మ్యాచ్‌లు ఫినిష్ చేయడంపై తాను ఫోకస్ చేస్తున్నానని టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఈ విషయంలో ఒక ప్లేయర్‌ను చూసి తాను నేర్చుకుంటున్నానని చెప్పాడు.
మ్యాచ్‌లు ఫినిష్ చేయడంపై తాను ఫోకస్ చేస్తున్నానని టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఈ విషయంలో ఒక ప్లేయర్‌ను చూసి తాను నేర్చుకుంటున్నానని చెప్పాడు.
క్రికెట్లో మ్యాచ్‌లు ఫినిష్ చేయడం అనేది ఓ కళ. వన్డేలు, టెస్టులు, టీ20లు.. ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ముగించడం చాలా ముఖ్యం. బౌలింగ్‌లో ఓపెనింగ్ స్పెల్స్ వేసేవాళ్లు, మిడిల్ ఓవర్లలో కట్టడి చేసేవారు ఉంటే సరిపోదు. డెత్ ఓవర్ స్పెషలిస్టులు కూడా ఉండాలి. అప్పుడే తక్కువ టార్గెట్లను కాపాడుకోవచ్చు. అదే టైమ్‌లో బ్యాటింగ్‌లో బెస్ట్ ఫినిషర్స్ జట్టులో ఉండాలి. అప్పుడే లోయరార్డర్ సాయంతో భారీ స్కోర్లు సెట్ చేసేందుకు, ఛేజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫినిషర్ల విషయం ఎత్తగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీనే.
టాపార్డర్, మిడిలార్డర్ త్వరగా కుప్పకూలిపోతే బ్యాటింగ్ బాధ్యతను తన భుజాల మీద వేసుకునేవాడు మాహీ. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌లను గెలిపించేవాడు. లోయరార్డర్ సాయంతో ఒక్కో రన్ చేస్తూ అసాధ్యమనుకున్న ఎన్నో మ్యాచుల్లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు ధోని. భారత జట్టులో ధోని తర్వాత మ్యాచులను ముగించే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచులను ఫినిష్ చేయడం ఈ మోడ్రన్ మాస్టర్‌కు ఒక అలవాటుగా మారింది. ఛేజింగ్ టైమ్‌లో మరింత పట్టుదలతో ఆడే కోహ్లీ.. చివరి వరకు ఉండి భారత్‌కు విజయాలను అందిస్తున్నాడు. అందుకే అతడ్ని ఛేజింగ్ కింగ్ అని అంటుంటారు.
మూడో డౌన్లో వచ్చే కోహ్లీ కంటే కూడా ఆరో డౌన్, ఏడో డౌన్లో ఉండే బ్యాటర్లపై మ్యాచ్‌లు ఫినిష్ చేసే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే హార్దిక్ పాండ్యాను ఈ రోల్ కోసం టీమ్ మేనేజ్మెంట్ పుష్ చేస్తూ వస్తోంది. ఇందులో పాండ్యా బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు రిటైరైనా.. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలిగినా హార్దిక్ బ్యాటింగ్ ఆర్డర్లో పైకి రావాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త ఫినిషర్‌ను ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రింకూ సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే రూపంలో మిడిలార్డర్లో మంచి యంగ్‌స్టర్స్ ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
ఇప్పటికే వీళ్లు తమను తాము ప్రూవ్ చేసుకున్నా.. ఇంటర్నేషనల్ లెవల్లో మరింత నిలకడగా పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టీ20లో రింకూ సింగ్ ఆఖర్లో వచ్చి ఫుల్ టెన్షన్లోనూ కూల్‌గా మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో హైదరాబాదీ తిలక్ మాత్రం త్వరగా ఔటయ్యాడు. చివరి వరకు ఉండి మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకుంటే అనవసరంగా భారీ షాట్‌కు వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడు. దీనిపై తాజాగా రియాక్ట్ అయ్యాడు తిలక్.
ఉత్కంఠగా సాగే టీ20ల్లో మ్యాచ్‌లు ఎలా ఫినిష్ చేయాలనేది సహచర ప్లేయర్ రింకూ సింగ్ నుంచి నేర్చుకుంటున్నానని తిలక్ వర్మ అన్నాడు. వచ్చే మ్యాచ్‌ల్లో పక్కాగా తానే మ్యాచ్‌లు ఫినిష్ చేస్తానని మాటిచ్చాడు తిలక్. తన మీద ఎలాంటి ప్రెజర్ లేదన్నాడు. టీమ్‌లో తనకు ఓ రోల్ ఉందని.. దాన్ని పోషిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తాను కొట్టగలిగే చోట బాల్ దొరికితే బాదేస్తానని.. లేకపోతే స్ట్రయిక్ రొటేట్ చేస్తానన్నాడు తిలక్. మరి.. రింకూ నుంచి ఫినిషింగ్ పాఠాలు నేర్చుకుంటున్నానంటూ తిలక్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆసీస్ పేసర్ బెరెన్‌డార్ఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అతడు భయపెడుతున్నాడంటూ..!
Tilak Varma said “I would like to finish the games like Rinku Singh”. [Press] pic.twitter.com/8DnGPcM0WO
— Johns. (@CricCrazyJohns) November 25, 2023