భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్‌ను ఎగరేసుకుపోయిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన సెకండ్ వన్డేలో మన జట్టు బ్యాటర్లు విజృంభించడంతో 399/5 స్కోరు సాధించింది. అనంతరం వర్షం కారణంగా ఆస్ట్రేలియా టార్గెట్‌ను 33 ఓవర్లకు 317 రన్స్‌కు కుదించారు. భారత బౌలర్ల దెబ్బకు కంగారూ టీమ్ 217 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఈ రెండు టీమ్స్ మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.
ఆసీస్‌తో రెండో వన్డేలో ఒక్క రుతురాజ్ గైక్వాడ్ (8) తప్ప మిగతా భారత బ్యాటర్లు అందరూ విజృంభించారు. శుబ్‌మన్ గిల్ (104), శ్రేయాస్ అయ్యర్ (105), కేఎల్ రాహుల్ (52), సూర్యకుమార్ యాదవ్ (72) కంగారూ బౌలర్లను చీల్చి చెండాడారు. అయితే భారత ఇన్నింగ్స్‌లో అయ్యర్ బ్యాటింగ్ మిగతా వారి కంటే సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. అతడికి అయిన గాయం నుంచి కోలుకున్నాడో లేదో అనే అనుమానం అందరిలోనూ ఉండేది. ఫామ్ చాటుకుంటాడా అనే సందేహాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో వీటన్నింటికీ చెక్ పెడుతూ ఆసీస్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు అయ్యర్. దీంతో ప్రపంచ కప్ జట్టులో అతడి స్థానం సుస్థిరమైనట్లేనని క్రికెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో మూడో పొజిషన్లో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ బాదాడు అయ్యర్. దీంతో ఆ స్థానంలో రెగ్యులర్‌గా ఆడే విరాట్ కోహ్లీ ప్లేస్‌కు అయ్యర్ గురిపెట్టాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. ‘గాయాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. అయితే నాపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా టార్గెట్ ఏంటో నాకు తెలుసు. దాని కోసమే కష్టపడుతున్నా. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశా. దేన్నీ సంక్లిష్టం చేసుకోను. టీమ్ కోసం ఏ ప్లేస్‌లో ఆడేందుకైనా రెడీ. కానీ, నంబర్ 3 పొజిషన్ మాత్రం కోహ్లీదే. దాన్ని అతడి నుంచి ఎవరూ తీసుకోలేరు. బెస్ట్ క్రికెటర్లలో విరాట్ ఒకడు’ అని శ్రేయాస్ అయ్యస్ మెచ్చుకున్నాడు.
ఇదీ చదవండి: భారత్ అరుదైన ఘనత.. వన్డేల్లో తొలి జట్టులో వరల్డ్ రికార్డ్!
Shreyas Iyer said, "Virat Kohli is one of the greatest that has sealed the No.3 spot. There's no chance I'm gonna steal that position from him". pic.twitter.com/1uGnKCBUcr
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 24, 2023