iDreamPost
android-app
ios-app

Rinku Singh: క్రికెట్​లో మోడ్రన్​ బ్రాడ్​మన్​గా రింకూ.. ఈ రికార్డులే ప్రూఫ్​!

  • Published Jan 18, 2024 | 12:54 PM Updated Updated Jan 18, 2024 | 12:54 PM

టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ తన అద్భుత ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తూ భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఈ యంగ్ బ్యాటర్.. మోడ్రన్ బ్రాడ్​మన్​గా అవతరించాడు.

టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ తన అద్భుత ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తూ భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఈ యంగ్ బ్యాటర్.. మోడ్రన్ బ్రాడ్​మన్​గా అవతరించాడు.

  • Published Jan 18, 2024 | 12:54 PMUpdated Jan 18, 2024 | 12:54 PM
Rinku Singh: క్రికెట్​లో మోడ్రన్​ బ్రాడ్​మన్​గా రింకూ.. ఈ రికార్డులే ప్రూఫ్​!

రింకూ సింగ్.. క్రికెట్​లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు. ధనాధన్ ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడీ భారత క్రికెటర్. కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తూ నయా ఫినిషర్​గా అవతరించాడు. అయితే రింకూ క్రికెట్ జర్నీ అంత సాఫీగా సాగలేదు. ఎవరి అండదండలు లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ జట్టులోకి సెలక్ట్ అయ్యాక అతడి రాత మారిపోయింది. మొదట్లో ఆ టీమ్ తరఫున ఫీల్డింగ్​లో అదరగొట్టిన రింకూకు క్రమంగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. దీంతో బ్యాట్​తో చెలరేగిన అతడు భారీ సిక్సులతో ఓడాల్సిన మ్యాచుల్లోనూ కేకేఆర్​ను గెలిపించాడు. దీంతో సెలక్టర్లు అతడికి టీమిండియాలో ఆడే ఛాన్స్ ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టిన రింకూ ఇప్పుడు టీమ్​లో కీలక ప్లేయర్​గా ఎదిగాడు. అంతేగాక క్రికెట్​లో నయా బ్రాడ్​మన్​గా అవతరించాడు.

రింకూను అందరూ ఇప్పుడు మోడ్రన్ బ్రాడ్​మన్​గా పిలుస్తున్నారు. దీనికి అతడి బ్యాటింగ్ యావరేజ్​ కారణమని చెప్పాలి. ఇప్పటిదాకా 2 వన్డేలు ఆడిన రింకూ 55 పరుగులు చేశాడు. అయితే అతడి టీ20 రికార్డ్స్ మాత్రం సూపర్బ్​గా ఉన్నాయి. 15 టీ20ల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించిన ఈ యంగ్ బ్యాటర్ 89 సగటుతో 356 పరుగులు చేశాడు. వీటిల్లో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్​లో అతడి స్ట్రయిక్ రేట్ 176.24గా ఉంది. రింకూ యావరేజీ 90కి దగ్గరగా ఉండటంతో అందరూ అతడ్ని బ్రాడ్​మన్​తో కంపేర్ చేస్తున్నారు. టీ20 క్రికెట్​లో రింకూ మోడ్రన్ బ్రాడ్​మని అని ప్రశంసిస్తున్నారు. ఇంత కన్​సిస్టెంట్స్​గా రన్స్ చేస్తున్న మరో క్రికెటర్ లేరని.. అతడికి ఆ ట్యాగ్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. మ్యాచులు ఫినిష్ చేయడంలో అతడు ఆరితేరాడని మెచ్చుకుంటున్నారు.

rinku like new brad man

రింకూను బ్రాడ్​మన్​ స్థాయి క్రికెటర్​తో పోల్చడం కరెక్ట్ కాదని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. బ్రాడ్​మన్ తన మొత్తం కెరీర్​లో 52 టెస్టులు ఆడి 6,996 పరుగులు చేశాడు. అతడి యావరేజీ 99.94. టెస్టులు ఆడాలంటే ఎంతో ఓపిక, ప్రతిభ కావాలి. అలాంటి లాంగ్ ఫార్మాట్​లో అన్ని మ్యాచులు ఆడి ఆ యావరేజీ మెయింటెయిన్ చేయడం కష్టం. కానీ దాన్ని సుసాధ్యం చేశాడు కాబట్టే డొనాల్డ్ బ్రాడ్​మన్ కాస్తా సర్ డొనాల్డ్ బ్రాడ్​మన్​గా గౌరవం పొందాడని నెటిజన్స్ గుర్తుచేస్తున్నారు. రింకూ గేమ్​కు వంక పెట్టలేం.. కానీ ఇంకా సుదీర్ఘ కాలం ఆడతాడు కాబట్టి అదే యావరేజీతో ఆడటం కష్టమని, అది కూడా టీ20ల్లో పాజిబుల్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఏదీ అసాధ్యం కాదని.. బ్రాడ్​మన్​ను స్ఫూర్తిగా తీసుకొని కంటిన్యూస్​గా పెర్ఫార్మ్ చేస్తూ పోతే మోడ్రన్ బ్రాడ్​మన్ అనే ట్యాగ్​ను రింకూ కాపాడుకోగలడని చెబుతున్నారు. మరి.. రింకూను నయా బ్రాడ్​మన్​గా అభివర్ణించడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ఆ సమయంలో రోహిత్‌ శర్మ.. అశ్విన్‌లా ఆలోచించాడు: ద్రవిడ్‌