే టీ20లకు, వన్డేలకు వేర్వేరు కెప్టెన్లను నియమిస్తుండటంపై కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపైనే తాజాగా గంగూలీ స్పందించాడు. మరి ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఫైనల్లో ఓటమి ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులతో పాటు, ఆటగాళ్లను ఎంతో బాధించింది. ఇంకా చాలా మంది ఆ గాయం నుంచి కోలుకోలేదు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అయితే.. ఈ ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా గడుపుతున్నారు. వరల్డ్‌ కప్‌ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌, అలాగే సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు సైతం ఈ ఇద్దరు సూపర్‌ స్టార్‌ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. వరల్డ్‌ కప్‌ పోయిన బాధ నుంచి బయటపడితే కానీ, వాళ్లు ఫీల్డ్‌లోకి దిగేలా లేరు. ఎట్టకేలకు సౌతాఫ్రికాతో వాళ్ల దేశంలోనే జరిగే టెస్టు సిరీస్‌తో మళ్లీ రోహిత్‌-కోహ్లీ జోడీ బరిలోకి దిగనుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. రోహిత్‌ శర్మ అందుబాటులో లేకపోవడంతో టీమిండియాలో కొత్త కెప్టెన్లు పుట్టుకొస్తున్నారు.

తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ను బీసీసీఐ కెప్టెన్‌గా నియమించిన విషయం​ తెలిసిందే. అలాగే సౌతాఫ్రికాతో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు సైతం సూర్యకుమార్‌ యాదవ్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కానీ, మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇక టెస్టులకు ఎలాగో రెగ్యులర్‌ కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ వస్తుండటంతో అతనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా, ఈ కెప్టెన్ల మార్పిడి, అలాగే భవిష్యత్తులో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా కొనసాగే విషయమై.. టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించారు. కానీ, అతని వన్డే ఫార్మాట్‌లో అతని ప్రదర్శన బాగా లేకపోవడంతో.. వన్డేలకు కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. కానీ, మూడు ఫార్మాట్లు ఆడేందుకు రోహిత్‌ శర్మ సిద్ధంగా ఉంటే.. అతన్నే కెప్టెన్‌గా కొనసాగించాలని, అతనో గొప్ప నాయకుడని దాదా కొనియాడాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భారత జట్టును రోహిత్‌ శర్మ అద్భుతంగా నడిపించాడని.. అతన్నే మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉంచాలని అదే టీమిండియాకు మంచిదని పేర్కొన్నాడు. రానున్న టీ20 వరల్డ్ కప్‌కు రోహిత్‌ కెప్టెన్సీలోనే వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు దాదా. మరి గంగూలీ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి