iDreamPost
android-app
ios-app

అదే తప్పును రిపీట్ చేస్తున్న BCCI.. భారీ మూల్యం తప్పదా?

  • Author singhj Published - 11:12 AM, Thu - 23 November 23

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో భారత జట్టులో కొన్ని లోపాలు బయటపడ్డాయి. అయినా వాటిని రెక్టిఫై చేసుకోకుండా బీసీసీఐ మళ్లీ అదే తప్పును రిపీట్ చేస్తోంది. దీంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో భారత జట్టులో కొన్ని లోపాలు బయటపడ్డాయి. అయినా వాటిని రెక్టిఫై చేసుకోకుండా బీసీసీఐ మళ్లీ అదే తప్పును రిపీట్ చేస్తోంది. దీంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

  • Author singhj Published - 11:12 AM, Thu - 23 November 23
అదే తప్పును రిపీట్ చేస్తున్న BCCI.. భారీ మూల్యం తప్పదా?

సక్సెస్​లో ఉన్నప్పుడు ఎవరికీ ఏ తప్పులూ కనిపించవు. అదే ఫెయిల్యూర్ వస్తే మాత్రం అప్పటిదాకా కరెక్ట్​గా అనిపించినవి కూడా రాంగ్ అయిపోతాయి. ఇప్పుడు టీమిండియా పరిస్థితి అలాగే ఉంది. వరుసగా ఆసియా కప్-2023, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​లు నెగ్గింది రోహిత్ సేన. దీంతో ఫుల్ జోష్​తో వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టింది. ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్ మధ్య మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత్.. వరుసగా 10 విజయాలు సాధించి అందర్నీ షాక్​కు గురిచేసింది. రికార్డులు గొప్పగా లేకపోయినా తీవ్ర ఒత్తిడి మధ్య సెమీస్​లో న్యూజిలాండ్​ను ఓడించి ఫైనల్​కు చేరుకుంది. అయితే ఫైనల్లో ఆసీస్​ను కంగారెత్తిస్తారనుకుంటే వాళ్ల చేతుల్లో ఓడి కప్​ను చేజార్చుకున్నారు.

ఫైనల్లో ఓటమితో భారత టీమ్​లో ఒక్కసారిగా ఉన్న లోపాలు బాగా హైలైట్ అవుతున్నాయి. టీమ్ కాంబినేషన్ సరిగ్గా లేదని.. సెలక్షన్​లో తప్పులు ఉన్నాయని కొందరు అభిమానులు అంటున్నారు. బ్యాటింగ్​ యూనిట్​లో రవీంద్ర జడేజా తప్ప ఒక్క లెఫ్టాండర్ కూడా లేకపోవడం మైనస్​గా మారిందని అంటున్నారు. టాప్, మిడిలార్డర్‌‌ ఒక లెఫ్టీ ఉండుంటే బిగ్ ప్లస్ అయ్యుండేదని చెబుతున్నారు. బౌలింగ్​లోనూ ఒక లెఫ్టార్మ్ సీమర్ ఉండి ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లను మరింతగా భయపెట్టేవారమని కామెంట్స్ చేస్తున్నారు. సెమీస్ వరకు బాగానే ఉన్నా.. ఫైనల్ మ్యాచ్​లో మ్యాక్స్​వెల్, ట్రావిస్ హెడ్ లాంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లను కూడా సరిగ్గా ఎదుర్కోకపోవడం, భారీ షాట్లు ఆడకపోవడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

పార్ట్ టైమ్ బౌలర్లు లేని లోటు కూడా టీమిండియా విజయంపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. అయితే వీటన్నింటి కంటే కూడా పేస్ ఆల్​రౌండర్ లేకపోవడం మాత్రం మన టీమ్​ను బాగా దెబ్బ తీసిందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా లేని లోటు ఫైనల్ వరకు కనిపించలేదని.. కానీ టైటిల్ ఫైట్​లో మాత్రం ఆ తేడా స్పష్టంగా కనిపించిందన్నారు. బ్యాటింగ్​లో విలువైన రన్స్ చేస్తూ మ్యాచ్​ను ఫినిష్ చేయడంతో పాటు బౌలింగ్​లో బ్రేక్ త్రూ ఇచ్చే పాండ్యా లాంటి నిఖార్సయిన ఆల్​రౌండర్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెబుతున్నారు. ఆసీస్​లో మిచెల్ మార్ష్​ అలాంటి రోల్ పోషించాడని చెబుతున్నారు.

మార్ష్​తో పాటు మ్యాక్స్​వెల్, హెడ్ బౌలింగ్ వేసి తమ ఆల్​రౌండ్ స్కిల్స్ చూపించడం కంగారూలకు కలిసొచ్చిందని అంటున్నారు. అయితే అయిపోయిందేదో అయిపోయింది.. ఇకనైనా పేస్​ బౌలింగ్ ఆల్​రౌండర్​ విషయంలో టీమ్ మేనేజ్​మెంట్, సెలక్టర్లు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. కానీ ఫైనల్లో ఓటమి తర్వాత కూడా బీసీసీఐ మేలుకున్నట్లు కనిపించడం లేదు. ఆసీస్​తో ఐదు టీ20ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఒక్క పేస్ ఆల్​రౌండర్​ను కూడా సెలక్ట్ చేయలేదు. శివమ్ దూబె రూపంలో ఒక ఆప్షన్ కనిపిస్తున్నా అతడు మీడియం పేసరే. టాప్ బ్యాటర్లను కూడా వణికించే సత్తా, పదును అతడి బౌలింగ్​లో కనిపించడం లేదు.

స్పిన్ ఆల్​రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో టీమ్​లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నిఖార్సయిన పేస్ ఆల్​రౌండర్ మాత్రం దరిదాపుల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. గాయాలతో తరచూ జట్టుకు దూరమవుతున్న పాండ్యాను రీప్లేస్ చేసే ప్లేయర్ భారత బెంచ్​లో లేడు. టీ20 వరల్డ్ కప్​కు మరో 8 నెలల టైమ్ ఉంది. అప్పటివరకు డొమెస్టిక్ లెవల్ నుంచి ఏ క్రికెటర్​ను అయినా తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తారో లేదో చూడాలి. వరల్డ్ కప్ ఓటమి తర్వాత కూడా పేస్ ఆల్​రౌండర్​ను సెలక్ట్ చేయకుండా బీసీసీఐ మళ్లీ అదే తప్పు చేస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. ఈ విషయంలో సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్న ఆస్ట్రేలియా! లేకుంటే కప్పు ఇండియాదే