iDreamPost
android-app
ios-app

Virat Kohli: నెం.2గా ఉండటమే ఇష్టం.. నెం.1 అతనే! కోహ్లీ షాకింగ్ కామెంట్స్

  • Published Jan 15, 2024 | 3:03 PM Updated Updated Jan 15, 2024 | 3:03 PM

నాకు నెం.2గా ఉండటమే ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఆ దిగ్గజ క్రికెటర్ ఎప్పుడూ నాకు నెం.1నే అని చెప్పుకొచ్చాడు. మరి ఆ నెం.1 దిగ్గజ బ్యాటర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నాకు నెం.2గా ఉండటమే ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఆ దిగ్గజ క్రికెటర్ ఎప్పుడూ నాకు నెం.1నే అని చెప్పుకొచ్చాడు. మరి ఆ నెం.1 దిగ్గజ బ్యాటర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jan 15, 2024 | 3:03 PMUpdated Jan 15, 2024 | 3:03 PM
Virat Kohli: నెం.2గా ఉండటమే ఇష్టం.. నెం.1 అతనే! కోహ్లీ షాకింగ్ కామెంట్స్

సెలబ్రిటిలు సాధారణ వ్యక్తులకు రోల్ మోడల్ గా ఉండటమే కాదు.. సెలబ్రిటిలకు సైతం రోల్ మోడల్ లు ఉంటారు. ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు వారు వెల్లడిస్తూనే ఉంటారు. ఇక జెంటిల్ మెన్ లాంటి క్రికెట్ గేమ్ లో తమ సహచర ఆటగాళ్లపై ఉన్న ఇష్టాన్ని, అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియపరుస్తూ ఉంటారు. తాజాగా ఆఫ్గాన్ తో జరిగిన రెండో టీ20తో పొట్టి ఫార్మాట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే నాకు నెం.2గా ఉండటమే ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ దిగ్గజ క్రికెటర్ ఎప్పుడూ నాకు నెం.1నే అని చెప్పుకొచ్చాడు. మరి ఆ నెం.1 దిగ్గజ బ్యాటర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో ఏలుతున్న క్రికెట్ రారాజు. కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ.. వరల్డ్ క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ, ముందుకుసాగుతున్నాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీ20 క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ రన్ మెషిన్. ఆఫ్గాన్ తో జరిగిన తొలి మ్యాచ్ కు అందుబాటులో లేకపోయిన విరాట్.. రెండో మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 16 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేశాడు కోహ్లీ. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కింగ్ కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. భారత దిగ్గజ క్రికెటర్, క్రికెటర్ ఆఫ్ గాడ్ సచిన్ టెండుల్కర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ను నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అని విరాట్ అడిగాడు. దానికి అతడు ఎలాంటి తడబాటు లేకుండా.. నువ్వు సెకండ్ ప్లేస్ లో ఉన్నావని, ఫస్ట్ ప్లేస్ లో సచిన్ టెండుల్కర్ నా ఫేవరెట్ క్రికెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. దానికి విరాట్ కోహ్లీ సైతం నాక్కూడా సచిన్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండటమే ఇష్టం.. ఇక నేను సెకండ్ ప్లేస్ లో ఉండటమే సంతోషం. అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సచిన్ రికార్డులను బద్దలు కొట్టినప్పటికీ.. అతడే నా ఫేవరెట్ అని, సచిన్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉండాలని కోరుకుంటున్నానని కోహ్లీ చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది కోహ్లీ మంచి
మనస్తత్వానికి నిదర్శనం అంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. మరి సచిన్ ఎప్పుడూ టాప్ లోనే ఉండాలన్న కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss