iDreamPost

ఒక్క ఇన్నింగ్స్​తో 6 రికార్డులు బ్రేక్.. రోహిత్ ఆడితే ఇలాగే ఉంటుంది!

  • Published Jun 24, 2024 | 9:52 PMUpdated Jun 24, 2024 | 9:52 PM

టీ20 ప్రపంచ కప్​-2024లో టీమిండియా బ్యాటర్ల నుంచి బిగ్ ఇన్నింగ్స్ రాలేదని ఫ్యాన్స్ బాధపడుతూ వచ్చారు. అయితే ఒక్క ఇన్నింగ్స్​తో వాళ్లను కేరింతలు కొట్టించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

టీ20 ప్రపంచ కప్​-2024లో టీమిండియా బ్యాటర్ల నుంచి బిగ్ ఇన్నింగ్స్ రాలేదని ఫ్యాన్స్ బాధపడుతూ వచ్చారు. అయితే ఒక్క ఇన్నింగ్స్​తో వాళ్లను కేరింతలు కొట్టించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 ఫైట్​లో తన విశ్వరూపం చూపించాడు హిట్​మ్యాన్. ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లను ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. 41 బంతుల్లోనే 7 బౌండరీలు, 8 సిక్సులతో 92 పరుగులు చేశాడు హిట్​మ్యాన్. నమ్మశక్యం కాని బ్యాటింగ్​తో అందర్నీ మెస్మరైజ్ చేశాడతను.

కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్న రోహిత్.. ఏకంగా 6 రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్​తో ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్​లో 200 సిక్సుల్ని అతడు కంప్లీట్ చేశాడు. పొట్టి ఫార్మాట్​లో ఇన్ని సిక్సులు కొట్టిన తొలి బ్యాటర్​గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్​లో 19 వేల పరుగుల మైల్​స్టోన్​ను దాటిన ఆటగాడిగానూ రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక బౌండరీలు కొట్టిన బ్యాటర్​గా మరో రికార్డు నెలకొల్పాడు రోహిత్. అలాగే ఒక జట్టు మీద అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగానూ నిలిచాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు భారత సారథి. తద్వారా ప్రస్తుత వరల్డ్ కప్​లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన బ్యాటర్​గా నిలిచాడు. అదే విధంగా టీమిండియా తరఫున టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్​గానూ హిట్​మ్యాన్ రికార్డు క్రియేట్ చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి