iDreamPost

Payal Ghosh: 5 ఏళ్లు ఇర్ఫాన్​తో.. కొన్ని రాత్రులు గంభీర్! నటి కామెంట్స్ వైరల్!

  • Author singhj Updated - 03:25 PM, Sat - 2 December 23

టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్ గురించి ఓ ప్రముఖ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్ గురించి ఓ ప్రముఖ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

  • Author singhj Updated - 03:25 PM, Sat - 2 December 23
Payal Ghosh: 5 ఏళ్లు ఇర్ఫాన్​తో.. కొన్ని రాత్రులు గంభీర్! నటి కామెంట్స్ వైరల్!

టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లెఫ్టార్మ్ బౌలింగ్​తో, బ్యాటర్​గా పించ్ హిట్టింగ్​తో అతడు భారత్​కు ఎన్నో విజయాలు అందించాడు. మంచి ఆల్​రౌండ్ స్కిల్స్​తో టీమిండియాలో కీలక పాత్ర పోషించాడు. రివర్స్ స్వింగ్​తో అప్పట్లో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను పోయించాడు పఠాన్. అతడు ఇలాగే ఆడితే మరో కపిల్ దేవ్ అవుతాడని అంతా అనుకున్నారు. భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కారణంగా అతడి కెరీర్ నాశనమైంది. ఆఖర్లో వచ్చి బ్యాట్​తో దుమ్మురేపే పఠాన్​ను ఓపెనర్​గా పంపి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేశాడు చాపెల్. దీంతో బ్యాటింగ్​లో ఫెయిలైన అతడు.. బౌలింగ్​లోనూ ఫామ్​ను కోల్పోయాడు. ఆ తర్వాత తిరిగి టీమిండియాలోకి రావాలని ప్రయత్నించినా అందులో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్​తో పాటు డొమెస్టిక్ లెవల్లో క్రికెట్ ఆడుతూ గడిపేశాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా పలు లీగ్స్​లో ఆడుతున్న ఇర్ఫాన్​.. వీలున్నప్పుడల్లా భారత్ ఆడే మ్యాచులకు కామెంట్రీతో ఎంటర్​టైన్ చేస్తున్నాడు.

ఇప్పుడు ఎక్కువగా కామెంట్రీతోనే అందర్నీ అలరిస్తున్నాడు పఠాన్. ఇటీవల వన్డే వరల్డ్ కప్​లోనూ అతడు కామెంటేటర్స్​లో ఒకడిగా ఉన్నాడు. అలాంటి ఈ మాజీ క్రికెటర్ గురించి ఓ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో పఠాన్​తో తాను డేటింగ్​లో ఉన్నానని ప్రముఖ నటి పాయల్ ఘోష్ తెలిపింది. ఇర్ఫాన్​తో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్​ గురించి కూడా ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 2011 నుంచి పఠాన్​తో 5 ఏళ్ల పాటు తాను డేటింగ్​లో ఉన్నానని పేర్కొంది. అయితే ఆ టైమ్​లో గంభీర్​ సహా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తనను ఇష్టపడ్డారని తెలిపింది. కానీ తాను మాత్రం ఇర్ఫాన్​ను మాత్రమే లవ్ చేశానని ట్విట్టర్​లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్​లో రాసుకొచ్చింది. అతడ్ని తప్ప మరొకరి వైపు తాను చూడలేదని చెప్పుకొచ్చింది. ఈ విషయాల గురించి ఇర్ఫాన్​కి చెప్పానని.. గంభీర్ తనకు రాత్రి పూట ఇచ్చిన మిస్డ్ కాల్స్ వివరాలు కూడా చూపించానని ఆ ట్వీట్స్​లో పాయల్ రాసుకొచ్చింది.

‘2011 నుంచి ఇర్ఫాన్​ పఠాన్​తో ఐదేళ్ల పాటు డేటింగ్​లో ఉన్నా. అనంతరం అంతా ముగిసిపోయింది. గంభీర్, అక్షయ్ కుమార్ కూడా నన్ను ఇష్టపడ్డారు. కానీ నేను మాత్రం కేవలం ఇర్ఫాన్​నే లవ్ చేశా. అతడ్ని తప్ప మరెవర్నీ నేను చూడలేదు. ఇవన్నీ అతడికి చెప్పా. గంభీర్ నుంచి నాకు వచ్చిన మిస్డ్ కాల్స్ కూడా చూపించా. ఇర్ఫాన్​కు ఈ విషయాలన్నీ తెలుసు. అతడు నా ఫోన్ కాల్స్ చెక్ చేసేవాడు. ఒక డొమెస్టిక్ మ్యాచ్ కోసం ఇర్ఫాన్ పుణెలో ఉన్నప్పుడు అతడ్ని కలిశా. ఆ టైమ్​లో తన బ్రదర్ యూసఫ్ పఠాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ముందు కూడా పఠాన్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. పఠాన్ ఓ పెద్ద స్టార్. అందుకే ఆయన్ను ఎప్పటికీ గౌరవిస్తా’ అని పాయల్ ఘోష్ ట్వీట్లు చేసింది. అయితే ఇర్ఫాన్​, గంభీర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్​ అవుతున్నాయి. కాగా, టాలీవుడ్​లో పలు సినిమాల్లో నటించింది పాయల్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘ఊసరవెల్లి’ చిత్రంలో సెకండ్ హీరోయిన్​గా యాక్ట్ చేసింది. మరి.. పఠాన్​ను ఉద్దేశించి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: డేంజర్​లో రవీంద్ర జడేజా కెరీర్! వారసుడు వచ్చేశాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి