iDreamPost
android-app
ios-app

Jitesh Sharma: కుర్రాడు జితేశ్ భారీ సిక్స్.. దెబ్బకు అరిచేసిన ఆస్ట్రేలియా కెప్టెన్!

  • Author singhj Updated - 02:59 PM, Sat - 2 December 23

టీమిండియా కొత్త కుర్రాడు జితేష్ శర్మ కొట్టిన ఓ సిక్స్​కు ఆసీస్ కెప్టెన్​కు ఏం చేయాలో పాలుపోలేదు. దెబ్బకు అరిచేశాడు.

టీమిండియా కొత్త కుర్రాడు జితేష్ శర్మ కొట్టిన ఓ సిక్స్​కు ఆసీస్ కెప్టెన్​కు ఏం చేయాలో పాలుపోలేదు. దెబ్బకు అరిచేశాడు.

  • Author singhj Updated - 02:59 PM, Sat - 2 December 23
Jitesh Sharma: కుర్రాడు జితేశ్ భారీ సిక్స్.. దెబ్బకు అరిచేసిన ఆస్ట్రేలియా కెప్టెన్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. రాయ్​పూర్​లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ఆసీస్ మొదట ఫీల్డింగ్​ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32) మంచి పార్ట్​నర్​షిప్ అందించారు. వీళ్లిద్దరి జోరు చూస్తుంటే ఈ పిచ్ మీద 200 స్కోరు చేయడం ఈజీగా అనిపించింది. కానీ తక్కువ వ్యవధిలోనే టపాటపా వికెట్లు కోల్పోయింది భారత్. మొదట జైస్వాల్​ను ఆరోన్ హార్డీ ఔట్ చేశాడు. సిరీస్​లో ఫస్ట్ టైమ్ బరిలోకి దిగిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​ (8)ను స్పిన్నర్ తన్వీర్ సంగా వెనక్కి పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ (1) కూడా పెవిలియన్​కు చేరుకున్నాడు. దీంతో మన జట్టు తీవ్ర కష్టాల్లో పడింది.

13 పరుగుల గ్యాప్​లో టీమిండియా మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో కష్టాల్లో పడ్డ టీమ్​ను రుతురాజ్ ఆదుకున్నాడు. వికెట్లు పడకుండా చూసుకుంటూనే స్కోరు బోర్డును కదిలించాడు. జితేష్ శర్మ (35)తో కలసి అతడు మంచి పార్ట్​నర్​షిప్ అందించాడు. అనంతరం రుతు ఔటైనా.. రింకూ సింగ్ (46) మరోమారు అటాకింగ్ గేమ్ ఆడాడు. జితేష్-రింకూలు భారీ షాట్స్ కొడుతూనే వీలు చిక్కినప్పుడల్లా సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేశారు. ఈ జోడీ ఐదో వికెట్​కు 56 రన్స్ జోడించింది. అయితే ఆఖర్లో రింకూ, జితేష్​ తక్కువ వ్యవధిలో ఔటయ్యారు. వీళ్ల తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ (0), దీపక్ చాహర్ (0), రవి బిష్ణోయ్ (4) కూడా పెవిలియన్​కు క్యూ కట్టారు. దీంతో భారీ స్కోరు చేయాలనుకున్న భారత్ ఆశ నెరవేరలేదు. 9 వికెట్ల నష్టానికి 174 రన్స్ మాత్రమే చేయగలిగింది.

ఒక మాదిరి టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆసీస్​కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్ టిమ్ డేవిడ్ (31) వరుస బౌండరీలతో భారత బౌలర్లను భయపెట్టాడు. అయితే మరో ఓపెనర్ జోష్ ఫిలిప్ (8)ను రవి బిష్ణోయ్ ఔట్ చేయడంతో కంగారూ టీమ్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే హెడ్​ను అక్షర్ పటేల్ పెవిలియన్​కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆరోన్ హార్డీని కూడా అక్షరే ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 7.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 59 పరుగులతో ఉంది. ఆ టీమ్ నెగ్గాలంటే 74 బంతుల్లో 116 రన్స్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్ టైమ్​లో కొత్త ఆటగాడు జితేష్ శర్మ కొట్టిన ఓ సిక్స్ హైలైట్ అనే చెప్పాలి. ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆడిన జితేష్ కొట్టిన ఓ షాట్​కు ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్​కు దిమ్మ తిరిగింది. జితేష్ దెబ్బకు గట్టిగా అరిచిన వేడ్.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. జితేష్ సిక్స్​కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. టాపార్డర్ బ్యాటర్లు త్వరగా ఔటైన టైమ్​లో వచ్చిన జితేష్ ఆడిన ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 5 ఏళ్లు ఇర్ఫాన్​తో.. కొన్ని రాత్రులు గంభీర్! నటి కామెంట్స్ వైరల్!