వన్డే వరల్డ్ కప్-2023 రోజులు గడుస్తున్న కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్‌తో మెగా టోర్నీపై అభిమానుల్లో ఇంట్రెస్ట్ మరింత పెరుగుతోంది. వార్మప్ మ్యాచులకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. టీమిండియా ఆడిన రెండు మ్యాచులూ వరుణుడి వల్ల రద్దయ్యాయి. దీంతో వరల్డ్ కప్ సజావుగా సాగుతుందా? వాన వల్ల మ్యాచులు తుడిచిపెట్టుకుపోతాయేమోననే సందేహాలు నెలకొన్నాయి. కానీ టోర్నీ ఆరంభం అయ్యాక వర్షం ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. అయితే భారత్ ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్‌లో స్టేడియాలు ఫ్యాన్స్‌తో నిండట్లేదని.. ఖాళీ గ్రౌండ్స్ కనిపిస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారు.
స్టేడియాలకు అభిమానులు రాట్లేదనే విమర్శల్లో కొంత వాస్తవం ఉంది. మొదటి రెండు, మూడు మ్యాచులకు ఫ్యాన్స్ పెద్దగా రాలేదు. కానీ క్రమంగా గ్రౌండ్స్‌కు జనాలు భారీగా వస్తున్నారు. బుధవారం టీమిండియా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కూడా ఆడియెన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం ఇండియా మ్యాచ్‌కు ఢిల్లీ స్టేడియంలో ఖాళీ సీట్లు ఉన్నాయని సెటైర్స్ వేశాడు. వాన్ నోటి దూలకు ఇండియన్ ఫ్యాన్స్ దిమ్మతిరిగే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ‘వాన్.. ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. సాయంత్రానికి చూడు.. స్టేడియం ఫుల్ అవుతుంది’ అని ఒకరు ట్వీట్ చేశారు.
మైకేల్ వాన్ కామెంట్స్‌కు రిప్లయ్‌గా సాయంత్రం వేళ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం ఫ్యాన్స్‌తో పూర్తిగా నిండి ఉన్న వీడియోలను అభిమానులు షేర్ చేశారు. ‘ఢిల్లీలో మధ్యాహ్నం టైమ్‌లో ఎండ ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఈవినింగ్ వెళ్తారని’ కొందరు కామెంట్స్ చేశారు. ‘ఇది వీకెండ్ కాదు.. జాబ్స్‌కు వెళ్లి సాయంత్రం వేళ మ్యాచ్ చూసేందుకు వస్తారు’ అని మరికొందరు కౌంటర్ ఇచ్చారు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా దీనిపై స్పందించాడు. ‘వాన్.. నువ్వు మ్యాచ్ చూస్తున్నావా? ఖాళీగా ఉన్న గ్రౌండ్సా?’ అని ప్రశ్నించాడు. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన మైకేల్ వాన్‌పై మొత్తానికి ఇలా తిక్క కుదిర్చారు నెటిజన్స్. ఇండియన్ ఫ్యాన్స్ అంటే ఏంటో వాన్‌కు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. మరి.. ఇండియా మ్యాచ్‌పై వాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup: ఆఫ్ఘాన్‌తో మ్యాచ్.. భారత చెత్త బౌలర్ల లిస్ట్‌లో చేరిన సిరాజ్!
— Pr𝕏tham (@Prxtham_18) October 11, 2023
Are u watching the game or empty seats ?? https://t.co/4e1wgfAckn
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 11, 2023
Max capacity in England – 31000 (Lords)
Even 45% audience in any Indian stadium is greater than full pack stadium of England.
— Shubman Gang (@ShubmanGang) October 11, 2023
Have eye check up sir
— Iswarya Mohan (@IswaryaMohan7) October 11, 2023