iDreamPost

ఆసీస్ పేసర్ బెరెన్​డార్ఫ్​ ఆసక్తికర వ్యాఖ్యలు.. అతడు భయపెడుతున్నాడంటూ..!

  • Author singhj Published - 01:07 PM, Sun - 26 November 23

భారత్​తో రెండో టీ20కి ముందు ఆస్ట్రేలియా పేసర్ జేసన్ బెరెన్​డార్ఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాలోని ఓ బ్యాటర్ తమను భయపెడుతున్నాడని చెప్పాడు.

భారత్​తో రెండో టీ20కి ముందు ఆస్ట్రేలియా పేసర్ జేసన్ బెరెన్​డార్ఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాలోని ఓ బ్యాటర్ తమను భయపెడుతున్నాడని చెప్పాడు.

  • Author singhj Published - 01:07 PM, Sun - 26 November 23
ఆసీస్ పేసర్ బెరెన్​డార్ఫ్​ ఆసక్తికర వ్యాఖ్యలు.. అతడు భయపెడుతున్నాడంటూ..!

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ను విజయంతో మొదలుపెట్టిన టీమిండియా అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది. ఈ రెండు టీమ్స్ మధ్య తిరువనంతపురంలోని గ్రీన్​ఫీల్డ్ స్టేడియంలో ఇవాళ రెండో టీ20 జరగనుంది. ఈ సిరీస్​లో ఆడుతున్న ఆసీస్​ జట్టులో స్టార్లు ఉన్నారు. కానీ భారత్ మాత్రం ద్వితీయ శ్రేణి జట్టుతోనూ బరిలోకి దిగుతోంది. కంగారూ టీమ్​లో స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, బెరెన్​డార్ఫ్ లాంటి ఫేమస్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ టీమిండియా మాత్రం పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతోనే ఆడుతోంది. అయినా మొదటి టీ20లో ఆసీస్​కు షాకిచ్చింది. ఇదే ఊపులో ఇంకో మ్యాచ్ కూడా నెగ్గి సిరీస్​లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. సిరీస్​ను గెలుచుకొని వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధలో ఉన్న ఫ్యాన్స్​కు రిలీఫ్ కలిగించాలని చూస్తోంది.

ఫస్ట్ టీ20లో ఆడిన టీమ్​లో టీమిండియా ఒక మార్పు చేసే అవకాశాలున్నాయి. తిరువనంతపురం వికెట్ పేస్​కు అనుకూలంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అక్కడ జరిగిన మ్యాచుల్లో చాలా మటుకు లో-స్కోరింగ్​గానే ముగిశాయి. కాబట్టి భారత్ అదనపు పేసర్​ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మ్యాచ్​లో స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ అటు బౌలింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ ఫెయిలయ్యాడు. కీలక దశలో చెత్త షాట్ ఆడి పెవిలియన్​కు చేరాడు. దీంతో ఆఖర్లో టెన్షన్ నెలకొన్నా రింకూ సింగ్ నిలబడటంతో భారత్ విక్టరీ కొట్టింది. గ్రీన్​ఫీల్డ్ వికెట్​కు పేస్ అనుకూలిస్తుంది కాబట్టి అక్షర్ ప్లేసులో పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబే టీమ్​లోకి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అతడు వస్తే లోయరార్డర్ కూడా పటిష్టంగా మారుతుంది. పేస్ వికెట్ కాబట్టి ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

రెండో టీ20కి ముందు ఆస్ట్రేలియా స్పీడ్​స్టర్ బెరెన్​డార్ఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక భారత బ్యాటర్ తమను భయపెడుతున్నాడని అన్నాడు. అతను మరెవరోకాదు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అని చెప్పాడు. ‘సూర్యకుమార్​ను ఆపడం చాలా కష్టం. అతడ్ని ఆపాలంటే ఒకటే మార్గం ఉంది. అది మన చేతిలో ఉన్న బాల్​ను వేరే బౌలర్​కు ఇచ్చేయడమే. సూర్య, ఇషాన్​తో పాటు మిగిలిన టీమిండియా ప్లేయర్లు చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు. వాళ్లను సైలెంట్​గా ఉంచాలంటే కాస్త తెలివిగా, ఆలోచించి బౌలింగ్ చేయాలి. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్లకు బౌలింగ్ చేసేటప్పుడు ప్లానింగ్​లో వారి కంటే ఒక అడుగు ముందు ఉండాలి. కానీ అలా చేయడం చాలా కష్టం. అలాంటి బ్యాటర్లను అడ్డుకోవాలంటే బౌలింగ్​ స్పీడ్​, లైన్, లెంగ్త్​లో మార్పులు చేస్తూ ఉండాలి’ అని బెరెన్​డార్ఫ్ చెప్పుకొచ్చాడు. పిచ్ స్వింగ్​కు అనుకూలిస్తే తాను మరింత చెలరేగుతానని.. స్వింగ్ తన బలమన్నాడు. ఇక, టీమిండియాతో జరిగిన ఫస్ట్ టీ20లో ఈ పేసర్ 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. మరి.. సూర్య తమను భయపెడుతున్నాడంటూ బెరెన్​డార్ఫ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా ప్లేయర్ దీన గాథ.. నా దగ్గర డబ్బుల్లేవ్ అందుకే బౌలింగ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి