IND vs AUS: ఇండియా-ఆసీస్ మ్యాచ్​కు కరెంట్ కష్టాలు.. BCCI ఏం చేస్తున్నట్టు..?

  • Author singhj Published - 02:49 PM, Sun - 3 December 23

ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్​కు కరెంట్ కష్టాలు వచ్చిపడ్డాయి. దీంతో బీసీసీఐ ఏం చేస్తోందని అభిమానులు సీరియస్ అవుతున్నారు.

ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్​కు కరెంట్ కష్టాలు వచ్చిపడ్డాయి. దీంతో బీసీసీఐ ఏం చేస్తోందని అభిమానులు సీరియస్ అవుతున్నారు.

  • Author singhj Published - 02:49 PM, Sun - 3 December 23

వన్డే వరల్డ్ కప్​-2023 ఫైనల్లో ఓటమితో బాధలో ఉన్న ఫ్యాన్స్​కు ఊరట కలిగిస్తూ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ను గెలుచుకుంది టీమిండియా. ఐదు మ్యాచుల ఈ సిరీస్​ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్​లో ఆఖరి మ్యాచ్ ఇవాళ జరగనుంది. త్వరలో సౌతాఫ్రికా సిరీస్​ ఉన్న నేపథ్యంలో లాస్ట్ మ్యాచ్​లోనూ గెలిచి మరింత ఆత్మవిశ్వాసంతో సఫారీ టూర్​కు వెళ్లాలని భారత్ భావిస్తోంది. గత మ్యాచ్​లో జట్టుతో చేరిన శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఐదో టీ20లో వాళ్లిద్దరూ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. అదే టైమ్​లో ఇప్పటికే సిరీస్​ను కోల్పోయిన బాధలో ఉన్న కంగారూలు.. చివరి మ్యాచ్​లోనైనా నెగ్గి స్వదేశానికి కాస్త సంతృప్తితో వెళ్లాలని అనుకుంటున్నారు.

ఐదో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​లో ఒక మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. పేసర్ ముకేశ్ కుమార్ ప్లేస్​లో స్పిన్ ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్​కు ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) గురించి తెలిసిందే. ప్రపంచ క్రికెట్​లో మన బోర్డు గుత్తాధిపత్యం ఏ రేంజ్​లో ఉందో తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీసుకునే నిర్ణయాల్లో బీసీసీఐ ప్రభావం చాలా ఉందని క్రికెట్ అనలిస్టులు కూడా అంటుంటారు. అంతగా ప్రపంచ క్రికెట్​ మీద తన ముద్ర వేస్తోంది బీసీసీఐ. ధనిక బోర్డు కావడం, క్రికెట్​కు వచ్చే ఆదాయంలో సింహభాగం ఇండియా నుంచే వస్తుండటంతో మన బోర్డుకు ఐసీసీ భయపడాల్సిన పరిస్థితి తలెత్తిందని చెబుతుంటారు.

ధనిక బోర్డు అయిన బీసీసీఐ దగ్గర డబ్బులకు ఎలాంటి లోటు లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా కాసుల వర్షం కురుస్తోంది. టీమిండియా ఆడే ఇతర టోర్నమెంట్లు, స్పాన్సర్​షిప్స్, యాడ్స్ రూపంలో బోర్డు ఖజానాలో రూ.కోట్లకు రూ.కోట్లు వచ్చిపడుతున్నాయి. అయినా మన దేశంలో క్రికెట్​లో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టేడియాల నిర్వహణలో ఇది ఎక్కువగా ఉంది. ఐపీఎల్ లేదా ఏదైనా ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు ఉంటే తప్ప స్టేడియాలను పట్టించుకునే నాథుడే లేడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొన్ని స్టేడియాల్లో ఎలక్ట్రిసిటీ కూడా సరిగ్గా లేని పరిస్థితి. దీంతో బీసీసీఐ తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది.

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డేకు ఆతిథ్యం ఇచ్చింది రాయ్​పూర్​. అక్కడి షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్​లో కంగారూ టీమ్​ను 20 రన్స్ తేడాతో ఓడించింది టీమిండియా. ఈ గెలుపుతో సిరీస్​ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ నిర్వహణకు స్టేడియం నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారట. ఇండో-ఆసీస్ మ్యాచ్ కోసం ఏకంగా రూ.1.4 కోట్లు ఖర్చు చేశారట. రూ.3 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉండటంతో ఐదేళ్ల కిందే ఈ స్టేడియంలో కరెంట్ కట్ చేశారట అధికారులు. దీంతో భారత్ మ్యాచ్​ను​ సుమారు కోటిన్నర ఖర్చు చేసి జనరేటర్ల సాయంతో పూర్తి చేశారని సమాచారం. ఇది తెలిసిన నెటిజన్స్ బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. ఇంత ధనిక బోర్డు అయి ఉండి ఈ సమస్యను తీర్చలేరా? అని సీరియస్ అవుతున్నారు. మరి.. భారత్-ఆసీస్ మ్యాచ్​కు కరెంట్ కష్టాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!

Show comments