iDreamPost

Rohit Sharma: వీడియో: అంపైర్​తో రోహిత్ ఫన్నీ చాట్.. రెండుసార్లు డకౌట్ అయ్యానంటూ..!

  • Published Jan 18, 2024 | 10:53 AMUpdated Jan 18, 2024 | 10:57 AM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్​లో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. సహచర ప్లేయర్లతో పాటు అపోజిషన్ టీమ్​తోనూ, అంపైర్లతోనూ అలాగే వ్యవహరిస్తాడు. ఆఫ్ఘాన్​తో ఆఖరి టీ20లోనూ అంపైర్​తో ఫన్నీ చాట్ చేస్తూ కనిపించాడు. అంపైర్​-రోహిత్ చాట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్​లో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. సహచర ప్లేయర్లతో పాటు అపోజిషన్ టీమ్​తోనూ, అంపైర్లతోనూ అలాగే వ్యవహరిస్తాడు. ఆఫ్ఘాన్​తో ఆఖరి టీ20లోనూ అంపైర్​తో ఫన్నీ చాట్ చేస్తూ కనిపించాడు. అంపైర్​-రోహిత్ చాట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Published Jan 18, 2024 | 10:53 AMUpdated Jan 18, 2024 | 10:57 AM
Rohit Sharma: వీడియో: అంపైర్​తో రోహిత్ ఫన్నీ చాట్.. రెండుసార్లు డకౌట్ అయ్యానంటూ..!

వారెవ్వా.. ఇది ఆటంటే! గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. బాల్ బాల్​కూ టెన్షన్ మరింత పెరిగిపోయింది. అయితే ఆఖరి వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్​లో చివరికి టీమిండియానే నెగ్గింది. అయితే అద్భుతంగా పోరాడిన ఆఫ్ఘానిస్థాన్ మనసులు గెలుచుకుంది. భారత్-ఆఫ్ఘాన్ మధ్య జరిగిన మూడో టీ20లో రిజల్ట్ రెండో సూపర్ ఓవర్​లో తేలింది. రెండు టీమ్స్ 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా అక్కడా ఇరు జట్లు 16 పరుగులు చేయడంతో మరో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఈసారి డామినేట్ చేసిన భారత్.. 10 పరుగుల తేడాతో నెగ్గి ఆఫ్ఘాన్​ను 3-0తో వైట్​వాష్ చేసింది. ఈ మ్యాచ్​లో బ్యాట్​తో చెలరేగి సెంచరీ చేసిన రోహిత్ టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో అంపైర్​తో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. రెండుసార్లు డకౌట్ అయ్యానంటూ అంపైర్​ను నవ్వించాడు. అంపైర్​తో అతడు ఇంకేం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

భారత ఇన్నింగ్స్ ప్రారంభంలో అజ్మతుల్లా ఒమర్జాయి బౌలింగ్ వేస్తున్నాడు. అతడు వేసిన ఓ బాల్​ను రోహిత్ షాట్ కొట్టాడు. అయితే అంపైర్ దాన్ని లెగ్​బైగా ప్రకటించాడు. రన్ వచ్చినప్పటికీ తన ఖాతాలో పడకపోవడంతో హిట్​మ్యాన్ అంపైర్​తో మాట్లాడేందుకు వెళ్లాడు. నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న అతడు ఆ బాల్ బ్యాట్​కు తగిలిందన్నాడు. ‘వీరూ.. ఫస్ట్ బాల్​ థైప్యాడ్​కు తగిలిందని ఇచ్చావా. బాల్ బ్యాట్​కు తగిలింది. ఇప్పటికే సిరీస్​లో రెండుసార్లు డకౌట్ అయ్యా’ అని చెప్పాడు. దీంతో అంపైర్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాధారణంగా హిట్​మ్యాన్ ఎక్కువగా నవ్వుతూ, తోటి ప్లేయర్లను నవ్విస్తూ కనిపిస్తుంటాడు. అపోజిషన్ టీమ్ ప్లేయర్స్​తోనూ జోవియల్​గా ఉంటాడు. ఈ క్రమంలోనే అంపైర్​తో సాన్నిహిత్యం ఉండటంతో అరేయ్ వీరూ అంటూ పేరు పెట్టి పిలిచాడు. ఆల్రెడీ డకౌట్స్ అయ్యానని.. బ్యాట్​కు తగిలినా ఎందుకు రన్ ఇవ్వలేదని నవ్వుతూ అడిగాడు. దీనికి అంపైర్ కూడా నవ్వేసి వెళ్లిపోయాడు.

rohit funny chat with umpire 2

అంపైర్​తో రోహిత్ ఫన్నీ చాట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు అతడు హిట్​మ్యాన్ కాదు.. ఫన్నీ మ్యాన్ అని అంటున్నారు. అంపైర్​తో ఇంత సరదాగా మాట్లాడటం రోహిత్​కే సాధ్యం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆఫ్ఘాన్​తో సిరీస్​లో తొలి రెండు మ్యాచుల్లో భారత కెప్టెన్ ఫెయిలయ్యాడు. మొదటి మ్యాచ్​లో 0 పరుగులకు రనౌట్ అయిన రోహిత్.. రెండో మ్యాచ్​లోనూ గోల్డెన్ డకౌట్​గా వెనుదిరిగాడు. దీంతో ఆఖరి టీ20లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెర్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి. టీ20 వరల్డ్ కప్​కు ముందు చివరి మ్యాచ్ కావడంతో భారీ స్కోరు చేయాల్సిన వేళ రోహిత్ బ్యాట్​తో చెలరేగిపోయాడు. కెప్టెన్​గానూ తెలివైన నిర్ణయాలు తీసుకొని టీమ్​కు మరో విక్టరీ అందించాడు. మరి.. అంపైర్​తో రోహిత్ ఫన్నీ చాట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్​కు రోహితే దిక్కు.. 2 సూపర్ ఓవర్లు నేర్పిన పాఠం ఇదే..!

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి