iDreamPost
android-app
ios-app

Rinku Singh: వీడియో: రింకూను స్లెడ్జ్ చేసిన ఆఫ్ఘాన్ బౌలర్.. స్టార్ బ్యాటర్ రియాక్షన్ వైరల్!

  • Published Jan 16, 2024 | 12:37 PM Updated Updated Jan 16, 2024 | 12:37 PM

క్రికెట్​లో స్లెడ్జింగ్ అనేది కామనే. కానీ దానికి ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరమైన విషయంగా చెప్పొచ్చు. టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్​ను ఓ ఆఫ్ఘానిస్థాన్ బౌలర్ స్లెడ్జ్ చేశాడు.

క్రికెట్​లో స్లెడ్జింగ్ అనేది కామనే. కానీ దానికి ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరమైన విషయంగా చెప్పొచ్చు. టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్​ను ఓ ఆఫ్ఘానిస్థాన్ బౌలర్ స్లెడ్జ్ చేశాడు.

  • Published Jan 16, 2024 | 12:37 PMUpdated Jan 16, 2024 | 12:37 PM
Rinku Singh: వీడియో: రింకూను స్లెడ్జ్ చేసిన ఆఫ్ఘాన్ బౌలర్.. స్టార్ బ్యాటర్ రియాక్షన్ వైరల్!

టీమిండియా వరుస విక్టరీలతో దూసుకెళ్తోంది. ఇటీవల సౌతాఫ్రికా టూర్​ను సక్సెస్​ఫుల్​గా ముగించుకొని వచ్చిన భారత జట్టు.. ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​ను కూడా కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్​ను సొంతం చేసుకుంది. ఇండోర్​ ఆతిథ్యం ఇచ్చిన రెండో టీ20లో టాస్ నెగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్​ స్టార్ట్ చేసిన ఆఫ్ఘానిస్థాన్​ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. గుల్బదీన్ నయీబ్ (57) ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్​కు సహకరిస్తున్న పిచ్​ మీద ఆఫ్ఘాన్ నిర్దేశించిన టార్గెట్​ను భారత్ 15.4 ఓవర్లలోనే ఊదిపారేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబె (63 నాటౌట్) బ్యాట్లతో చెలరేగి టీమ్​కు సిరీస్ విక్టరీని అందించారు. అయితే ఈ మ్యాచ్​లో భారత ఫినిషర్ రింకూ సింగ్​ను ఓ ప్రత్యర్థి బౌలర్ స్లెడ్జింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

టీమిండియా ఇన్నింగ్స్ 16వ ఓవర్​లో రింకూ సింగ్ (9 నాటౌట్) నాన్​ స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్నాడు. అప్పటికే తొలి మ్యాచ్​లో ఓడిన ఆఫ్ఘాన్.. రెండో టీ20లోనూ ఓటమి అంచున ఉంది. దీంతో ఆ జట్టు పేసర్ ఫజల్​హక్ ఫారుకీ ఫ్రస్టేషన్​కు లోనయ్యాడు. రన్ కోసం ప్రయత్నించిన రింకూను తన లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్​తో అడ్డుకున్నాడు. భారత స్టార్ బ్యాటర్​ను నెట్టేస్తూ ఏవో కామెంట్స్ చేశాడు. దీంతో అంపైర్ వచ్చి బౌలర్​ను పక్కకు తీసుకెళ్లాడు. అయితే రింకూ మాత్రం నవ్వుకొని సైలెంట్​గా ఉండిపోయాడు. ఫారుకీ వైపు చూస్తూ తన గ్లవ్స్ సరిచేసుకున్నాడు. రింకూను ఆఫ్ఘాన్ పేసర్ స్లెడ్జ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు అనవసరంగా రింకూతో పెట్టుకున్నాడని.. అతడి బౌలింగ్​లో భారీగా రన్స్ చేసి కెరీర్ క్లోజ్ చేస్తాడని వార్నింగ్ ఇస్తున్నారు. నోటితో కాదు బ్యాట్​తోనే రింకూ ఆన్సర్ ఇస్తాడని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భారత బ్యాటర్లతో పెట్టుకుంటే కెరీర్ అయిపోయినట్లేనని హెచ్చరిస్తున్నారు.

ఫారుకీ గెలికాడని రింకూ కూడా రెచ్చిపోయి ఉంటే సీన్ వేరేలా ఉండేదని.. అతడు సంయమనం పాటించడం సూపర్బ్ అని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. ఫామ్​లో ఉన్న ప్లేయర్లు తమ కంటే తోపు ఎవరూ లేరని రెచ్చిపోతారని.. కానీ రింకూ మాత్రం కూల్​, కామ్​గా ఉండటం అతడి మెచ్యూరిటీ ఏంటో చూపిస్తోందని చెబుతున్నారు. అయితే ఫారుకీని మాత్రం రింకూ వదలడని.. ఆఫ్ఘాన్​తో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా అతడికి దబిడిదిబిడేనని అంటున్నారు. ఇక, రెండో టీ20లో 9 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు రింకూ. మ్యాచ్​లు ఫినిష్ చేయడంలో అతడు ఆరితేరుతున్నాడు. సిచ్యువేషన్​ను బట్టి గేర్లు మారుస్తూ భారీగా పరుగులు చేస్తున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రింకూ ఇదే ఫామ్​ను కంటిన్యూ చేస్తే టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియాకు తిరుగుండదు. మరి.. స్లెడ్జింగ్​కు రింకూ ఇచ్చిన రియాక్షన్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: నెం.2గా ఉండటమే ఇష్టం.. నెం.1 అతనే! కోహ్లీ షాకింగ్ కామెంట్స్

 

View this post on Instagram

 

A post shared by ROCKY EDITZ (@ig_rockyeditz_)