ఆఫ్ఘానిస్థాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య నెలకొన్న కాంట్రవర్సీ గురించి తెలిసిందే. ఐపీఎల్ టైమ్‌లో వీళ్లిద్దరూ గొడవ పడటం.. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ నవీన్‌ను టార్గెట్ చేసుకొని ట్రోలింగ్ చేయడం చూసే ఉంటారు. అయితే మొత్తానికి దీనికి ఫుల్స్టాప్ పడింది. వరల్డ్ కప్-2023లో భాగంగా భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్‌లో కోహ్లీ-నవీన్‌లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో నవీన్‌ను మరోమారు రెచ్చగొట్టిన ఫ్యాన్స్‌కు కోహ్లీ సైగలు చేశాడు. ఇకపై దీన్ని ఆపేయాలని వారికి సూచించాడు. కోహ్లీ మంచితనంపై అంతటా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
కోహ్లీతో గొడవపై నవీన్ ఉల్ హక్ స్పందించాడు. ఇన్నాళ్లు తమ ఇద్దరి మధ్య జరిగిన గొడవకు ఎండ్ కార్డ్ వేశామని తెలిపాడు. ఇక మీదట తాము మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామన్నాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయంపై రియాక్ట్ అయిన నవీన్.. తాను, కోహ్లీ కలసిపోయామని చెప్పాడు. విరాట్ గ్రేట్ ప్లేయర్ అని.. తామిద్దరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నామన్నాడు. గ్రౌండ్లో ఏది జరిగినా అది గ్రౌండ్ లోపలకే పరిమితమన్నాడు. బయట తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని నవీన్ ఉల్ హక్ క్లారిటీ ఇచ్చాడు.
కోహ్లీకి తనకు మధ్య ఉన్న బేదాభిప్రాయాలకు ముగింపు పలుకుతున్నట్లు నవీన్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. ఇక, ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 రన్స్ చేసింది. ఉన్నంతలో ఆ జట్టు మంచి స్కోరే సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని పోరాడదగ్గ స్కోరు చేసింది. అయితే రోహిత్ శర్మ (131) తుఫాన్ ఇన్నింగ్స్ ముందు ఆ స్కోరు నిలబడలేకపోయింది. హిట్‌మ్యాన్‌తో పాటు ఇషాన్ కిషన్ (47), విరాట్ కోహ్లీ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) కూడా రాణించడంతో మరో 90 బంతులు ఉండగానే టీమిండియా టార్గెట్‌ను అందుకుంది.
ఇదీ చదవండి: కమ్‌బ్యాక్‌లో రెచ్చిపోతున్న KL రాహుల్.. అతడి సక్సెస్‌కు కారణం అదే!
Naveen Ul Haq said, “Virat Kohli is a very good player. We both shook hands, whatever happened on the field, stays inside the field only. We both shook hands and said let’s finish this”. pic.twitter.com/KlaoeMDfGD
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023